MLC Zakia Khanam: శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తొలి మైనారిటీ మహిళ?

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవంబర్ 26వ తేదీన ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి మైనారిటీ మహిళగా జకియా ఖానమ్‌ గుర్తింపు పొందారు.

జకియా ఖానమ్‌ నేపథ్యమిది.. 

పూర్తి పేరు: మయాన జకియా ఖానమ్‌ 
భర్త: దివంగత ఎం.అఫ్జల్‌ ఖాన్, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ 
చదువు: ఇంటర్మీడియెట్‌ 
పుట్టిన తేది: జనవరి 01, 1971 
స్వస్థలం: రాయచోటి, వైఎస్సార్‌ జిల్లా 
రాజకీయ నేపథ్యం: ఎమ్మెల్సీ (ఆగస్టు 20, 2020 నుంచి).

 

ఢిల్లీ అసెంబ్లీ నుంచి సమన్లు అందుకున్న నటి?

ఢిల్లీ శాసనసభకు చెందిన ‘శాంతి, సామరస్యం కమిటీ’ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసింది. సోషల్‌ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆక్షేపించింది. 2021, డిసెంబర్‌ 6న తమ ముందు హాజరై, వివరణ ఇవ్వాలని కంగనాను ఆదేశించినట్లు కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రాఘవ్‌ చద్ధా ఒక ప్రకటనలో వెల్లడించారు. శాంతి, సామరస్యం కమిటీని ఢిల్లీ అసెంబ్లీ 2020లో ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీలో కొన్ని నెలల క్రితం జరిగిన అల్లర్లకు సంబంధించిన ఫిర్యాదులపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది.
 

చ‌ద‌వండి: రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికైన తొలి దళిత వ్యక్తి?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :  ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతల స్వీకరించిన తొలి మైనారిటీ మహిళ?
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు    :  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ 
ఎక్కడ    : ఏపీ శాసనమండలి, అమరావతి, గుంటూరు జిల్లా 
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనందున...

డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

#Tags