జనవరి 2019 అవార్డ్స్

లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్‌కు అశోచక్ర పురస్కారం
ఉగ్రవాదం బాటవీడి సైన్యంలో చేరి అమరుడైన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ(38)కి కేంద్ర ప్రభుత్వం జనవరి 24న అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వనీ భార్య మహజబీన్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో కుల్గామ్ జిల్లాలోని ఛెకీ అష్ముజీ గ్రామానికి చెందిన వనీ 2004లో ఆర్మీలోని ‘జమ్మూకశ్మీర్ 162 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్’లో చేరారు. ఉగ్రవాదులపై పోరాటంలో చూపిన తెగువకు గానూ 2007, 2018లో సేనామెడల్‌ను అందుకున్నారు.
2018, నవంబర్ 25న జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని హీరాపూర్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ వనీ ప్రాణాలు కోల్పోయారు. శరీరంలోకి బుల్లెట్లు దిగి రక్తం కారుతున్నప్పటికీ ఓ లష్కరే కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాతే ఆయన నేలకొరిగారు. ఈ నేపథ్యంలో వనీ చూపిన ధైర్యసాహసాలకు గానూ శాంతి సమయంలో అందించే అత్యున్నత సైనిక పురస్కారం అశోకచక్రను ప్రభుత్వం ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అశోకచక్ర పురస్కారం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ
ఎందుకు : అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు

నెల్లూరు, కరీంనగర్ జిల్లాలకు జాతీయ పురస్కారాలు
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు జాతీయ పురస్కారాలు లభించాయి. ఢిల్లీలో జనవరి 24న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఈ అవార్డులను అందజేశారు. బేటీ బచావ్ బేటీ పడావ్‌పై ప్రజల్లో విసృ్తత అవగాహన కల్పించడంలో విశేష కృషి చేసినందుకు ఈ జిల్లాలకు జాతీయ పురస్కారం దక్కింది.
జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం అమలులో సత్ఫలితాలు సాధించిన జిల్లాలకు అవార్డులు ప్రదానం చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నెల్లూరు, కరీంనగర్ జిల్లాలకు జాతీయ పురస్కారాలు
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఎందుకు : బేటీ బచావ్ బేటీ పడావ్‌పై ప్రజల్లో విసృ్తత అవగాహన కల్పించినందుకు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పీవీ పురస్కారం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నర్సింహారావు పేరిట అందించే తొలి జీవన సాఫల్య పురస్కారం లభించింది. ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో ఫిబ్రవరి 28న జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందించనున్నారు. ఇండియా నెక్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జ్యూరీ కమిటీ ఈ మేరకు జనవరి 25న వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీవీ నర్సింహారావు జీవన సాఫల్య పురస్కారం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

దివ్యాంగుల సంక్షేమ శాఖ డెరైక్టర్‌కు రాష్ట్రపతి పురస్కారం
తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు (డెరైక్టర్) బి.శైలజకు రాష్ట్రపతి పురస్కారం లభించింది. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఈ అవార్డును అందజేశారు. దివ్యాంగ ఓటర్లను ఉత్సాహపర్చి ఓటు హక్కు వినియోగించుకోవడంలో కీలక పాత్ర పోషించినందుకుగాను ఆమెకి ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దివ్యాంగుల సంక్షేమ శాఖ డెరైక్టర్‌కు రాష్ట్రపతి పురస్కారం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : బి.శైలజ
ఎందుకు : దివ్యాంగులు ఓటు వినియోగించుకోవడంలో కీలకపాత్ర పోషించినందుకు

నలుగురు జవాన్లకు కీర్తి చక్ర పురస్కారం
నలుగురు జవాన్లకు దేశ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ‘కీర్తిచక్ర’ లభించింది. ఈ అవార్డు పొందిన వారిలో వీరిలో జాట్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ తుషార్ గౌబా, 22వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సోవర్ విజయ్ కుమార్(మరణానంతరం)తోపాటు 2017లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్లు ప్రదీప్‌కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్ ఉన్నారు. మరోవైపు అసిస్టెంట్ కమాండెంట్ జైల్ సింగ్‌తోపాటు 9 మంది సైనికాధికారులకు శౌర్యచక్రను రక్షణ శాఖ ప్రకటించింది. ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ సహా 19 మంది సైనికాధికారులకు ‘పరమ్ విశిష్ట సేవా పతకం’ దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నలుగురు జవాన్లకు కీర్తి చక్ర పురస్కారం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : మేజర్ తుషార్ గౌబా, సోవర్ విజయ్ కుమార్, ప్రదీప్‌కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్ హజారికాలను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. సుమారు నాలుగేళ్ల తరువాత జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటిదాకా భారతరత్న పొందిన ప్రముఖుల సంఖ్య 48కి చేరింది. చివరగా 2015లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయకు భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రణబ్ ముఖర్జీ...
1935 డిసెంబర్ 11న పశ్చిమబెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లా మిరాటీలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. ఆయన తండ్రి కమద కింకార్ ముఖర్జీ, తల్లి రాజలక్ష్మి. చరిత్ర, రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన ప్రణబ్ కలకత్తా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. టీచర్‌గా వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ‘దేశేర్ దక్’(మాతృభూమి పిలుపు) అనే పత్రికకు జర్నలిస్టుగా పనిచేశారు.
కాంగ్రెస్ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ప్రణబ్ ముఖర్జీ కేంద్రంలో విదేశాంగ, రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి భిన్నమైన మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. 1987లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తదనంతర పరిణామాలతో 1989లో ఈ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2012, జూలై 25 నుంచి 2017 జూలై 25 వరకు భారత 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్ చేరారు.
మరోవైపు రచయితగా కూడా ప్రణబ్ పలు పుస్తకాలను రచించారు. 1987లో ‘ఆఫ్ ద ట్రాక్’పుస్తకాన్ని 1992లో ‘సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్’, చాలెంజెస్ బిఫోర్ ద నేషన్ పుస్తకాలను.. 2014లో ‘ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్’అనే పుస్తకాలను రచించారు. 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న ప్రణబ్.. 2010లో ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి అవార్డు పొందారు. 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.
నానాజీ దేశ్‌ముఖ్...
1916లో మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో జన్మించిన నానాజీ అసలు పేరు చండికాదాస్ అమృత్‌రావ్ దేశ్‌ముఖ్. 12 ఏళ్ల వయసులోనే స్వయం సేవక్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన బిర్లా కాలేజీ (నేటి బిట్స్)లో విద్యాభ్యాసం చేశారు. భారతీయ జన్‌సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు. 1977లో లోక్‌సభ ఎంపీగా గెలిచారు. 1999లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందేలా తనవంతు కృషి చేసినా నానాజీ దేశవ్యాప్తంగా సరస్వతీ విద్యామందిరాలను ప్రారంభించారు. మంథన్ అనే పత్రికను స్థాపించారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 500 గ్రామాల్లో సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలోనే తొలి గ్రామీణ యూనివర్సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని ‘చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయ’నానాజీ ఆలోచనల ఫలితమే. 1974నాటి జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకర్తల్లో ఒకరైన ఆయన 94 ఏళ్ల వయసులో 2010 ఆయన కన్నుమూశారు.
భూపేన్ హజారికా...
ఈశాన్య ప్రాంత సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన భూపేన్ హజారికా 1926 సెప్టెంబర్ 8న అస్సాంలోని సాదియాలో జన్మించారు. తల్లి నుంచి అస్సామీ సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ఆయన బ్రహ్మపుత్ర కవి, సుధాకాంతగా పేరొందారు. 1939లో సినిమాలో పాటలు పాడిన హజారికా 13 ఏళ్ల వయసులో సొంతంగా పాట రాశారు. ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషల్లోకి తర్జుమా అయ్యాయి. నేపథ్య గాయకుడు, సంగీతకారుడు, రచయిత, సినీ దర్శకుడిగా భారతీయ సినీరంగంపై తనదైన ముద్ర వేసిన హజారికాను జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వరించాయి.
1946లో బెనారస్ హిందూ వర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన హజారికా కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. ఆ తరువాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేందుకు 1949లో న్యూయార్క్ వెళ్లారు. 1953లో స్వదేశం తిరిగొచ్చిన ఆయన 1967లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998-2003 వరకు సంగీత నాటక అకాడమీకి చైర్మన్‌గా వ్యవహరించారు. 2011 నవంబర్ 5న ముంబైలో కన్నుమూశారు.

పద్మ పురస్కారాలు - 2019
2019 సంవత్సరానికి 112 మంది పేర్లతో పద్మ అవార్డుల (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) జాబితాను జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. జానపద గాయకురాలు తీజన్ బాయి, జిబౌటీకి చెందిన ఇస్మాయిల్ ఒమర్ గులేహ్, ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన బల్వంత్ పురందరేలు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వ్యక్తులకు 2019 ఏడాదికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది.
మొత్తంగా పద్మ అవార్డులు దక్కించుకున్న వారిలో 21 మంది మహిళలు, 11 మంది విదేశీయులు, ముగ్గురు దివంగతులు, ఒకరు ట్రాన్స్ జెండర్ ఉన్నారు. పురస్కారాలకు ఎంపికై న వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు.
పద్మ పురస్కారాల గ్రహీతలు-2019

పద్మ విభూషణ్ విజేతలు(4)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం

1

తీజన్ బాయి

కళలు

ఛత్తీస్‌గఢ్

2

ఇస్మాయిల్ ఒమర్ గులేహ్(విదేశీయుడు)

ప్రజా సంబంధాలు

జిబౌటి

3

అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్

వర్తకం, పరిశ్రమలు

మహారాష్ట్ర

4

బల్వంత్ మోరేశ్వర్ పురందరే

కళలు-నటన-థియేటర్

మహారాష్ట్ర

పద్మ భూషణ్ విజేతలు(14)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం

5

జాన్ చాంబర్స్(విదేశీయుడు)

వర్తకం, వాణిజ్యం, టెక్నాలజీ

యూఎస్‌ఏ

6

సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా

ప్రజాసంబంధాలు

పంజాబ్

7

ప్రవీణ్ గోర్ధాన్(విదేశీయుడు)

ప్రజాసంబంధాలు

దక్షిణాఫ్రికా

8

మహాశయ్ ధరమ్‌పాల్ గులాటీ

వర్తకం, పరిశ్రమలు

ఢిల్లీ

9

దర్శన్ లాల్ జైన్

సామాజిక సేవ

హర్యానా

10

అశోక్ లక్ష్మణ్‌రావు కుకడే

వైద్యం, ఆరోగ్యం

మహారాష్ట్ర

11

కరియా ముండా

ప్రజా సంబంధాలు

జార్ఖండ్

12

బుధాదిత్య ముఖర్జీ

కళలు-సంగీతం-సితార్

పశ్చిమ బెంగాల్

13

మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్

కళలు-నటన-సినిమా

కేరళ

14

ఎస్.నంబి నారాయణ్

సైన్స్, ఇంజినీరింగ్-స్పేస్

కేరళ

15

కుల్‌దీప్ నయ్యర్(మరణానంతరం)సాహిత్యం, విద్య(జర్నలిజం)

 

ఢిల్లీ

16

బచేంద్రిపాల్

క్రీడలు-పర్వతారోహణం

ఉత్తరాఖండ్

17

వి.కె.షుంగ్లు

సివిల్ సర్వీస్

ఢిల్లీ

18

హుకుందేవ్ నారాయణ్ యాదవ్

ప్రజాసంబంధాలు

బిహార్

పద్మశ్రీ విజేతలు(94)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం

19

రాజేశ్వర్ ఆచార్య

కళలు-హిందూస్థానీ సంగీతం

ఉత్తరప్రదేశ్

20

బంగారు అడిగలర్

ఆధ్యాత్మికం

తమిళనాడు

21

ఇలియాస్ అలీ

వైద్యం-సర్జరీ

అస్సాం

22

మనోజ్ బాజ్‌పేయీ

కళలు-నటన-సినిమాఋ

మహారాష్ట్ర

23

ఉద్ధబ్ కుమార్ భారేలి

సైన్స్, ఇంజినీరింగ్- గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్

అస్సాం

24

ఒమేష్ కుమార్ భార్టీ

వైద్యం-రేబిస్

హిమాచల్ ప్రదేశ్

25

ప్రీతమ్ భార్త్వాన్

కళలు-సంగీతం

ఉత్తరాఖండ్

26

జ్యోతి భట్

కళలు- చిత్రలేఖనం

గుజరాత్

27

దిలీప్ చక్రవర్తి

ఆర్కియాలజీ

ఢిల్లీ

28

మమ్మేన్ చాంధీ

వైద్యం-హెమటాలజీ

పశ్చిమ బెంగాల్

29

స్వపాన్ చౌదరీ

కళలు-సంగీతం-తబలా

పశ్చిమ బెంగాల్

30

కన్వల్ సింగ్ చౌహాన్

వ్యవసాయం

హర్యానా

31

నీల్ ఛెత్రి

క్రీడలు-ఫుట్‌బాల్

తెలంగాణ

32

దిన్‌యార్ కాంట్రాక్టర్

కళలు-నటన

మహారాష్ట్ర

33

ముక్తాబేన్ ఫంకజ్‌కుమార్ ద గ్లీ

సామాజిక సేవ

గుజరాత్

34

బాబులాల్ దహియా

వ్యవసాయం

మధ్యప్రదేశ్

35

థంగా డార్‌లోంగ్

కళలు-సంగీతం-వేణువు

త్రిపుర

36

ప్రభుదే వా

కళలు-నృత్యం

కర్ణాటక

37

రాజ్‌కుమారి దేవి

వ్యవసాయం

బిహార్

38

భగీరథి దేవి

ప్రజా సంబంధాలు

బిహార్

39

బల్‌దేవ్ సింగ్ ధిల్లాన్

సైన్స్, ఇంజనీరింగ్-వ్యవసాయం

పంజాబ్

40

దోణవల్లి హారిక

క్రీడలు-చెస్

ఆంధ్రప్రదేశ్

41

గోదావరి దత్తా

క ళలు-చిత్రలేఖనం

బిహార్

42

గౌతమ్ గంభీర్

క్రీడలు- క్రికెట్

ఢిల్లీ

43

ద్రౌపది గిమిరాయ్

సామాజిక సేవ

సిక్కిం

44

రోహ్ని గాడ్‌బోల్

సైన్స్, ఇంజనీరింగ్-న్యూక్లియర్

కర్ణాటక

45

సందీప్ గులేరియా

వైద్యం-సర్జరీ

ఢిల్లీ

46

ప్రతాప్ సింగ్ హార్దియా

వైద్యం-ఆప్తామాలజీ

మధ్యప్రదేశ్

47

బులు ఇమామ్

సామాజిక సేవ-సంస్కృతి

జార్ఖండ్

48

ఫెడరిక్ ఇరినా(విదేశీయురాలు)సామాజిక సేవ

జర్మనీ

 

49

జొరావర్‌సిన్హ్ జాదవ్

కళలు-నృత్యం

గుజరాత్

50

ఎస్. జయశంకర్

సివిల్ సర్వీస్

ఢిల్లీ

51

నర్సింగ్ దేవ్ జమ్వాల్

సాహిత్యం, విద్య

జమ్మూకశ్మీర్

52

ఫయాజ్ అహ్మద్ జాన్

కళలు-క్రాఫ్ట్-పేపీయర్ మచే

జమ్మూకశ్మీర్

53

కె.జీ జయన్

కళలు-సంగీతం

కేరళ

54

సుభాష్ కక్(విదేశీయుడు)

సైన్స్, ఇంజినీరింగ్

అమెరికా

55

శరత్ కమల్

క్రీడలు-టేబుల్ టెన్నీస్

తమిళనాడు

56

రజనీ కాంత్

సామాజిక సేవ

ఉత్తరప్రదేశ్

57

సుదమ్ కటే

వైద్యం-సికిల్ సెల్

మహారాష్ట్ర

58

వామన్ కేంద్రే

కళలు-నటన

మహారాష్ట్ర

59

ఖాదర్ ఖాన్(మరణానంతరం)

కళలు-సినిమాలు

కెనడా

60

అబ్దుల్ గఫార్ ఖాత్రి

కళలు-చిత్రలేఖనం

గుజరాత్

61

రవీంద్ర కోల్హే, స్మితా కోల్హే (సంయుక్తంగా)

వైద్యం-హెల్త్‌కేర్

మహారాష్ట్ర

62

బాంబేలా దేవి లైష్‌రామ్

క్రీడలు-ఆర్చరీ

మణిపూర్

63

కైలాశ్ మధ్ బైయా

సాహిత్యం-విద్య

మధ్యప్రదేశ్

64

రమేశ్ బాబాజీ మహారాజ్

సామాజిక సేవ

ఉత్తరప్రదేశ్

65

వల్లభ్‌భాయ్ వస్రమ్‌భాయ్ మర్వానియా

వ్యవసాయం

గుజరాత్

66

గీతా మెహతా (విదేశీయురాలు)

సాహిత్యం-విద్య

యూఎస్‌ఏ

67

షాదాబ్ మొహమ్మద్

వైద్యం- డెంటీస్ట్రీ

ఉత్తరప్రదేశ్

68

కె.కె మహమ్మద్

ఆర్కియాలజీ

కేరళ

69

శ్యామ ప్రసాద్ ముఖర్జీ

వైద్యం-హెల్త్‌కేర్

జార్ఖండ్

70

దైతారీ నాయక్

సామాజిక సేవ

ఒడిశా

71

శంకర్ మహదేవన్ నారాయణ్

వోకల్-సినిమాలు

మహారాష్ట్ర

72

శంతను నారాయణ్(విదేశీయుడు)

వర్తకం

అమెరికా

73

నర్తకి నటరాజ్(ట్రాన్స్ జెండర్)

భరతనాట్యం

తమిళనాడు

74

త్సెరింగ్ నార్బో

వైద్యం-సర్జరీ

జమ్మూకశ్మీర్

75

అనూప్ రంజన్ పాండే

కళలు-సంగీతం

ఛత్తీస్‌గఢ్

76

జగదీశ్ ప్రసాద్ పరీఖ్

వ్యవసాయం

రాజస్థాన్

77

గణ్‌పత్‌భాయ్ పటేల్ (విదేశీయుడు)

సాహిత్యం-విద్య

యూఎస్‌ఏ

78

బిమల్ పటేల్

ఆర్కిటెక్చర్

గుజరాత్

79

హుకుమ్‌చంద్ పటీదార్

వ్యవసాయం

రాజస్థాన్

80

హర్వీందర్ సింగ్ పుల్కా

ప్రజా సంబంధాలు

పంజాబ్

81

మదురై చిన్న పిళ్లై

సామాజిక సేవ

తమిళనాడు

82

తావ్ పోర్చాన్ లించ్(విదేశీయురాలు)

యోగా

అమెరికా

83

కమలా పుజారి

వ్యవసాయం

ఒడిశా

84

బజ్‌రంగ్ పూనియా

క్రీడలు-రెజ్లింగ్

హర్యానా

85

జగత్ రామ్

వైద్యం-ఆప్తల్మాలజీ

ఛండీగఢ్

86

ఆర్.వి.రమణి

వైద్యం-ఆప్తల్మాలజీ

తమిళనాడు

87

దేవరపల్లి ప్రకాశ్ రావు

సామాజిక సేవ

ఒడిశా

88

అనూప్ సాహ్

కళలు-ఫొటోగ్రఫి

ఉత్తరాఖండ్

89

మిలే నా సల్వీనీ(విదేశీయురాలు)

కళలు-కథాకళి

ఫ్రాన్స్

90

నాగిన్‌దాస్ సంఘవి

సాహిత్యం-విద్య-పాత్రికేయం

మహారాష్ట్ర

91

సిరివెన్నెల సీతారామశాస్త్రి

సాహిత్యం-రచన

తెలంగాణ

92

షబ్బీర్ సయ్యద్

సామాజిక సేవ

మహారాష్ట్ర

93

మహేశ్ శర్మ

సామాజికి సేవ

మధ్యప్రదేశ్

94

మహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి

సాహిత్యం-విద్య

ఢిల్లీ

95

బ్రిజేశ్ కుమార్ శుక్లా

సాహిత్యం-విద్య

ఉత్తరప్రదేశ్

96

నరేంద్ర సింగ్

పశుపోషణ

హర్యానా

97

ప్రశాంతి సింగ్

క్రీడలు-బాస్కెట్ బాల్

ఉత్తరప్రదేశ్

98

సుల్తాన్ సింగ్

పశుపోషణ

హర్యానా

99

జ్యోతి కుమార్ సిన్హా

సామాజిక సేవ

బిహార్

100

ఆనందన్ శివమణి

కళలు-సంగీతం

తమిళనాడు

101

శారద శ్రీనివాసన్

ఆర్కియాలజీ

కర్ణాటక

102

దేవెంద్ర స్వరూప్(మరణానంతరం)

సాహిత్యం-విద్యం-పాత్రికేయం

ఉత్తరప్రదేశ్

103

అజయ్ ఠాకూర్

క్రీడలు-కబడ్డీ

హిమాచల్ ప్రదేశ్

104

రాజీవ్ తరనాథ్

కళలు-సంగీతం-సరోద్

కర్ణాటక

105

సాలుమరద తిమ్మక్క

సామాజిక సేవ

కర్ణాటక

106

జమున తుడు

సామాజిక సేవ

జార్ఖండ్

107

భరత్ భూషణ్ త్యాగి

వ్యవసాయం

ఉత్తరప్రదేశ్

108

రామస్వామి వెంకటస్వామి

వైద్యం-సర్జరీ

తమిళనాడు

109

రామ్ శరణ్ వర్మ

వ్యవసాయం

ఉత్తరప్రదేశ్

110

స్వామి విషుధానంద

ఆద్యాత్మికం

కేరళ

111

హీరాలాల్ యాదవ్

కళలు-వోకల్-ఫోల్క్

ఉత్తరప్రదేశ్

112

ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు

వ్యవసాయం

ఆంధ్రప్రదేశ్

సాధారణంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు కేంద్రప్రభుత్వం ఎంపిక చేస్తుంది. కళలు, సాహిత్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం-వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను పద్మ అవార్డులతో సత్కరిస్తుంది.

పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన గీతా
ప్రముఖ రచయిత్రి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ అవార్డు స్వీకరించడం తనకు, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉన్నందున విచారంతో ఈ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్లు జనవరి 25న గీతా వెల్లడించారు. సాహిత్య, విద్యా రంగాల్లో గీతా మెహతా సేవలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం ఆమెకు ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్‌‌జ యూనివర్సిటీలో చదువుకున్న గీతా కర్మ కోలా, ఏ రివర్ సూత్రా, స్నేక్స్ అండ్ లాడర్స్: గ్లింప్సెస్ ఆఫ్ మోడ్రన్ ఇండియా, ఎటర్నల్ గణేశ: ఫ్రం బర్త్ టు రీబర్త్ తదితర పుస్తకాలను రచించారు. అలాగే 14 డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పద్మశ్రీ అవార్డును తిరస్కరణ
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : గీతా మెహతా

మ్యాన్ బుకర్ ప్రైజ్ కు మ్యాన్ గ్రూప్ వీడ్కోలు
ఆంగ్ల నవలారంగంలో బ్రిటన్ అందించే అత్యున్నత పురస్కారం ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’కు మ్యాన్ గ్రూప్ వీడ్కోలు పలికింది. బుకర్ ప్రైజ్‌కు 18 ఏళ్లుగా స్పాన్సర్ కొనసాగుతున్న హెడ్‌‌జ సంస్థ ‘మ్యాన్ గ్రూప్’ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు జనవరి 27న వెల్లడించింది. దీంతో బుకర్ ప్రైజ్ పేరు మారనుంది. అత్యుత్తమ ఆంగ్ల నవలలకు ఏటా ఈ అవార్డు కింద 50వేల బ్రిటిష్ పౌండ్లు(రూ.46.79 లక్షలు) బహుమతిగా అందజేస్తున్నారు. 1969 నుంచి 2002 వరకూ బుకర్ అవార్డుకు మెక్‌కెన్నెల్ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అప్పట్లో 21 వేల పౌండ్లుగా ఉన్న బహుమతిని 2002లో మ్యాన్ గ్రూప్ 50 వేల పౌండ్లకు పెంచింది.
బ్రిటన్ రచయిత సెబాస్టియన్ ఫాల్క్స్ 2018లో మ్యాన్ గ్రూప్‌ను ప్రజలకు శత్రువుగా అభివర్ణించారు. అంతేకాకుండా కామన్‌వెల్త్ దేశాల రచయితలకే పరిమితమైన ఈ అవార్డును 2014లో మిగిలిన దేశాలకు విస్తరించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పాన్సర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మ్యాన్ గ్రూప్ నిర్ణయించింది. దీనివల్ల ఏటా రూ.14.97 కోట్ల ఆర్థిక సాయాన్ని బుకర్ సంస్థ కోల్పోనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బుకర్ ప్రైజ్ కు వీడ్కోలు
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : మ్యాన్ గ్రూప్
ఎక్కడ : బ్రిటన్

కవి కృష్ణారావుకు కేంద్ర సాహిత్య పురస్కారం
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, కవి అప్పరసు కృష్ణారావును కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2018 వరించింది. ఈ మేరకు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్ జనవరి 28న ప్రకటించారు. కృష్ణారావు అనువాద కవిత్వానికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రముఖ డోగ్రీ కవయిత్రి పద్మా సచ్‌దేవ్ రాసిన కవితల్ని ‘గుప్పెడు సూర్యుడు-మరికొన్ని కవితలు’ పేరిట ఆయన తెలుగులోకి అనువదించారు. భారతీయ స్త్రీ ఎదుర్కొనే సామాజిక అన్యాయం, సుఖ దుఃఖాలతోపాటు దేశ విభజన సమయంలో తన తండ్రిని పోగొట్టుకున్న కవయిత్రి మానసిక వేదన ఈ కవితల్లో వ్యక్తీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2018
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : అప్పరసు కృష్ణారావు

హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్ పురస్కారం
హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్ ఉన్నత పురస్కారం లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌కు ఓడీఎఫ్++ (ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ)గుర్తింపును జారీ చేస్తూ స్వచ్ఛభారత్ మిషన్ జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. నగరాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆయా వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు గాను ఈ గుర్తింపు దక్కింది. దీంతో దేశంలో ఓడీఎఫ్++ గుర్తింపు పొందిన మూడో మెట్రో నగరంగా హైదరాబాద్ నిలిచింది. తాజాగా చండీగఢ్, ఇండోర్‌లను ఓడీఎఫ్++ నగరాలుగా ప్రకటించారు. మొత్తం 4,041 నగరాలు గుర్తింపునకు దరఖాస్తు చేసుకోగా ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్, వికారాబాద్ నగరాలున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్ మిషన్ ఉన్నత పురస్కారం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : స్వచ్ఛభారత్ మిషన్

త్రిపుర శకటానికి ప్రథమ బహుమతి
భారత 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో ‘గాంధేయ మార్గంలో గ్రామీణ ఆర్థిక సాధికారత’ను కళ్లకు కట్టిన త్రిపుర శకటానికి ప్రథమ బహుమతి లభించింది. అలాగే ‘జాతీయ ఆస్తుల రక్షణలో 50 ఏళ్లు’ థీమ్‌తో రూపొందిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్) శకటం, ‘కిసాన్ గాంధీ’ పేరుతో భారత వ్యవసాయ పరిశోధన మండలి’ (ఐసీఏఆర్-ఐకార్) రూపొందించిన శకటం ప్రభుత్వ విభాగాల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. ఢిల్లీలో జనవరి 28న జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డులను అందజేశారు.
‘మిశ్రీత్ ఖేతీ...ఖుషియోంకీ ఖేతీ’ పేరుతో తీర్చిదిద్దిన కిసాన్ గాంధీ శక టంలో మేకలు, ఆవుల మధ్యలో జాతిపిత మహాత్మాగాంధీ ఉంటారు. మరోవైపు 11 ఏళ్ల తర్వాత సీఐఎస్‌ఎఫ్ శకటం గణతంత్ర దినోత్సవాలకు రాగా, అదే ఉత్తమమైనదిగా ఎంపికవడం గమనార్హం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో త్రిపుర శకటానికి ప్రథమ బహుమతి
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : ఢిల్లీ

రచయిత వేంపల్లె షరీఫ్‌కు చాసో పురస్కారం
ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ వేంపల్లె షరీఫ్‌కు చాగంటి సోమయాజులు (చాసో) స్ఫూర్తి పురస్కారం లభించింది. చాసో 104వ జయంతి సందర్భంగా విజయనగరంలో జనవరి 17న జరిగిన 24వ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. గతంలో కేంద్ర అకాడమీ అవార్డునూ షరీఫ్ అందుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చాగంటి సోమయాజులు (చాసో) స్ఫూర్తి పురస్కారం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : వేంపల్లె షరీఫ్
ఎక్కడ : విజయనగరం, ఆంధ్రప్రదేశ్

అంపశయ్య నవీన్‌కు లోక్‌నాయక్ పురస్కారం
ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు లోక్‌నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్యపురస్కారం లభించింది. విశాఖపట్నంలో జనవరి 19న జరిగిన లోక్‌నాయక్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. నవీన్‌తోపాటు బాలల వికాసానికి కృషిచేసిన హైదరాబాద్‌కు చెందిన ఎన్.మంగాదేవికి, దివ్యాంగుల కళా సాహిత్య సాంస్కృతిక రంగానికి సేవలందిస్తున్న వంశీ రామరాజుకు కూడా జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. రచనలు, సేవల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపే వారికి లోక్‌నాయక్ పురస్కారం ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లోక్‌నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్యపురస్కారం
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : అంపశయ్య నవీన్

రాపోలుకు సన్సద్ రత్న అవార్డు
కాంగ్రెస్ రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ను సన్సద్ రత్న అవార్డు వరించింది. చెన్నైలో జనవరి 19న జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఈ అవార్డును ప్రధానం చేశారు. లోక్‌సభ, రాజ్యసభ చర్చల్లో చురుగ్గా పాల్గొన్న 12 మంది ఎంపీలకు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సన్సద్ రత్న అవార్డు
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్

జల్లికట్టుకు గిన్నిస్ రికార్డుల్లో స్థానం
తమిళుల సాహసక్రీడ జల్లికట్టుకు గిన్నిస్ రికార్డుల్లో స్థానం లభించింది. తమిళనాడులోని పుదుకోటై్ట జిల్లా విరాళిమలైలో జనవరి 21న జరిగిన జల్లికట్టుకు గిన్నిస్ ప్రతినిధులు హాజరై నిర్వాహకులకు సర్టిఫికెట్ అందజేశారు. గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించాలన్న ప్రయత్నంలో భాగంగా విరాళి మలైలో జల్లికట్టుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. 1,354 ఎద్దులను రంగంలోకి దించిన నిర్వాహకులు వీటిని పట్టుకునేందుకు మాత్రం 424 క్రీడాకారులనే అనుమతించారు. ఈ క్రీడ తిలకించేందుకు వచ్చిన ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఎద్దులను అదుపులోకి తెచ్చేందుకు యత్నించి 31 మంది గాయాలపాలయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జల్లికట్టుకు గిన్నిస్ రికార్డుల్లో స్థానం
ఎప్పుడు : జనవరి 21
ఎక్కడ : విరాళిమలై, పుదుకోటై్ట, తమిళనాడు


రాజేంద్రసింగ్‌కు తెలంగాణ జాగృతి పురస్కారం
సామాజిక సేవారంగంలో విశిష్ట సేవలందించిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్‌కు తెలంగాణ జాగృతి జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ జాగృతి ఇంటర్నేషనల్ యూత్ లీడర్‌షిప్ సదస్సు సందర్భంగా జనవరి 20న ఈ అవార్డును ప్రదానం చేశారు. గతంలో రామన్‌మెగసెసే అవార్డును కూడా రాజేంద్రసింగ్ అందుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ... ఈ సదస్సులో 110 దేశాలకు చెందిన 550 మంది ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. ఐక్యరాజ్యసమితి 2015లో పేర్కొన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యువతకు అవగాహన కల్పించామన్నారు. ఇక నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఇలాంటి సమ్మేళనాలను నిర్వహిస్తామని, జాగృతి సంస్థ యువశక్తితో గ్లోబల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ జాగృతి జీవితకాల సాఫల్య పురస్కారం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : రాజేంద్రసింగ్
ఎక్కడ : హైదరాబాద్

మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా పాల్
మీడియా రంగానికి చెందిన డాక్టర్ హెచ్.ఎస్.పాల్‌ను ఏసీఎస్ మీడియా కార్పొరేషన్ తాజాగా ‘మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్-2018’ అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంలో జరిగిన ‘కంట్రీవైడ్ మీడియా ఇంపాక్ట్ అవార్డ్స్’ కార్యక్రమంలో పాల్‌కు ఈ అవార్డును అందజేశారు. 1989 నుంచి మీడియారంగంలో ఉన్న పౌల్ ప్రస్తుతం కశ్మీర్‌లోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఇంగ్లీష్ పత్రిక ‘డైలీ ఎక్సెల్షియర్’కు ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్-2018 అవార్డు
ఎవరు: డాక్టర్ హెచ్.ఎస్.పాల్
ఎక్కడ: న్యూఢిల్లీ

జీఎంఆర్ విమానాశ్రయానికి సీఎస్‌ఆర్ అవార్డు
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్)కు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) అవార్డు లభించింది. ముంబైలో జనవరి 11న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ), 2018 సీఎస్‌ఆర్ ఎక్సలెన్స్ అవార్డుల్లో ఉత్తమ కార్పొరేట్ సంస్థ అవార్డును జీహెచ్‌ఐఏఎల్ అందుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయానికి సీఎస్‌ఆర్ అవార్డు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర

ప్రధాని మోదీకి ఫిలిప్ కోట్లర్ అవార్డు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొలి ‘ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు’ లభించింది. న్యూఢిల్లీలో జనవరి 14న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. విశిష్ట నాయకత్వ లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకుగాను మోదీకి ఈ అవార్డు దక్కింది. ‘ప్రజలు, లాభం, భూమి’అనే అంశాల ప్రాతిపదికన విశేష ప్రతిభ చూపిన దేశాధినేతలకు ఫిలిప్ కోట్లర్ ఏటా ఈ అవార్డు అందిస్తారు. మోడ్రన్ మార్కెటింగ్ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఫిలిప్ కోట్లర్ ప్రస్తుతం అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ వర్శిటీలోని కల్లోజ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : విశిష్ట నాయకత్వ లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు

ప్రకాష్‌కు పర్యావరణ సంరక్షక్ అవార్డు
తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్‌కు పర్యావరణ సంరక్షక్ అవార్డు లభించింది. రాజస్థాన్‌లోని బీకంపురాలో జనవరి 16న జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ మనవడు తుషార్‌గాంధీ ఈ అవార్డును ప్రకాష్‌కు అందజేశారు. తెలంగాణలో జలవనరుల సంరక్షణ కోసం చేస్తున్న కృషికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పర్యావరణ సంరక్షక్ అవార్డు
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్

ఒడిశాలో సునేత్ర పథకం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘కంటివెలుగు’ తరహాలో ఒడిశా ప్రభుత్వం ‘సునేత్ర’ పథకంను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, చికిత్సలు జరపడంతోపాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తారు. ఐదేళ్ల కాలానికిగానూ రూ. 680 కోట్లతో సునేత్ర పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జనవరి 15న ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సునేత్ర పథకం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 15
ఎవరు : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
ఎక్కడ : ఒడిశా

నాలుగేళ్లకు గాంధీ శాంతి పురస్కారాల ప్రకటన
2015 నుంచి 2018 వరకు నాలుగేళ్ల కాలానికి గాంధీ శాంతి పురస్కారాల విజేతలను కేంద్ర ప్రభుత్వం జనవరి 16న ప్రకటించింది. 2015 ఏడాదికిగాను కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్ర విజేతగా నిలిచారు. అలాగే 2016 ఏడాదికి అక్షయపాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ అవార్డును గెలుచుకున్నాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నందుకు అక్షయపాత్రకు, పాకీ పని చేసే వారికి విముక్తి కల్పించినందుకు సులభ్ ఇంటర్నేషనల్‌కు ఈ పురస్కారం దక్కింది. 2017 ఏడాదికి ఏకై అభియాన్ ట్రస్ట్, 2018కి కుష్టు వ్యాధి నిర్మూలన కోసం డబ్ల్యూహెచ్‌వో సౌహార్ద్ర రాయబారిగా ఉన్న యోహీ ససకవాకు అవార్డులను ప్రకటించారు.
గాంధీ సిద్ధాంతాలు, పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు కోసం కృషిచేసే వ్యక్తులు, సంస్థలకు గాంధీ శాంతి పురస్కారం అందిస్తారు. ఈ బహుమతి కింద రూ.కోటితోపాటు ప్రశంసాపత్రం ఇస్తారు. చివరిగా 2014లో ఈ పురస్కారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాలుగేళ్లకు గాంధీ శాంతి పురస్కారాల ప్రకటన
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ నీటిపారుదల శాఖకు సీబీఐపీ అవార్డు
తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖకు ప్రతిష్టాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) పురస్కారం లభించింది. ఢిల్లీలో జనవరి 4ప సీబీఐపీ 91వ వార్షికోత్సవం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. సాగునీటి వనరుల నిర్వహణలో మెరుగైన పనితీరు ప్రదర్శన, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు గానూ ఈ అవార్డు దక్కింది. మిషన్‌కాకతీయ ఇప్పటి వరకు రూ .8 వేల కోట్ల నిధులతో 27,167 చెరువులను పునరుద్ధరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ పురస్కారం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : మెరుగైన పనితీరుకు

పల్సస్ ఎండీ శ్రీనుబాబుకు చాంపియన్స్ అవార్డు
పల్సస్ సీఈఓ, ఎండీ డాక్టర్ గేదెల శ్రీనుబాబుకు చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో డిసెంబర్ 26న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఈ అవార్డును అందజేశారు. వైద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకుగాను శ్రీనుబాబుకు ఈ అవార్డు దక్కింది. పల్సస్ సంస్థ... ఒమిక్స్ ఇంటర్నేషనల్ ద్వారా హెల్త్ కేర్ రంగానికి సంబంధించి ఓపెన్ యాక్సెస్ జర్నల్స్‌ను ప్రచురిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : డాక్టర్ గేదెల శ్రీనుబాబు
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకుు : , ఆరోగ్య, సామాజిక రంగాల్లో అందిస్తున్నందుకు

ఏపీకి జైవిక్ ఇండియా పురస్కారం
సేంద్రియ వ్యవసాయ విధానంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖకు జైవిక్ ఇండియా-2018 పురస్కారం లభించింది. న్యూఢిల్లీలో డిసెంబర్ 28న జరిగిన కార్యక్రమంలో ఏపీ ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి ఈ అవార్డును అందజేశారు. సేంద్రియ సాగు చేసే రాష్ట్రాలకు కర్ణాటక ప్రభుత్వం, ఐకోవా సంయుక్తంగా 2017 నుంచి జైవిక్ పురస్కారాన్ని అందజేస్తున్నాయి. రైతుల విభాగంలో మాతోట ఎఫ్‌పీవో (రైతు ఉత్పత్తి సంఘం)కు పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జెవిక్ ఇండియా-2018 పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ

జ్ఞాపకశక్తి పోటీల్లో భారత సంతతి బాలుడికి స్వర్ణాలు
ప్రపంచ జ్ఞాపకశక్తి పోటీల(వరల్డ్ మెమొరీ చాంపియన్‌షిప్)లో భారత సంతతి బాలుడు ధ్రువ్ మనోజ్‌కి రెండు స్వర్ణ పతకాలు లభించాయి. హాంగ్‌కాంగ్‌లో జనవరి 2న జరిగిన ఈ పోటీల్లో ‘నేమ్స్ అండ్ ఫేసెస్’, ‘రాండమ్ వర్డ్స్’ విభాగంలో మనోజ్ 56 మందిని వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ పౌరుడిగా మనోజ్ నిలిచాడు. అలాగే చైనా, రష్యా, ఇండియా, తైవాన్, మలేసియా దేశాల్లో నిర్వహించిన 260 పోటీల్లో పాల్గొన్న బాలుడిగా గుర్తింపు పొందాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జ్ఞాపకశక్తి పోటీల్లో భారత సంతతి బాలుడికి రెండు స్వర్ణాలు
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : ధ్రువ్ మనోజ్
ఎక్కడ : హాంగ్‌కాంగ్
















































































































































































#Tags