DPIIT's July report: పెట్టుబడుల ఆకర్షణలో APనే అగ్రగామి
పారిశ్రామిక పెట్టుబడులను అకర్షించడంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అతి పెద్ద ఘనత సాధించింది.
2022 సంవత్సరంలో పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)జూలై నెల నివేదికలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి విషయం వెల్లడైంది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో దేశం మొత్తం మీద 1.71 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా రూ.40,361 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఆ నివేదిక పేర్కొంది. రూ.36,828 కోట్ల పెట్టుబడులతో ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. దేశంలో పెట్టుబడుల్లో ఈ రెండు రాష్ట్రాలది 45 శాతం అని డీపీఐఐటీ తెలిపింది.
Also read: SIPB: రాష్ట్రంలో 36,380 మందికి ఉపాధి లభించేలా రూ.1,26,622.23 కోట్లు పెట్టుబడులు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags