Longest Stay on ISS: రికార్డ్‌.. అంతరిక్షంలో 370 రోజులకు పైగా ఉన్న వ్యోమగాములు వీరే!

రష్యా వ్యోమగాములు ఒలెగ్‌ కొనొకెంకో, నికోలాయ్‌ చుబ్ సెప్టెంబ‌ర్ 20వ తేదీ సరికొత్త రికార్డు సృష్టించారు.

వారిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో 370 రోజుల 21 గంటల 22 నిమిషాలకుపైగా ఉన్నారు. పాత రికార్డును తిరగరాశారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడే పరిశోధనల్లో భాగస్వాములవుతున్నారు. వ్యోమగాములు నిరాటంకంగా ఇన్ని రోజులో ఐఎస్‌ఎస్‌లో ఉండడం ఇదే మొదటిసారి. 

ఇప్పటిదాకా.. ఎక్కువ కాలం ఐఎస్‌ఎస్‌లో ఉన్న రికార్డు రష్యా అస్ట్రోనాట్స్‌ సెర్గీ ప్రొకోపివ్, దిమిత్రి పెటెలిన్, అమెరికా అస్ట్రోనాట్‌ ఫ్రాన్సిస్కో రుబియా పేరిట ఉంది. వారు 370 రోజుల 21 గంటల 22 నిమిషాలు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. ఈ రికార్డును ఒలెగ్‌ కొనొకెంకో, నికోలాయ్‌ చుబ్‌ బద్ధలు కొట్టారు.

వారు సెప్టెంబ‌ర్ 23వ తేదీ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. 59 ఏళ్ల కొనొకెంకో మరో రికార్డు కూడా సృష్టించబోతున్నారు. సెప్టెంబ‌ర్ 23వ తేదీకి ఆయన ఐఎస్‌ఎస్‌లో ఏకంగా 1,110 రోజులు గడిపినట్లు అవుతుంది. ఇప్పటిదాకా ఇన్ని రోజులు అక్కడ ఉన్నవారెవరూ లేరు.

Venus Orbiter Mission: అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు వేసిన భారత్‌!

#Tags