Scam Awareness : హ్యాకర్ల నుంచి మీ వ్యక్తిగత వివరాలను జాగ్రత్తపరచండిలా..
సాక్షి ఎడ్యుకేషన్: ఎంత జాగ్రత్త పడుతున్నప్పటి ఏదో ఒక రకంగా వివరాలను హ్యాక్ చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు హ్యాకర్లు. డబ్బులు పోవడం, వ్యక్తిగత వివరాలు బయటపడడం వంటివి జరిగేసరికి మన వివరాలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నా కూడా కొందరు హ్యాకర్లు సాంకేతికత పెరుగుదలను వాడుకొని హ్యాకింగ్‌ను మరింత వేగవంతం చేస్తున్నారు.
మనం ఇప్పటికీ మరింత జాగ్రత్తలు పాటించవచ్చు. నేటి కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్ వాడని వ్యక్తి ఉండడు. ప్రతీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు ఉన్న కాలం ఇది. అటువంటిది మన ఫోన్‌లో ఉన్న ఆప్షన్స్‌తో మరింత జాగ్రత్తలు వహిస్తే మనకే ఎంతో సహాయంగా ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఇవే..
1. గూగుల్‌లో మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.
2. ఆపై మీ Google ఖాతాను ఒపెన్ చేయండి.
3. అక్కడ ఉన్న సెక్యూరిటీ ట్యాబ్‌ను ఓపెన్ చేయండి.
4. కిందికి స్క్రోల్ చేసి, డార్క్ వెబ్‌పై క్లిక్ చేయాలి.
5. అక్కడ మీకు సంబంధిత లేదా మీ వ్యక్తిగత సమాచారం ఏమైన ఉంటే గమనించవచ్చు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
సాధారణంగా మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇ-మెయిల్ చిరునామా, వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ డార్క్ వెబ్‌లో లీక్ అవుతాయి. డార్క్ వెబ్‌లో మీ ఖాతాల్లో ఏదైనా పాస్‌వర్డ్ లీక్ అయినట్లయితే, మీరు వెంటనే దాన్ని మార్చాలి. సెక్యూరిటీ లేయర్‌ని పెంచాలి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి హ్యాకర్లు మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు.
Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!
డార్క్ వెబ్ అంటే..
డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్న మీ వ్యక్తిగత సమాచారం డిజిటల్ అరెస్ట్ వంటి సంఘటనలను నిర్వహించడానికి హ్యాకర్‌లను ప్రేరేపిస్తుంది. మీ వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌కి చేరిన వెబ్‌సైట్‌లు లేదా యాప్‌ల మీ పర్సనల్ డేటాను డిలీట్ చేయండి. లేదంటే సెక్యూరిటీ లాక్ క్రియేట్ చేసుకోండి.