కరెంట్ అఫైర్స్( 2018 డిసెంబరు 28 నుండి 2019, జనవరి 3 వరకు)
1. ఇండియన్ సబ్‌కాంటినెంట్ డెసిషెన్ సెనైన్స్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్డీఎస్ఐ) 12వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది?
1. న్యూఢిల్లీ
2. కోల్‌కత
3. ముంబై
4. చెన్నై
- View Answer
- సమాధానం: 3
2. 2018, డిసెంబరు 27 నుండి 2019, జనవరి 7 వరకు అసోం లోని ఏ నది ఒడ్డున 3వ ద్విజింగ్ ఉత్సవాలు జరిగాయి?
1. అయి నది
2. మానస్ నది
3. కోపిలీ నది
4. బారక్ నది
- View Answer
- సమాధానం: 1
3.నీతీఆయోగ్ విడుదల చేసిన అనుబంధ జిల్లా కార్యక్రమం రెండవ డెల్టా ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచినజిల్లా?
1. విరుథూనగర్, తమిళనాడు
2 నౌపాడ, ఒడిశా
3.గుంటూరు, ఆంధ్రప్రదేశ్
4.ఔరంగాబాద్, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
4. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ క్లీన్ గ్రీన్ అండ్ హెల్తీ నేషన్ నేపథ్యంతో సాగిన 26వ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్(ఎన్సీఎస్సీ) ఎక్కడ జరిగింది?
1. ముంబై, మహారాష్ట్ర
2.లక్నవూ, ఉత్తరప్రదేశ్
3. పనాజీ, గోవా
4.భువనేశ్వర్, ఒడిశా
- View Answer
- సమాధానం: 4
5. అనుబంధ జిల్లాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించిన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ పురస్కారం అందుకున్నారు?
1. తమిళనాడు
2. తెలంగాణ
3. మేఘాలయ
4.మణిపూర్
- View Answer
- సమాధానం: 4
6. మణిపూర్ గవర్నర్ డాక్టర్. ఎ.నజ్మా హెప్తుల్లా 5 రోజుల 42వ ఇండియన్ సోషియల్ సైన్స్ కాంగ్రెస్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1.ఇంఫాల్, మణిపూర్
2.భువనేశ్వర్, ఒడిశా
3. రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
4. న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
7. న్యూఢిల్లీలో నమామీ గంగే కార్యక్రమంలో యమున పునరుజ్జీవనం కోసం ఎన్ని పథకాలకు శంకుస్థాపన జరిగింది?
1. 15
2. 21
3. 18
4. 11
- View Answer
- సమాధానం: 4
8. కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ ఆమోదించిన గగన్‌యాన్ కార్యక్రమం- భారత మనవరహిత అంతరిక్షయానం వ్యయం ఎంత?
1. రూ.9023 కోట్లు
2. రూ.8027 కోట్లు
3. రూ.7899 కోట్లు
4.రూ.4587 కోట్లు
- View Answer
- సమాధానం: 1
9. పాటల్పని-కలాకుండ్ విభాగంలో పశ్చిమ రైల్వే ప్రత్యేక వారసత్వ రైలును ప్రారంభించింది. ఇది ఏ రాష్ట్రంలోఉంది?
1. మధ్యప్రదేశ్
2. రాజస్థాన్
3. గుజరాత్
4. మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
10. ప్రపంచంలోనే అతి పురతనమైన యోగా సంస్థ, శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ
2. అహ్మదాబాద్
3.చెన్నై
4. ముంబై
- View Answer
- సమాధానం: 4
11.'బాగ్‌బజార్ -ఓ- రసగుల్ల' పేరుతో 3రోజుల రసగుల్లా ఉత్సవం ఎక్కడ ప్రారంభమైంది?
1.రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
2. కోల్‌కత, పశ్చిమ్ బంగా
3. భువనేశ్వర్, ఒడిశా
4. భోపాల్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
12. రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చే నాలుగేళ్లలో 250 కోట్లు రూపాయల అంచనా వ్యయంతో భారత్‌లో ప్రధాన భూభాగం గల ఏ దీవులను తిరిగి కలపడానికి తొలి లిఫ్ట్ బ్రిడ్జ్‌ను నిర్మించతలపెట్టింది?
1. రామేశ్వరం
2. లక్షద్వీప్
3.నెడుంగాడ్
4.పడంగల్
- View Answer
- సమాధానం: 1
13. జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ), కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఫిర్యాదులను దాఖలు చేసేందుకు పారంభించిన టోల్ ఫ్రీ నంబర్?
1.18121
2.14433
3.15567
4.17552
- View Answer
- సమాధానం: 2
14. మధుర మీనాక్షి ఆలయంలో ప్రసిద్ధ రథోత్సవం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఆంధ్రప్రదేశ్
2. తమిళనాడు
3. కర్ణాటక
4. కేరళ
- View Answer
- సమాధానం: 2
15. భారత ప్రభుత్వంనేతాజీ సుభాశ్చంద్ర బోస్ జయంతి సందర్భంగా 2019, జనవరి 23న ఏ రంగంలో విశేష సేవలకుగాను 'సుభాశ్‌చంద్రబోస్ ఆపద ప్రభంధన్ పురస్కార్' ను ఇవ్వనుంది?
1. విపత్తు నిర్వహణ
2. ఆర్థిక నిర్వహణ
3.శాస్త్రీయ ఆవిష్కరణలు
4. శాంతి వ్యాప్తి
- View Answer
- సమాధానం: 1
16.ఒక జిల్లా, ఒక ఉత్పత్తి ప్రాంతీయ సమావేశం ఏ నగరంలో జరిగింది?
1. హైదరాబాదు
2. వారణాసి
3. భోపాల్
4. జైపూర్
- View Answer
- సమాధానం: 2
17. స్వచ్ఛ సర్వేక్షన్ 2018 కింద ఘన వ్యర్థ నిర్వహణలో ఉత్తమ రాజధాని నగర పురస్కారం అందుకున్న నగరం?
1. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ)
2. బృహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ)
3. గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పోరేషన్(జీసీఎంసీ)
4. కోల్‌కత మున్సిపల్ కోర్పోరేషన్(కేఎంసీ)
- View Answer
- సమాధానం: 1
18. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని రాస్ ఐలాండ్ కొత్తపేరు?
1. షహీద్ ద్వీప్
2.నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ ద్వీప్
3.స్వరాజ్ ద్వీప్
4. మహాత్మాగాంధీ ద్వీప్
- View Answer
- సమాధానం: 2
19. 2019, జనవరి 1న భారతదేశ 25 హైకోర్టుగా ఆవిర్భంచిన పత్యేక హైకోర్టు ఏ రాష్ట్రంలో ఏర్పడింది?
1. తెలంగాణ
2.మిజోరాం
3.సిక్కిం
4. ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
20. 18-60 ఏళ్ల వయసులో మరణించిన రైతుకు పరిహారంగా వారి కుటుంబానికి 2 లక్షల రూపాయలను 'క్రిషి క్రిషక్ బొందు' పథకం కింద అందించనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
1.రాజస్థాన్
2. పశ్చిమ్ బంగా
3. పంజాబ్
4. హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
21. నీసెట్పార్లమెంట్, మెడికల్ మారిజునా ఎగుమతిని అనుమతించే చట్టాన్ని ఆమోదించింది. ఇది ఏ దేశ పార్లమెంట్?
1. స్పెయిన్
2.మెక్సికో
3.ఇజ్రాయిల్
4. ఈజిప్టు
- View Answer
- సమాధానం: 3
22. శాంతియుత ప్రయోజనాల కోసం బాహ్యాంతరిక్ష వినియోగం, ప్రయోగాలను అనుమతించే ఒప్పందాన్ని ఏ దేశ మంత్రివర్గం ఆమోదించింది?
1. సావో టోమ్& ప్రిన్సిపి
2. నౌరు
3. శాన్ మారినో
4.మార్షల్ ఐలాండ్స్
- View Answer
- సమాధానం: 1
23. 2019, ఫిబ్రవరి 7 నుండి 8 రోజుల పాటే జరిగే 11వ బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(బీఐఎఫ్‌ఎఫ్‌ఈఎస్) నేపథ్యం ఏమిటి?
1.ఫ్రీజ్ ద మొమెంట్
2.రివిలేషన్ ఆఫ్ యాన్ ఎరా
3. నేచర్స్ ఫ్యూరీ
4 .జాయ్ ఆఫ్ క్రియేటింగ్
- View Answer
- సమాధానం: 3
24. సిక్కు తత్వవేత్త, సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సద్గురు రాంసింగ్జీ ద్విశత జయంతి సందర్భంగా అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరగనుంది?
1. ఛండీగఢ్
2.న్యూఢిల్లీ
3.అమృత్సర్
4.లుథియానా
- View Answer
- సమాధానం: 2
25. ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశం ఆమోదించిన రెండు రష్యా తీర్మానాలకు భారత్ కూడా మద్దతు తెలిపింది. ఈ తీర్మానాలు దేనికి సంబంధించినవి?
1. అంతర్జాతీయ సమాచార భద్రత(ఐఎస్ఎస్)
2.అంతర్జాతీయ సముద్ర భద్రత (ఐఎంఎస్)
3.అంతర్జాతీయ సైబర్ భద్రత(ఐసీఎస్)
4. అంతర్జాతీయ డేటా భద్రత(ఐడీఎస్)
- View Answer
- సమాధానం: 1
26. భారతదేశం నుండి ప్రతిపాదిత పెట్టుబడుల ద్వారా తన ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకోడానికి ఏ దేశం 2019ని ‘యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇయర్‘ గా ప్రకటించింది?
1. బంగ్లాదేశ్
2. ఆస్ట్రేలియా
3. ఉజ్బెకిస్తాన్
4.ఆఫ్గనిస్తాన్
- View Answer
- సమాధానం: 3
27. దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఇస్రో అభివృద్ధి చేసే గ్రౌండ్ స్టేషన్‌ను ఏ దేశంలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు?
1. మయన్మార్
2.భూటాన్
3. శ్రీలంక
4. బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
28. యునెస్కో,ఇజ్రాయిల్ వ్యతిరేక పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందంటూ 2018, డిసెంబరు 31న ఇజ్రాయిల్ తోపాటు యునెస్కో నుండి వైదొలిగిన దేశం?
1. పాలస్తీనా
2. ఇరాన్
3. అమెరికా
4. ఈజిప్టు
- View Answer
- సమాధానం: 3
29.కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి సెంట్రల్ బ్యాంకు ఆర్థిక మూలధన విధానాన్ని సమీక్షించే కమిటీ అధిపతిగా ఆర్బీఐ ఎవరిని నియమించింది?
1. బీమల్ జలాన్
2.ఉర్జీత్ పటేల్
3. రాణా సింగ్
4. మానస్ కారత్
- View Answer
- సమాధానం: 1
30. భారత్ లోని 60 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో గత మూడేళ్లలో బ్యాంకు ఆస్తులను దుర్వినియోగం చేసినందుకు గాను అత్యధికంగా ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకున్న బ్యాంకు ఏది?
1.యాక్సిక్ బ్యాంకు
2. ఐసీఐసీఐ బ్యాంకు
3. హెచ్డీఎఫ్సీ
4.భారతీయ స్టేట్ బ్యాంకు
- View Answer
- సమాధానం: 2
31. కేరళ నుండి ఐదవ షెడ్యూల్డ్ బ్యాంకుగా సేవలందించడానికి రిజర్వ్ బ్యాంకు ఆమోదం పొందిన చిన్న ఫైనాన్స్ బ్యాంకు ఏది?
1. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
2. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
3. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
4..మణప్పురం స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
- View Answer
- సమాధానం: 3
32. పాండా బాండ్లను చైనా కరెన్సీలో ఇవ్వడానికి ఆమోదం తెలిపిన దేశం?
1. బంగ్లాదేశ్
2. భూటాన్
3.నేపాల్
4.పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
33.3200 శాఖల్లోని ఏ బ్యాంకు బీమా పాలసీలను విక్రయించడానికి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 'బ్యాంకష్యూరెన్స్' ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1. అలహాబాదు బ్యాంకు
2. భారతీయ స్టేట్ బ్యాంకు
3.కెనడా బ్యాంకు
4. ఫెడరెల్ బ్యాంకు
- View Answer
- సమాధానం: 1
34. గూగుల్, యాపిల్, ఫెస్బుక్,అమెజాన్ కంపెనీలు ఐరోపాలో పన్నులు సక్రమంగా చెల్లించేందుకు గఫా పన్ను(GAFA tax) ను ప్రవేశపెట్టిన దేశం?
1. ఇటలీ
2. జర్మనీ
3. ఫ్రాన్స్
4.స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 3
35. మెగ్నీషీయం డైబోరైడ్ను ఉపయోగించి ప్రపంచంలోని అత్యంత పలచని పదార్థాన్ని భారత్‌లోని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
1. ఐఐటి, గాంధీనగర్
2. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గూండీ
3.ఐఐఎస్సీ, బెంగళూరు
4.ఎన్ఐటీ, రాయ్‌పూర్
- View Answer
- సమాధానం: 1
36. 2019లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మాస్ నెస్టింగ్ సైట్‌ను ఒడిశా ప్రభుత్వం ఏ నది వద్ద ఏర్పాటు చేస్తోంది?
1. మహానది
2. బహుదా
3.వైతరిణి
4. వంశధార
- View Answer
- సమాధానం: 2
37. 3 బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే రష్యాకు చెందిన ఎస్-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
1. చైనా
2.జపాన్
3. భారత్
4. అమెరికా
- View Answer
- సమాధానం: 1
38. కేన్సర్ కణం వర్చువల్ రియాలిటీ(వీఆర్) త్రీడీ మోడల్‌ను ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు,అభివృద్ధి చేశారు?
1. ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్
2. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్
3.హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యూఎస్ఏ
4. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 2
39. మడగాస్కర్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1. ఆండ్రీ రాజోలినా
2. మార్క్ రావలోమనన
3.రామన్ మిగుల్
4. ఒలీవర్ మండ్రోవా
- View Answer
- సమాధానం: 1
40. 2018, డిసెంబరు 31న బంగ్లాదేశ్‌కు మూడోసారి ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
1. మహమ్మద్ అబ్దుల్ హమీద్
2.షేక్ హసీనా
3. అబు తాహిర్ భుట్టో
4. అబ్దుల్ సలాం ఖాన్
- View Answer
- సమాధానం: 2
41. భారత ప్రభుత్వంఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్‌గా ఎవరిని నియమించింది?
1. సందీప్ సంఘ్వీ
2. సుధీర్ భార్గవ
3. హరి మిశ్రా
4. సంతోష్ మాథుర్
- View Answer
- సమాధానం: 2
42. 2019, జనవరి 1న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
1. జస్టిస్ తొట్టాతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్
2. జస్టిస్రామచంద్రరావు
3.జస్టిస్మనీశ్ కృష్ణన్
4.జస్టిస్ సమీర్ ఖాన్
- View Answer
- సమాధానం: 1
43. 2019, జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
1.జస్టిస్ విక్రమ్ థాపర్
2.జస్టిస్ ప్రవీణ్ కుమార్
3.జస్టిస్ రమేశ్ మాథుర్
4.జస్టిస్ బి.వి.ఆర్. రావు
- View Answer
- సమాధానం: 2
44. 2019, జనవరి 1న రైల్వే బోర్డు ఛైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1.మనోజ్ కుమార్
2. వి.కె.యాదవ్
3. రంజిత్ కుమార్ ఎస్
4.దీపక్ సైనీ
- View Answer
- సమాధానం: 2
45. 2019, జనవరి 2న బ్రెజిల్ 42వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
1.ఫెర్నాండో హడార్డ్
2. జైయిర్ బాల్సోనారో
3. రిచర్డ్ హ్యాడ్లీ
4. రుఫస్ మేనార్డ్
- View Answer
- సమాధానం: 2
46. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(ఎన్ఏఎల్ఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎవరిని ప్రతిపాదించారు?
1. జస్టిస్ మదన్ బి.లాకుర్
2.జస్టిస్ శ్రీకాంత్ నాయర్
3.జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీ
4.జస్టిస్ లోకేశ్ జైన్
- View Answer
- సమాధానం: 3
47. 2018 లో 1138 పరుగులు చేసి, విదేశీ టెస్టుల్లో మాజీ భారత కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ 16 ఏళ్ల రికార్డును అధిగమించిన భార త క్రికెటర్ ?
1. శిఖర్ ధావన్
2. పృథ్వీ షా
3. విరాట్ కోహ్లీ
4.ఎం.ఎస్ ధోని
- View Answer
- సమాధానం: 3
48. టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టీఓపీఎస్) కింద 2020 ఒలింపిక్స్ సన్నాహాలకుక్రీడాకారులకోసం క్రీడా మంత్రిత్వ శాఖ కేటారుుంచిన నిధులు?
1. రూ.100 కోట్లు
2.రూ.200 కోట్లు
3. రూ.400 కోట్లు
4. రూ.500 కోట్లు
- View Answer
- సమాధానం: 1
49. టెస్ట్ సిరీస్‌లో20 క్యాచులు అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచిన భారత వికెట్ కీపర్?
1. రిషబ్ పంత్
2. పృథ్వీ షా
3. ఆర్. అశ్విన్
4. హార్ధిక్ పాండ్యా
- View Answer
- సమాధానం: 1
50. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఆవిర్భావ దినం?
1. డిసెంబరు 31
2. జనవరి 1
3. డిసెంబరు 30
4.జనవరి 2
- View Answer
- సమాధానం: 2