Dawood Ibrahim: రెండో పెళ్లి చేసుకున్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఒక కేసు విచారణ సందర్భంగా ఎన్‌ఐఏ అధికారులకు అతని మేనల్లుడు అలీ షా పార్కర్ ఈ మేరకు వెల్లడించారు.
‘‘దావూద్‌కు నలుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు. మొదటి భార్య పేరు మెజబిన్. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లయింది. కుటుంబసభ్యులతో కలిసి దావూద్ కరాచీలో ఉంటున్నాడు. ఇటీవలే డిఫెన్స్ ఏరియాలోని రహీం ఫాకీకి మారాడు. మొదటి భార్యను ఆరు నెలల క్రితం దుబాయ్‌లో కలిశాం. ఆమె నా భార్యకు తరచూ వాట్సాప్ కాల్స్ చేస్తుంది. ఆమెకు విడాకులిచ్చానని అబద్ధం చెప్పి ఓ పాకిస్తానీ పఠాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు’’ అని చెప్పాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
#Tags