PSA Plants: ఇటీవల 144 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించిన రాష్ట్రం?
రాష్ట్రవ్యాప్తంగా రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్‌పీఎం(లీటర్ పర్ మినిట్) సామర్ధ్యం కలిగిన 144 ఆక్సిజన్ ఉత్పత్తి (పీఎస్‌ఏ) ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. పీఎస్‌ఏ ప్లాంట్లతో పాటు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్‌ఎంవో ట్యాంకులు, ఆక్సిజన్ పైపులైన్లు ఇతర మౌలిక సదుపాయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 10న తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
247 పీఎస్‌ఏ ప్లాంట్లు..
పీఎస్‌ఏ ప్లాంట్ల ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కోవిడ్–19 సెకండ్ వేవ్ నేర్పిన పాఠాలతో ఆక్సిజన్ కొరత లేకుండా జాగ్రత్తలు చేపట్టామన్నారు. ‘‘144 పీఎస్‌ఏ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నెలకొల్పి ప్రజలకు ఇవాళ అందుబాటులోకి తెస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 32 పీఎస్‌ఏ ప్లాంట్లను జాతికి అంకితం చేశాం. మరో 71 ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పీఎస్‌ఏ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వమే 30 శాతం సబ్సిడీని భరిస్తూ చేయూత అందిస్తోంది. తద్వారా 247 చోట్ల సొంతంగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ఏర్పాటవుతాయి’’ అని సీఎం పేర్కొన్నారు.
చదవండి: 24వ ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సును ఎక్కడ ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 93,600 ఎల్‌పీఎం(లీటర్ పర్ మినిట్) సామర్ధ్యం కలిగిన 144 ఆక్సిజన్ ఉత్పత్తి (పీఎస్‌ఏ) ప్లాంట్లు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా...
ఎందుకు : ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్