న‌వంబ‌ర్ 2020 రాష్ట్రీయం

ప్రపంచ శౌచాలయ దినోత్సవం
ప్రపంచ శౌచాలయ దినోత్సవాన్ని(నవంబర్ 19) పురస్కరించుకొని దేశంలో స్వచ్ఛ భారత్ అభియాన్‌ని మరింత ప్రోత్సహించేందుకు నవంబర్ 19న 20 ఉత్తమ జిల్లాలకు స్వచ్ఛతా అవార్డ్-2020 పురస్కారాలను అందించారు. కోవిడ్-19 కారణంగా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం వర్చువల్‌గా జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, తెలంగాణ నుంచి సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉత్తమ జిల్లాల అవారు్డలను అందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉత్తమ జిల్లాలకు స్వచ్ఛతా అవార్డ్-2020 పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : ప్రపంచ శౌచాలయ దినోత్సవాన్ని(నవంబర్ 19) పురస్కరించుకొని

స్పీకింగ్ బుక్ భగవద్గీతను రూపొందించిన సంస్థ?
న్యూఢిల్లీకి చెందిన హయోమా సంస్థ రూపొందించిన స్పీకింగ్ బుక్స్ భగవద్గీత, సంపూర్ణ హనుమాన్ చాలీసా పుస్తకాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలోని తన కార్యాలయంలో నవంబర్ 19న ఆవిష్కరించారు. ఈ పుస్తకాల్లోని విషయాలను నిరక్షరాస్యులు, వృద్ధులు, అంధులు సులభంగా తెలుసుకునే విధంగా రూపొందించారు. ఈ పుస్తకాలతో పాటు ఇచ్చే ఎలక్ట్రానిక్ పరికరాన్ని పేజీల్లోని అక్షరాలపై పెడితే ఆడియో రూపంలో శ్లోకాలు, తాత్పర్యాలు పలు భాషల్లో వినిపిస్తాయి. నచ్చిన భాషను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంది. సేఫ్ షాప్ ఆన్‌లైన్ సంస్థ వీటిని మార్కెటింగ్ చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్పీకింగ్ బుక్స్ భగవద్గీత, సంపూర్ణ హనుమాన్ చాలీసా పుస్తకాల ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
ఎక్కడ : తిరుమల, తిరుపతి, చిత్తూరు జిల్లా
ఎందుకు : పుస్తకాల్లోని విషయాలను నిరక్షరాస్యులు, వృద్ధులు, అంధులు సులభంగా తెలుసుకునేందుకు

మధ్యయుగ కాలంనాటి విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున వెలిసింది?
లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానమాచరించే తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 20న కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. దేవగురువు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించగానే మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు తుంగభద్రలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 1వ తేదీ వరకు పుష్కరాలు జరగనున్నాయి.
కోవిడ్ పరిస్థితుల్లో...
12 ఏళ్లకోసారి జరిగే తుంగభద్ర పుష్కరాలు 2020 ఏడాది ప్రత్యేక పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పుష్కర స్నానాలకు అనుమతి నిరాకరించింది. తలపై నీళ్లు చల్లుకుని, సంప్రదాయ పద్ధతిలో పుష్కర పూజలు చేసుకోవాలని భక్తులకు సూచించింది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది వెంబడి 23 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు.
జోగుళాంబ వద్ద...
తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని జోగుళాంబ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పుష్కరాలను ప్రారంభించారు.
తుంగభద్ర నది...
  • కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో జన్మించే తుంగ, భద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని ‘చిక్‌మంగ్‌ళూరు’ జిల్లాలో ఒకదానితో ఒకటి కలిసి ‘తుంగభద్ర’గా ఏర్పడుతున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం వద్ద కృష్ణా నదితో కలుస్తోంది.
  • కృష్ణానది ఉపనదులన్నింటిలోకి తుంగభధ్ర పెద్దది.
  • -తుంగభధ్ర ఉపనదులు: కుముద్వతి, వరద, వేదవతి.
  • దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం తుంగభధ్ర నది ఒడ్డునే వెలిసింది. హంపి, మంత్రాలయం, జోగులంబా లాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఈ నది ఒడ్డున వెలిశాయి.
  • 531 కి.మీ పొడవైన తుంగభద్రా నదిపై కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట వద్ద ‘తుంగభద్ర ఆనకట్ట’ నిర్మించబడింది.


ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.1,510 కోట్లతో నిర్మించనున్న 4 ఫిషింగ్ హార్బర్లకు, తొలి దశలో 25 ఆక్వా హబ్‌లకు శంకుస్థాపన జరిగింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం(నవంబర్ 21) సందర్భంగా నవంబర్ 21న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఫిషింగ్ హార్బర్లు, ఆక్వా హబ్‌లు, జనతా బజార్లలో మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్ సదుపాయం కోసం రూ.3,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు ప్రకటించారు.
తాజాగా శంకుస్థాపన జరిగిన నాలుగు ఫిషింగ్ హార్బర్లు...

  • నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె
  • తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ
  • గుంటూరు జిల్లా నిజాంపట్నం
  • కృష్ణా జిల్లా మచిలీపట్నం


త్వరలో ఏర్పాటు కానున్న మరో మరో నాలుగు ఫిషింగ్ హార్బర్లు...

  • శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం
  • విశాఖ జిల్లా పూడిమడక
  • పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప
  • ప్రకాశం కొత్తపట్నం


మహిళల భద్రత కోసం అభయం యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఆటోలు, ట్యాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘అభయం ప్రాజెక్టు’ (యాప్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 23న తన క్యాంపు కార్యాలయంలో ఈ యాప్‌ను ప్రారంభించారు. తొలుత విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా 1,000 ఆటోలలో ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. 2021, నాటికి విజయవాడ, తిరుపతిలో కూడా అమలులోకి తెచ్చి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ పరికరాలను అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఎవరి పర్యవేక్షణలో...

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘అభయం’ పాజెక్టును అమలు చేయనున్నాయి. రవాణాశాఖ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు అమలవుతుంది. దిశ యాప్‌ను పోలీసు శాఖ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
  • మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. దీనిలో 58.64 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది.

ఏమిటీ అభయం’?..

  • ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో తెలుసుకుని వెంటనే పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఇది.
  • ఈ ప్రాజెక్టులో భాగంగా ఆటోలు, టాక్సీల్లో ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స) ఉపకరణాన్ని అమరుస్తారు.
  • ఆటో/టాక్సీ ఎక్కిన వెంటనే అక్క చెల్లెమ్మలు స్మార్ట్ ఫోన్ ద్వారా వాహనానికి అంటించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. స్కాన్ చేయగానే డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి.
  • ఏదైనా ఆపద సమయంలో మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది.
  • స్మార్ట్ ఫోన్ లేకుంటే అభయం ఐఓటీ ఉపకరణంలో రెడ్ బటన్ నొక్కితే పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని ఆదుకుంటారు. రెడ్ బటన్ నొక్కగానే అలారమ్ మోగడంతోపాటు వాహనం ఆగిపోతుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : అభయం యాప్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా...
ఎందుకు : ఆటోలు, ట్యాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం

చిరు వ్యాపారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం?
చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. నవంబర్ 25న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి కూడా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు.
సుమారు 10 లక్షల మందికి...
జగనన్న తోడు పథకం ద్వారా... సుమారు 10 లక్షల మందికి దాదాపు రూ.1,000 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తుంది. దాన్ని పదేళ్లకు తీసుకుంటే రూ.1,000 కోట్లు అవుతుంది. ప్రభుత్వం ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చిరు వ్యాపారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం
ఎందుకు : చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు

దక్షిణ కొరియాకు చెందిన ఏ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది?
దక్షిణ కొరియాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ ఇంటిగ్రేషన్ అండ్ హెచ్‌ఆర్ డెవలప్‌మెంట్ (క్రెసిహెచ్‌ఆర్డీ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి సమక్షంలో నవంబర్ 25న క్రెసిహెచ్‌ఆర్డీ చైర్మన్ డాంగ్ యోప్ కిమ్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశారు.
ఒప్పందం ద్వారా...
తాజా ఒప్పందం ద్వారా ఆరోగ్యకరమైన మానవ వనరులను సమాజానికి అందించడానికి అవకాశం కలుగుతుంది. విశ్వవిద్యాలయ పాఠ్యాంశాల్లో కొరియన్ లాంగ్వేజ్, విదేశీ విశ్వవిద్యాలయ మార్పిడి కార్యక్రమాలు, పరిశ్రమ ఇంటర్న్‌షిప్‌లు కూడా ఎంవోయూలో భాగంగా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ ఇంటిగ్రేషన్ అండ్ హెచ్‌ఆర్ డెవలప్‌మెంట్ (క్రెసిహెచ్‌ఆర్డీ)తో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి
ఎందుకు : ఆరోగ్యకరమైన మానవ వనరులను సమాజానికి అందించడానికి

ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఎంవోయూ చేసుకున్న నాలుగు ప్రముఖ సంస్థలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)తో నాలుగు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. నవంబర్ 12న వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమంలో ఐబీఎం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్పీఐ), ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలు ఏపీఎస్‌ఎస్‌డీసీతో భాగస్వామ్యం అయ్యాయి. ప్రస్తుతం ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌గా మధుసూదన రెడ్డి ఉన్నారు. ఒప్పంద వివరాలను పరిశీలిస్తే...
ఐబీఎం ఇండియా...
ఈ సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ఏర్పాటు చేయనుంది. ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్, కోడింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స, బ్లాక్ చెయిన్, డేటా సైన్స్ - అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్, బిగ్ డేటా, ఫుల్ స్టాక్ తదితర కోర్సులు, ఇతర కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తుంది.
ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ...
విశాఖపట్నంలో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, వీఎఫ్‌ఎక్స్ అండ్ డిజిటల్ రిస్టోరేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ తదితర కోర్సులతో పాటు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో శిక్షణ ఇస్తుంది.
సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్...
అడ్వాన్స్ మాన్యుఫాక్చరింగ్, ఫుడ్ ఇన్నోవేషన్ - ఫుడ్ ప్రాసెసింగ్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల నేతృత్వంలోని కోర్సులను నైపుణ్య కళాశాలల్లో అందించడానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు, నిర్వహణకు ఈ సంస్థ ముందుకు వచ్చింది.
ఐటీడీసీ...
ఆతిథ్య రంగంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కు అవసరమైన సహాయ సహకారాలను భారత పర్యాటకాభివృద్ధి సంస్థ అందజేస్తుంది. కోర్సులు, పాఠ్యాంశాలు, అధ్యయన అంశాలను ఐటీడీసీ రూపొందిస్తుంది.

భవన నిర్మాణ అనుమతుల జారీకి టీఎస్-బీపాస్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
భవన నిర్మాణ అనుమతుల జారీకి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం(టీఎస్-బీపాస్) ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో నవంబర్ 16న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు టీఎస్-బీపాస్‌ను ప్రారంభించారు. అనంతరం స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇళ్లకు అనుమతి పొందిన పలువురు దరఖాస్తుదారులకు అనుమతి పత్రాలు అందజేశారు. ఈ టీఎస్-బీపాస్ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
మంత్రి కేటీఆర్ ప్రసంగం...

  • టీఎస్-బీపాస్ ద్వారా జారీ చేసే తక్షణ ఇళ్ల అనుమతులకు చట్టబద్ధత ఉంటుంది.
  • 75 చదరపు గజాల లోపు స్థలంలో నిర్మించే ఇళ్లకు అనుమతులు అవసరం లేదని, రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.
  • 75 నుంచి 300 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం టీఎస్-బీపాస్ వెబ్‌సైట్‌లో స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమెటిక్‌గా అనుమతులు జారీ అవుతాయి.
  • 2021, జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొస్తున్నాం.

క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం(టీఎస్-బీపాస్) ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : తెలంగాణ పురపాలక మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ, హైదరాబాద్
ఎందుకు : భవన నిర్మాణ అనుమతుల జారీకి

పంచతత్వ పార్కు ప్రారంభం
జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్య విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఇందిరాపార్కులో రూ.15 లక్షల నిధులతో పంచతత్వ పార్కును నిర్మించారు. ఈ పంచతత్వ పార్కును తెలంగాణ రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు నవంబర్ 15న ప్రారంభించారు. కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
పంచతత్వ పార్కు ప్రత్యేకతలు...

  • పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలిని దృష్టిలో ఉంచుకొని దీనిని ఏర్పాటు చేశారు. ఇది వలయాకారంలో 8 భాగాలుగా ఉంటుంది. నడిచే సమయంలో దీనిపై దృష్టి సారిస్తే ఏకాగ్రత పెరుగుతుంది.
  • పార్కులో మొత్తంగా 40 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.
  • ఈ ట్రాక్‌లో నడవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. కంటిచూపు, రక్త ప్రసరణ, వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. వివిధ మలుపుల్లో నడక కారణంగా అన్ని శరీర భాగాలకు వ్యాయామం కలుగుతుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : పంచతత్వ పార్కు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : తెలంగాణ రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : ఇందిరా పార్కు, హైదరాబాద్

రైతుల ఖాతాల్లోకి వైఎస్సార్ సున్నా వడ్డీ సొమ్ము
2019 ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను నవంబర్ 17న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు. అలాగే 2020, అక్టోబర్‌లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.132 కోట్లు చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుందని సీఎం చెప్పారు.

ఏపీలోని ఏ జిల్లాలో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఆదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ వర్సిటీ, రిక్రియేషన్ సెంటర్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నవంబర్ 5న సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రూ.14,634 కోట్లతో సుమారు 25 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. 130 ఎకరాల్లో ప్రాజెక్టు చేపట్టనున్నారు.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు...

  • వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద నిర్దేశించిన 2059 సేవలు ప్రస్తుతం రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అమలవుతున్నాయి. ఈ సేవలు మిగతా ఆరు జిల్లాల్లో కూడా 2020, నవంబర్ 10 నుంచి అందుబాటులోకి వస్తాయి.
  • అగ్నిమాపక శాఖలో జోనల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పుడున్న రెండు జోన్లు నాలుగు జోన్లుగా మార్పు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ వర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కి కేబినెట్ ఆమోదం
2006లో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ -2006 కు సవరణలు చేస్తూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి నవంబర్ 5న ఆమోదం తెలిపింది. తద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఉత్పతులు అందుబాటులో ఉంటాయి. ఆక్వా రైతులకు నాణ్యమైన ఫిష్ ఫీడ్ అందించేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్టు -2020ని కూడా కేబినెట్ ఆమోదించింది.
గ్రామాల్లో బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు...
సహకార రంగంలో మహిళల స్వావలంబనకు రూ.1,362.22 కోట్లతో సమగ్ర ప్రాజెక్టును రూపొందించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. 500 లీటర్ల కన్నా ఎక్కువ పాల సేకరణ జరిగే 9,899 గ్రామాల్లో బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పాల ఉత్పత్తి కేంద్రాలు ఆర్‌బీకేకు అనుసంధానంగా పనిచేస్తాయని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఏపీ కేబినెట్
ఎందుకు : ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఉత్పతులు అందుబాటులో ఉంటాయని

ఏ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టనుంది?
భూ రక్షణకు సంబంధించి ‘భూమి రక్ష’ పేరుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమగ్ర భూసర్వే చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నవంబర్ 5న నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి 1న ప్రారంభమయ్యే ఈ సర్వేను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సర్వే చేసిన ప్రతి భూమికి యునిక్ నంబర్ కేటాయిస్తారు. ఈ నంబర్ ద్వారా పట్టాదారుడు తన భూమి వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. అన్ని లావాదేవీలకు ఈ నంబర్ వర్తిస్తుంది. వ్యవసాయ భూములతో పాటు గ్రామ కంఠాలు, మున్సిపాల్టీలలోని నివాసిత స్థ్ధలాలకు సంబంధించి పక్కా పాస్‌బుక్, లీగల్ టైటిల్ కల్పించడమే సర్వే లక్ష్యం.
మచిలీపట్నం పోర్టుకు రూ.5,835 కోట్లు...

  • మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులకు రైట్స్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదించడంతో పాటు ఆ ప్రాజెక్టు మొదటి దశ పనులకు పరిపాలనా అనుమతులకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5,835 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం.
  • మొదటి దశ పనులకు అవసరమైన 225 ఎకరాల భూసేకరణ కోసం ఏపీ మారిటైం బోర్డు రూ.90 కోట్లు కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మారిటైం బోర్డు మొత్తం రూ.4,745 కోట్లు సేకరించనుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : భూమి రక్ష’ పేరుతో సమగ్ర భూసర్వే
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ కేబినెట్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా

జగనన్న తోడు పథకం కింద చిన్న, వీధి వ్యాపారాలకు ఎంత మొత్తాన్ని రుణంగా అందించనున్నారు?
2020, నవంబర్ 24న ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. నవంబర్ 5న సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో చిన్న, వీధి వ్యాపారాలు చేసుకునే వారు, చేతి వృత్తుల కళాకారులకు వడ్డీ లేకుండా ‘జగనన్న తోడు’ పథకం కింద రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇవ్వనున్నారు. ఈ పథకానికి రూ.వెయి్య కోట్లు కేటాయించారు.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు...

  • కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో మెరుగైన ఇసుక విధానానికి ఆమోదం. ఇకపై ఆఫ్‌లైన్‌లోనే ప్రజలు ఇసుక పొందే అవకాశం.
  • 2020, నవంబరు 17న ప్రారంభించనున్న వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి ఆమోదం.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ)ను బలోపేతం చేయడంతో పాటు ఆ సంస్థకు చట్టబద్దత కల్పించడం కోసం శాసనసభలో ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లుకు ఆమోదం.
  • రూ.700 కోట్ల పెట్టుబడితో ఇంటిలిజెంట్ సెజ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో పాదరక్షల తయారీ యూనిట్, రూ.1,050 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ కంపెనీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల వల్ల 36,900 మందికి ఉపాధి లభిస్తుంది.
  • 2021, జనవరి 1 నుంచి లబ్ధిదారుల ఇంటికే నాణ్యమైన (సార్టెక్స్) రేషన్ బియ్యం సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఈ విధానం శ్రీకాకుళం జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా అమలవుతోంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020, నవంబర్ 24న ‘జగనన్న తోడు’ పథకం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఏపీ మంత్రి మండలి
ఎందుకు : వీధి వ్యాపారాలు, చేతి వృత్తుల కళాకారులకు వడ్డీ లేకుండా రూ.10 వేల వడ్డీ లేని రుణం కల్పించేందుకు

ఏపీలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న తైవాన్ సంస్థ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తైవాన్‌కు చెందిన పీఎస్‌ఏ వాల్సిన్ సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ పెట్టుబడితో చిత్తూరు జిల్లా ఈఎంసీ-2 లేదా వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్ ఈఎంసీలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని నవంబర్ 6న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.
విశాఖలో రీసెర్చ్ కేంద్రం...
నవంబర్ 6న ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చెన్నైలోని తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ డెరైక్టర్ జనరల్ బెన్ వాంగ్ నాయకత్వంలో తైవాన్ కంపెనీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అపార అనుభవం ఉన్న తైవాన్ విశాఖలో హైఎండ్ స్కిల్, అడ్వాన్స్ డ్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.700 కోట్ల పెట్టుబడులు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : తైవాన్‌కు చెందిన పీఎస్‌ఏ వాల్సిన్ సంస్థ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్ ఏర్పాటుకు

తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టబడి
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పేరొందిన అమెజాన్.. ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ఏర్పాటుకు రూ.20,761 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు నవంబర్ 6న వెల్లడించారు. తెలంగాణ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా నిలవనుందని పేర్కొన్నారు.
ఆసియా రీజినయన్‌కు కేంద్రంగా...
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్ రీజియన్‌కు హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉంటుంది. ఈ రీజియన్ పరిధిలో 3 అవైలబిలిటీ జోన్లు, ఒక్కో జోన్ పరిధిలో అనేక డేటా సెంటర్లు ఉంటాయి. ఆసియా పసిఫిక్ రీజియన్ నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2022 ప్రథమార్ధంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. స్థానికంగా ఏర్పాటయ్యే డేటా సెంటర్లన్నీ ఒకే రీజియన్‌లో పరిధిలో ఉన్నా దేనికదే స్వతంత్రంగా పనిచేస్తాయి. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఉంటుందని అమెజాన్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.20,761 కోట్లు పెట్టుబడి
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : అమెజాన్
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ
ఎందుకు : అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ ఏర్పాటుకు

ఏపీలోని ఏ జిల్లాలో ఎంఎస్‌ఏఎఫ్ స్టీల్ ప్లాంటు ఏర్పాటు కానుంది?
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్‌ఏఎఫ్) నూతన స్టీల్ ప్లాంటు ఏర్పాటు కానుంది. 4 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఈ నూతన ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు నవంబర్ 6న ఎంఎస్‌ఏఎప్ సంస్థ వెల్లడించింది. ఇందుకోసం రూ.1,200 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ ప్లాంటు ఏర్పాటుతో 1,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయని కంపెనీ డెరైక్టర్ గౌతమ్ గనెరివాల్ తెలిపారు.
ఇప్పటికే సంస్థకు తెలంగాణ, ఏపీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు. వీటి సామర్థ్యం 2021లో 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం సంస్థలో 8,000 మందికిపైగా ఉద్యోగులున్నారు. గ్రూప్ టర్నోవర్ రూ.2,100 కోట్లుగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్‌ఏఎఫ్) నూతన స్టీల్ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్‌ఏఎఫ్)
ఎక్కడ : మంత్రాలయం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్

మానవత్వమే నా మతం అనే పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ?
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్నప్పడు 2017, నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’ చేపట్టారు. ఈ యాత్ర చేపట్టి మూడేళ్లు అయిన సందర్భంగా గాంధీ పథం పక్షపత్రిక మానవత్వమే నా మతం’ అన్న పేరుతో పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో 2020, నవంబర్ 6న ఆవిష్కరించారు. 3,648 కి.మీల ప్రజా సంకల్ప పాదయాత్రలో చోటు చేసుకున్న పలు మానవీయ ఘటనలు, ఆ సందర్భంగా నాడు వైఎస్ జగన్ దృక్పథంతో పాటు, ఆయన చిన్నతనం నుంచి ప్రదర్శించిన పలు మానవీయ కోణాలను ఆవిష్కరింప చేస్తూ ఈ ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించారు.
ప్రజాశక్తి భవనం ప్రారంభం...
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన ప్రజాశక్తి దినపత్రిక కార్యాలయ భవనాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 6న ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సీఎం కంప్యూటర్ బటన్ నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మానవత్వమే నా మతం అనే పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ?
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : గాంధీ పథం పక్షపత్రిక
ఎందుకు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టి మూడేళ్లు అయిన సందర్భంగా...

సోమశిల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు నవంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రూ.459 కోట్లతో చేపట్టిన లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులు పూర్తయితే ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గంలో 36,350 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కలుగుతుందన్నారు.
2022 ఖరీఫ్ నాటికి పోలవరం...

  • జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. 2022 ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించే విధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
  • వంశధార స్టేజ్-2 ఫేజ్-2, వంశధార-నాగావళి అనుసంధానం, వెలిగొండ తొలి దశ, అవుకు టన్నెల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను 2020 ఏడాదే పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : సోమశిల ప్రాజెక్టు హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కృష్ణాపురం, మర్రిపాడు మండలం, నెల్లూరు జిల్లా
ఎందుకు : ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో మరిన్ని ఎకరాలకు సాగునీటిని అందించేందుకు

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ఆవిష్కరణ
వైద్యం బిల్లు వెయి్య రూపాయలు దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింప చేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగిలిన ఆరు జిల్లాలైన శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలకు విస్తరించే కార్యక్రమం ప్రారంభమైంది. నవంబర్ 10న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో పాటు కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చిన 234 చికిత్సలను కలిపి మొత్తం 2,434 వైద్య చికిత్సలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింప చేశారు.
ఆరోగ్యశ్రీ యాప్...
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ తెలుగు, ఇంగ్లిష్ వెర్షన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. లబ్ధిదారులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తమ హెల్త్ రికార్డులు పరిశీలించుకోవచ్చు. ఇందులో అన్ని ఆస్పత్రుల చిరునామా, చికిత్సల వివరాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం...

  • రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలను ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తెచ్చాం. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి వర్తింపచేశాం. దీని వల్ల దాదాపు 95 శాతం కుటుంబాలకు పథకం వర్తిస్తోంది. హెల్త్ రికార్డులతో అనుసంధానం అయిన క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులు జారీ చేశాం.
  • జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో 2,059 చికిత్సలతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాం. అదే సమయంలో మిగిలిన జిల్లాల్లో 1,313 రకాల చికిత్సలను పథకంలోకి తీసుకువచ్చాం.
  • గతంలో కేవలం 1,059 చికిత్సలు మాత్రమే ఉండేవి.
  • ఆరోగ్యశ్రీ పరిధి విస్తరిస్తూ, 2020, జూన్ 16న కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు విస్తరించాం. ఇప్పుడు మిగతా జిల్లాల్లోనూ వర్తింప చేశాం. కోవిడ్, పోస్ట్ కోవిడ్ చికిత్సను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చాం.

క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణ
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం
ఎందుకు : వైద్యం కోసం పేద కుటుంబాలు ఇబ్బందిపడకూడదని...

ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అండ్ డేటా సెంటర్ ప్రారంభం125
సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా.. అత్యాధునిక సాంకేతికతతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో నిర్మించిన ‘పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్’ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు నవంబర్ 11న ఈ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని సీసీటీవీలను సైబరాబాద్ డేటా సెంటర్‌తో అనుసంధానం చేశారు. డేటా సెంటర్ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
మంత్రి కేటీఆర్ ప్రసంగం...

  • మహిళల భద్రత విషయంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్లు వాడటం వల్ల నేరాలు తగ్గే అవకాశముంది.
  • దేశంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో 60 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
  • సైబరాబాద్ డేటా సెంటర్ ద్వారా పోలీసు పెట్రోలింగ్ వాహనాలు ఏ ఏ సమయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే వీలుంది. నేరం జరిగిన ప్రాంతానికి ఏ వాహనం దగ్గరగా ఉంటే వారికి సమాచారమిచ్చి సులువైన మార్గంలో వెళ్లేలా సెంటర్ సిబ్బంది మార్గదర్శనం చేస్తారు.
  • అంబులెన్స్ లకు కూడా పెట్రోలింగ్ వాహనాలకు మాదిరిగానే ఈ సెంటర్‌తో అనుసంధానం చేయాలి. ప్రమాదసమయాల్లో ప్రాధమ్యంగా భావించే గోల్డెన్ అవర్‌లో రోగి సమీప ఆసుపత్రికి వెళ్లే దారి చూపేలా వైద్యారోగ్య శాఖతో మాట్లాడి అనుసంధానం చేయాలి.

క్విక్ రివ్యూ:
ఏమిటి : పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ అండ్ డేటా సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, కె.తారక రామారావు
ఎక్కడ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్, గచ్చిబౌలి, హైదరాబాద్
ఎందుకు : సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా..

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థ?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయ నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రై వేట్ లిమిటెడ్ దక్కించుకుంది. అక్టోబర్ 29న కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీఓటీ) టెండర్లకు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి ఈ సంస్థను ఎల్‌గా గుర్తించింది. రూ.494.86 కోట్లకు సంబంధించిన నిర్మాణ అంచనా వ్యయానికి సంబంధించి షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ 4.02 శాతం ఎక్సెస్ మొత్తానికి కోట్‌చేసింది.
12 నెలల్లో నిర్మాణం పూర్తి...
టెండర్లలో పాల్గొన్న రెండో సంస్థ ఎల్‌అండ్‌టీ (చెన్నై) 4.8 శాతం అధిక మొత్తానికి కోట్ చేసింది. టెండర్లలో ఈ రెండు సంస్థలు మాత్రమే పాల్గొన్నందున, తక్కువ మొత్తం కోట్‌చేసిన షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ఎల్‌గా గుర్తింపు పొంది నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకుంది. కాంట్రాక్టు దక్కించుకున్న షాపూర్‌జీ సంస్థతో రెండు వారాల తర్వాత రోడ్లు, భవనాల శాఖ ఒప్పందం చేసుకోనుంది. 12 నెలల్లో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం షరతు విధించింది.
క్విక్ రివ్వూ:
ఏమిటి : తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను దక్కించుకున్న సంస్థ
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : షాపూర్‌జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రై వేట్ లిమిటెడ్

రెవెన్యూ రికార్డుల్లో ఎలక్టాన్రిక్ ఇంటర్వెన్షన్ ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రం?
తెలంగాణలో భూ రికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందించిన ‘ధరణి పోర్టల్’ ప్రారంభమైంది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతల పల్లిలో అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ... దేశంలో తొలిసారిగా రెవెన్యూ రికార్డుల్లో ఎలక్టాన్రిక్ ఇంటర్వెన్షన్ ప్రవేశపెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్‌లో గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతుల సర్వే నంబర్లతో సహా భూముల వివరాలను పొందుపరుస్తారు.
ముఖ్యమంత్రి ప్రసంగం...

  • ధరణి పోర్టల్ భారత దేశానికే ట్రెండ్‌సెట్టర్. ప్రపంచంలో క్లీన్ ల్యాండ్ రికార్డులున్న ప్రాంతం భారతదేశంలోని తెలంగాణ అని ప్రపంచవ్యాప్తంగా పేరురావాలి.
  • దేశంలో తొలిసారిగా రెవెన్యూ రికార్డుల్లో ఎలక్టాన్రిక్ ఇంటర్వెన్షన్ ప్రవేశపెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. శాశ్వతంగా భూ బాధలుపోవాలి.
  • తెలంగాణలోని ప్రతి ఇంచు జాగాను డిజిటల్ మెకానిజంలో పూర్తిగా సర్వే చేస్తం. గట్టు నిర్ణయించి అక్షాంశాలు, రేఖాంశాలు రికార్డు చేస్తరు.
  • పహణీలో ఇంతకుముందు 33 కాలమ్స్‌ఉండే. ఇప్పుడే మూడే మూడు ఉంటయి. రైతు పేరు, పట్టాదారు పేరు ఉంటది. ఏయే కాలం (పంట కాలం) ఉంటది.
  • ధరణి వచ్చిన తర్వాత భూముల మార్పిడి ఇక జరగదు. సాదాబైనామాలకు ప్రభుత్వం ఇప్పటికే చిట్టచివరి అవకాశమిచ్చింది. ఆ తర్వాత కేవలం రిజిస్ట్రేషన్ ద్వారానే భూమి మారుతుంది.
  • గరిష్టంగా 15-20 నిమిషాల్లో అప్పటికప్పుడే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయిపోతుంది. దరణి పోర్టల్/ మీ సేవ/ వ్యక్తిగతంగా ఆఫీసుకు పోయి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్, కొనేటాయన, అమ్మేటాయనకు సంబంధించిన బయోమెట్రిక్ వేలిముద్రలతోనే పోర్టల్‌తెరుచుకుంటది.
  • అన్ని రకాలుగా క్లీన్‌అయిన కోటీ 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నయి.
  • కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఫౌతి (వారసత్వ) హక్కులు మార్చుకునే అధికారం ఆ కుటుంబానికే మేము ఇచ్చినం.

క్విక్ రివ్వూ:
ఏమిటి : రెవెన్యూ రికార్డుల్లో ఎలక్టాన్రిక్‌ఇంటర్వెన్షన్‌ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : తెలంగాణ
ఎక్కడ : దేశంలో
ఎందుకు : ధరణి పోర్టల్ ద్వారా భూ రికార్డుల సమీకృత నిర్వహణ కోసం

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ ఆవిష్కరణ
దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, ఎనర్జీ స్టోరేజీ రంగానికి హబ్‌గా తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి అక్టోబర్ 30న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో తెలంగాణ ఎలక్ట్రిక్‌ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ-2020-2030ని ఆవిష్కరించి మాట్లాడారు. ‘దేశంలోనే 1000 ఎకరాల్లో అతిపెద్ద ఎల్రక్టానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మహేశ్వరంలోని రావిర్యాల్‌ఈ-సిటీలో మాత్రమే ఉంది. జహీరాబాద్ నిమ్జ్‌ను ఆటోమొబైల్ క్లస్టర్‌గా ప్రమోట్‌చేస్తాం. దీంతో మరో 1000 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. చందన్‌వెల్లి సీతారాంపూర్‌లో ఒకటి, షాబాద్‌లో మరో ఎలక్టిక్ ్రవాహనాల క్లస్టర్‌ను తీసుకొస్తున్నాం.’ అనికేటీఆర్ పేర్కొన్నారు.
పలు కంపెనీలతో ఎంఓయూలు...
పలు ఎలక్టిక్‌ వ్రాహనాల తయారీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రూ.200 కోట్ల పెట్టుబడితో మైత్ర కంపెనీ ఎలక్టిక్‌బ్రస్సుల తయారీ పరిశ్రమను 3-5 ఏళ్లలో స్థాపించి 2,250 మందికి ఉపాధి కల్పించనుంది. ఈటీఓ మోటార్స్‌రూ.150 కోట్ల పెట్టుబడితో ఎలక్టిక్ ్రత్రీవీలర్స్ తయారీ పరిశ్రమను 3-5 ఏళ్లలో స్థాపించి 1,500 మందికి ఉపాధి కల్పించనుంది.
క్విక్ రివ్వూ:
ఏమిటి : తెలంగాణ ఎలక్టిక్ ్రవెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ2020-2030 ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ, హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో తొలి రైతు వేదిక ఎక్కడ ప్రారంభమైంది?
తెలంగాణ రాష్ట్రంలో తొలి రైతు వేదిక ప్రారంభమైంది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో క్లస్టర్ స్థాయిలో నిర్మించిన రైతువేదికను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 31న ప్రారంభించారు. రైతులను సంఘటితం చేయడం, వారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రూ.600 కోట్లతో 2,601 రైతు వేదికల్ని నిర్మించామని సీఎం తెలిపారు. చైతన్య దీపికలుగా రైతు వేదికలు పనిచేస్తాయని, ఇవి రైతు విప్లవానికి నాంది అవుతాయని చెప్పారు.
రైతు సమ్మేళనం...
రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా ఐదువేల మందితో ఏర్పాటుచేసిన ‘ఆత్మీయ రైతు సమ్మేళనం’ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రైతులంతా సంఘటితమై సాగులోని లాభనష్టాలు, వాడే పురుగుమందులు, మార్కెట్లో డిమాండ్, పంటను క్రమపద్ధతిలో మార్కెట్‌కు తరలించడం వంటివి రైతువేదికలో చర్చించుకోవాలని సీఎం సూచించారు. వీటిలో రైతుబంధు సమితి సభ్యులు కీలకపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్రంలో తొలి రైతు వేదిక ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : కొడకండ్ల, పాలకుర్తి నియోజకవర్గం, జనగామ జిల్లా
ఎందుకు : రైతులను సంఘటితం చేయడం, వారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామం?
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్నారు. ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ధి చేస్తానని నవంబర్ 1న సీఎం ప్రకటించారు. రూ.100 కోట్లు ఖర్చయినా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఏమేం కావాలనే అంశాలపై బ్లూ ప్రింట్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌ని ఆదేశించారు.

లైఫ్ సెన్సైస్ విజన్-2030 నివేదిక విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైఫ్ సెన్సైస్ అడ్వైజరీ కమిటీ రూపొందించిన ‘తెలంగాణ లైఫ్ సెన్సైస్ విజన్-2030’ నివేదిక విడుదలైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు నవంబర్ 3న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఈ నివేదికను విడుదల చేశారు. తెలంగాణ లైఫ్ సెన్సైస్ కమిటీ చైర్మన్, రెడ్డీస్ ల్యాబ్స్ అధిపతి సతీశ్‌రెడ్డితో పాటు కమిటీలో సభ్యులుగా ఉన్న ఫార్మా కంపెనీల అధిపతులు, నిపుణులు, విద్యాసంస్థల అధిపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. లైఫ్ సెన్సైస్ రంగంలో 2030 నాటికి ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణి క్లస్టర్‌గా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.
డిజిటల్ నివేదిక విడుదల...
డిజిటల్ మీడియా విభాగం రూపొందించిన ‘డిజిటల్ తెలంగాణ- డిజిటల్ మీడియా ఫర్ ఎఫెక్టివ్ డిజిటల్ మేనేజ్‌మెంట్’నివేదికను మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో విడుదల చేశారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : తెలంగాణ లైఫ్ సెన్సైస్ విజన్-2030 నివేదిక విడుదల
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : ప్రగతిభవన్, హైదరాబాద్

జయశంకర్ అగ్రి వర్సిటీతో బేపాక్ సంస్థ ఒప్పందం
తెలంగాణ సోనా బియ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో హైదరాబాద్‌కు చెందిన బేపాక్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో వర్సిటీ వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ఎస్.సుధీర్‌కుమార్, బేపాక్ ఫోర్‌ఎక్స్ సంస్థ డెరైక్టర్ ఉదయ్‌నదీవాడే నవంబర్ 3న పరస్పరం ఒప్పంద పత్రాలు అందజేసుకున్నారు. స్వల్పకాలిక వరి రకం తెలంగాణ సోనా(ఆర్‌ఎన్‌ఆర్15408)ను 2015లో విడుదల చేశామని వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు తెలిపారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : బేపాక్ సంస్థ
ఎందుకు : తెలంగాణ సోనా బియ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు

పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 381 కోట్లతో అభివృది పనులు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 4న శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 381 కోట్లతో ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు, జిల్లాలోని రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. వీటికి సంబంధించి ఏలూరు ఏఎస్‌ఆర్ స్టేడియం సమీపంలో వీవీనగర్ బెయిలీ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
సీఎం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనలు...

  • ఏలూరు నగరానికి దుఃఖదాయినిలా మారిన తమ్మిలేరు నుంచి రక్షణకు తూర్పు, పశ్చిమ ఏటిగట్లను పటిష్టం చేస్తూ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రూ. 80 కోట్లతో కాంక్రీట్ గోడ నిర్మించనున్నారు.
  • జిల్లాలో గ్రామాలను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ రోడ్లు విస్తరణ, అభివృద్ధి, వంతెనల నిర్మాణ పనులను ఫేజ్ 1 కింద రూ. 201 కోట్లతో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.
  • జిల్లా వ్యాప్తంగా 11 రోడ్లను 74.13 కిలో మీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి చేయటంతో పాటు వంతెనలు నిర్మిస్తారు.
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూఅర్బన్ మిషన్ పథకం కింద ఏలూరు క్లస్టర్ దెందులూరు నియోజకవర్గంలో మొత్తం రూ. 100 కోట్ల విలువ గల పనులను చేపట్టగా, ఇప్పటికీ రూ. 24.14 కోట్ల విలువ కలిగిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా రూ. 75.86 కోట్లు విలువ కలిగిన పనులు చేపట్టనున్నారు.

క్విక్ రివ్వూ:
ఏమిటి : రూ. 381 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

భారత వాయుసేనలోకి మరో మూడు రఫేల్ యుద్ధవిమానాలు
భారత వాయుసేన(ఐఎఎఫ్) అమ్ములపొదిలోకి మరో మూడు అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. ఫ్రాన్స్ నుంచి బయలుదేరి నేరుగా గుజరాత్‌లోని జామ్‌నగర్ వైమానిక స్థావరంలో నవంబర్ 4న దిగాయి. ఈ విషయాన్ని భారత వాయుసేన వెల్లడించింది. 2020, ఏడాది జులై 29న మొదటి విడతగా 5 రఫేల్ యుద్ధవిమానాలు భారత్‌కు వచ్చాయి. ప్రస్తుతం వచ్చిన 3 రఫెల్ జెట్‌లతో కలిపి ఇప్పటికి మొత్తం 8 రఫేల్ యుద్ధవిమానాలు భారత్‌కు అందాయి. 2016లో భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.










































































































































































































































#Tags