Smart Calculator : హైదరాబాద్‌ స్టార్టప్‌ కంపెనీ టుహ్యాండ్స్‌ ఘనత

చిన్న, మధ్యతరహా వ్యాపారులకు రోజువారీ లావాదేవీలు, ఆదాయ, వ్యయాల లెక్కింపులో దోహదపడేందుకు ప్రపంచంలోకెల్లా తొలి స్మార్ట్, మేడ్‌ ఇన్‌ ఇండియా కాలిక్యులేటర్‌ పరికరం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కాలిక్యులేటర్‌కు అనుసంధానంగా ఉండే టు­హ్యాండ్స్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇది పనిచేయనుంది.
Hyd startup unveils world's first smart calculator

ఒక్కో లావాదేవీని యాప్‌లోకి వ్యాపారులు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా రియల్‌టైమ్‌లోనే లావాదేవీల వివరాలన్నీ ఈ పరికరంలో నిక్షిప్తం కావడం దీని ప్రత్యేకత. స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్, టీ–హబ్‌ సహకారంతో టుహ్యాండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్టార్టప్‌ కంపెనీ రూ. 50 లక్షల నిధులను సమీకరించి స్మార్ట్‌ కాలిక్యులేటర్‌ను అభివృద్ధి చేసింది. సెప్టెంబర్ 26న నగరంలోని ‘టీ–హబ్‌’లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. 

Also read: Samudrayan Project: సముద్రాల గుట్టు ఛేదించే మత్స్య యంత్రం

దీని ధరను రూ. 2,999గా నిర్ణయించారు.  ఏడాది వారంటీతో పనిచేసే ఈ పరికరంలో 90 రోజుల డేటాను సులభంగా పొందొచ్చు. 

#Tags