Supreme Court Judge: సుప్రీంకోర్టు జడ్జిగా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మన్‌మోహన్
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్‌మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని భారత సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర సభ్యులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృష్ణికేశ్ రాయ్, జస్టిస్ ఏ.ఎస్.ఓకా.
సుప్రీంకోర్టులో మొత్తం 34 జడ్జిల సంఖ్య కాగా.., ప్రస్తుతం 32 మంది మాత్రమే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లి పదవీ విరమణతో రెండు ఖాళీలు ఏర్పడినాయి.
జస్టిస్ మన్‌మోహన్ 2009 డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ 29న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
New CAG of India: 'కాగ్' బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు అధికారి ఈయనే..
#Tags