ISRO: వికాస్ ఇంజన్ సామర్థ్య పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్–1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్ ఇంజన్ సామర్థ్య పరీక్ష విజయవంతమైంది. జనవరి 20న తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లా, మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్(ఐపీఆర్‌సీ)లో నిర్వహించిన సామర్థ్య పరీక్షను వివరాలను ఇస్రో అధికారులు జనవరి 22న వెల్లడించారు. గగన్‌యాన్–1 ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్నిరకాల పరీక్షలను ముందస్తుగా చేయడంలో భాగంగా క్రయోజనిక్ ఇంజన్ల పనితీరును సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. గగన్‌యాన్–1 ప్రయోగాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.
చదవండి: ఏఐ ఆధారిత కరోనా పరీక్షా విధానాన్ని ఏ దేశస్థులు ఆవిష్కరించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గగన్‌యాన్–1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్ ఇంజన్ సామర్థ్య పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
ఎక్కడ : ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్(ఐపీఆర్‌సీ), మహేంద్రగిరి, తిరునెల్వేలి జిల్లా, తమిళనాడు
ఎందుకు : గగన్‌యాన్–1 ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్నిరకాల పరీక్షలను ముందస్తుగా చేయడంలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్