Gaganyaan Mission: వెల్‌డెక్ రికవరీ ట్రయల్ విజయవంతం
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా క్రూ మాడ్యూల్‌కి సంబంధించిన 'వెల్‌డెక్' రికవరీ ట్రయల్స్ విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 10వ తేదీ ఇస్రో తెలిపింది.
ఈ ట్రయల్స్ డిసెంబర్ 6వ తేదీ విశాఖ తీరంలో నావికా దళం సహకారంతో చేపట్టబడ్డాయి.
ఈ ట్రయల్స్‌లో.. వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తమ విధులు ముగించుకున్న తర్వాత క్రూ మాడ్యూల్‌లో తిరిగి భూమిపైకి చేరుకుంటారు. ఈ క్రూ మాడ్యూల్‌ను సముద్ర జాలాల్లో పడేలా చేస్తారు. అక్కడి నుంచి తెస్తే వ్యోమగాములు సురక్షితంగా వెలుపలికి తిరిగి వస్తారు. మాడ్యూల్‌ను 4 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి అక్కడ నుంచి సముద్రంలో పడేలా చేసి దాన్ని వెలికి తీసే ప్రక్రియను ఇప్పటికే పలుమార్లు నిర్వహించారు.
ఈ ట్రయల్స్‌లో నేవీ సిద్ధం చేసిన 'వెల్‌డెక్' షిప్‌ను ఉపయోగించారు. ఈ షిప్ డెక్ నీటిలో మునిగే ఉంటుంది. దీనివల్ల నీళ్లలో పడవలు, ఉపగ్రహాలను సులభంగా షిప్‌కి తరలించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రికవరీ ప్రక్రియకు ఇప్పటికే పలుమార్లు ట్రయల్స్ నిర్వహించబడ్డాయి.
#Tags