Andhra Pradesh: త్వరలో 1.67 లక్షల కొత్త రైస్ కార్డులు
రాజానగరం: త్వరలోనే 1.67 లక్షల మందికి కొత్త రైస్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 1.46 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 2,11,511 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.846 కోట్లు వెచి్చస్తోందని, దీనికి అదనంగా ఏటా రూ.200 కోట్లతో ఫోలిక్ యాసిడ్, బి–12 విటమిన్, ఐరన్‌తో కూడిన నాణ్యమైన ఫోరి్టఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
#Tags