Gukesh Dommaraju: 18 ఏళ్లకే ప్రపంచ చెస్‌ చాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్‌.. ప్రైజ్‌ మనీ ఎంతంటే..

వరల్డ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది.

భారత గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ కొత్త ప్రపంచ చెస్‌ చాంపియన్‌గా అవతరించాడు. 18 ఏళ్ల వయసులోనే విశ్వ విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. క్లాసికల్‌ ఫార్మాట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో గుకేశ్‌ 7.5–6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 

విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (2012) వరల్డ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.

39 ఏళ్ల రికార్డు బద్దలు 
రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ పేరిట 39 ఏళ్లుగా ఉన్న రికార్డును భారత గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ బద్దలు కొట్టాడు. క్లాసికల్‌ చెస్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పిన్న వయస్కుడిగా ఇప్పటి వరకు కాస్పరోవ్‌ (22 ఏళ్ల 6 నెలల 27 రోజులు; 1985లో కార్పోవ్‌పై విజయం) పేరిట రికార్డు ఉంది. అయితే ఈ రికార్డును డిసెంబ‌ర్ 12వ తేదీ గుకేశ్‌ (18 ఏళ్ల 8 నెలల 14 రోజులు) తిరగరాశాడు.  

FIFA World Cup: సౌదీ అరేబియాలో 2034 ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్

ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లంటే?
ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ నెగ్గిన దొమ్మరాజు గుకేశ్‌కు ట్రోఫీతో పాటు 13 లక్షల 50 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 45 లక్షలు), మూడు గేమ్‌లు గెలిచినందుకు అదనంగా రూ.5.07 కోట్లు గుకేశ్‌ అందుకున్నాడు. 

మొత్తంగా అతడికి రూ.16.52 కోట్ల ప్రైజ్‌మనీ లభిచింది. అదే విధంగా  రన్నరప్‌ డింగ్‌ లిరెన్‌ 11 లక్షల 50 వేల డాలర్లు (రూ.9 కోట్ల 75 లక్షలు) నగదు బహుమతి అందుకున్నాడు. రెండు గేమ్‌లు గెలిచిన లిరెన్‌కు రూ.3.38 కోట్లు దక్కాయి. మొత్తంగా చైనా గ్రాండ్‌ మాస్టర్ ఖాతాలో రూ.13.12 కోట్లు చేరాయి. కాగా మొత్తం ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ రూ.21.75 కోట్లు.

Syed Modi International: మూడోసారి సయ్యద్‌ మోదీ ఛాంపియన్‌గా నిలిచిన భారత స్టార్‌

#Tags