Arctic wolf: ప్రపంచంలోనే తొలిసారి క్లోనింగ్ తోడేలు
ప్రపంచంలోనే తొలిసారిగా క్లోనింగ్ విధానంలో ఆర్కిటిక్ తోడేలును బీజింగ్‌లోని సినోజీన్ బయోటెక్నాలజీ కో సంస్థ సృష్టించింది. ఆర్కిటిక్ తోడేలును పోలార్ ఉల్ఫ్, లేదా వైట్ ఉల్ఫ్ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా కెనడా పరిధిలోకి వచ్చే క్వీన్స్ ఎలిజిబెత్ ద్వీపంలో కనిపిస్తాయి. అంతరించిపోతున్న అరుదైన జీవజాతులను క్లోనింగ్ ద్వారా కాపాడటంలో చైనా విజయం ఓ మైలురాయిగా భావిస్తున్నారు. జూన్ 10వ తేదీన ఈ తోడేలు జన్మించింది. దీనికి ‘మాయా’ అని పేరు పెట్టారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags