Skin Cancer Soap: స్కిన్‌ క్యాన్సర్‌కి సబ్బుతో చెక్‌..14 ఏళ్ల బాలుడి సరికొత్త ఆవిష్కరణ

క్యాన్సర్‌ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికి తెలిసిందే. బాగా డబ్బుంటే విదేశాల్లో పేరుగాంచిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని బయటపడుతుంటారు ప్రముఖులు, సెలబ్రెటీలు.
14 year old teenager invented soap to treat skin cancer

అలాంటి భయానక క్యాన్సర్‌ వ్యాధుల్లో ఒకటి ఈ స్కిన్‌ క్యాన్సర్‌. అలాంటి స్కిన్‌ క్యాన్సర్‌ని తక్కువ ఖర్చుతోనే ఈజీగా నయం చేసేలా ఓ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికాడు ఓ టీనేజర్‌. ఈ ఆవిష్కరణతో ఆ యువ శాస్త్రవేత్త అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఎవరా టీనేజర్‌? ఏమిటా ఆవిష్కరణ..?. 

Sky Bus: స్కై బస్సు సర్వీస్‌ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?

వివరాల్లోకెళ్తే..అమెరికాలోని వర్జీనియాకు చెందిన 14 ఏళ్ల హేమన్‌ బెకెలే స్కిన్‌ క్యాన్సర్‌ని జయించేలా సబ్బుని కనిపెట్టాడు. అది కూడా తక్కువ ఖర్చతోనే నయం అయ్యేలా రూపొందించాడు. ఈ సబ్బు ధర కేవలం రూ. 800/-. ఈ సరికొత్త ఆవిష్కరణగానూ ఆ బాలుడు టాప్‌ యంగ్‌ సైంటిస్ట్‌గా అవార్డును గెలుచుకున్నాడు. ఈ సబ్బు అందరికీ అందుబాటులో ఉండేలా ఆ బాలుడు లాభప్రేక్షలేని ఓ సంస్థను కూడా స్థాపించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆ బాలుడికి ఈ ఆవిష్కరణను కనుగొనడానికి త్రీఎం డిస్కవరరీ ఎడ్యుకేషన్‌ శాస్త్రవేత్తల సలహాదారు డాక్టర్‌ మహ్ఫుజా అలీ సాయం చేశారు. బెకెలేకి జీవశాస్త్రం, సాంకేతికపై మంచి ఆసక్తి. ఇదే ఈ ఆలోచనకు పురిగొల్పింది.

India's First Private Rocket Vikram-1: దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్ విక్రమ్‌–1

అదే అతడిని యూఎస్‌లో ఏటా నిర్వహించే 2023 3M యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్‌లో పాల్గొనేలా చేసింది. దాదాపు తొమ్మిది మంది పోటీ పడిన ఈ చాలెంజ్‌లో అమెరికా టాప్‌ యంగ్‌ సైంటిస్ట్‌గా విజయం కైవసం చేసుకుని దాదాపు రూ. 31 లక్షల ఫ్రైజ్‌ మనీని గెలుచుకున్నాడు. ఇథియోపియాకు చెందిన బెకెలే తాను అక్కడ ఉన్నప్పుడు చాలామంది స్కిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతుండటం చూశానని చెప్పుకొచ్చాడు. అప్పుడే దీన్ని నయం చేసేలా ఏదైనా కనిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు.  దీనికి ఈ ఛాలెంజ్‌ పోటీనే సరైన వేదికగా భావించానని చెప్పుకొచ్చాడు.

Gaganyaan Mission: గగన్‌యాన్‌లో మహిళా పైలట్లు, శాస్త్రవేత్తలకే ప్రాధాన్యం

ఇక బెకెలే రూపొందించిన ఈ సబ్బు పేరు స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ సోప్. ఈ సోప్‌ చర్మాన్ని రక్షించే డెన్డ్రిటక్‌ కణాలను పునరుద్ధరింంచి, స్కిన్‌ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతుందని బెకెలే పేర్కొన్నాడు. అదీగాక ఇంతవరకు మార్కెట్‌లో స్కిన్‌ క్యాన్సర్‌కి సంబంధించి క్రీమ్‌లు మాత్రమే మార్కెట్‌లో ఉన్నాయని, సబ్బుని ఉపయోగించడం ఇదే తొలిసారి అని యంగ్‌ ఛాలెంజ్‌ ప్రెజెంటేషన్‌ ప్యానల్‌ వివరించాడు బెకెలే. సమాజానికి తన వంతుగా సాయం అందించేలా ఈ స్కిన్‌ క్యాన్సర్‌ని అతి తక్కువ ఖర్చుతోనే జయించేలా తాను కనుగొన్న ఈ సరికొత్త ఆవిష్కరణ ప్రపంచానికి ఓ కొత్త ప్రేరణ ఇస్తుందని ఆశిస్తున్నానని ప్యానెల్‌ సభ్యులకు వివరించాడు బెకెలే.  

 

New E-passports In India: ఇకపై ఈ-పాస్‌పోర్ట్‌లు

#Tags