Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎన్నికలు ఎప్పుడంటే..?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో నెలన్నర రోజుల్లో వేడెక్కే అవకాశముంది.

పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం ప్రభుత్వం కసరత్తులు ముమ్మరంగా చేపడుతోంది. ఈ క్రమంలో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేత, రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు మొత్తం మూడు ఫేజ్‌లలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం, జనవరి 14వ తేదీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

రిజర్వేషన్లపై తుది నిర్ణయం ప్రభుత్వానిదే అని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అనుసరించి రిజర్వేషన్లు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అలాగే, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని తెలిపింది.

Jharkhand CM: జార్ఖండ్ 14వ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

శాసనసభ ఎన్నికల జాబితాలు ఆధారంగా.. వార్డులు, గ్రామ పంచాయతీలు వారీగా ఓటర్ల జాబితాలు రూపొందించబడినట్లు కమిషన్ ప్రకటించింది. 

రాష్ట్రవ్యాప్తంగా.. 12,867 గ్రామ పంచాయతీలు, 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి.

#Tags