Riyad Mathew: ఏబీసీ చైర్మన్‌గా ఎన్నికైన రియాద్‌ మాథ్యూ

పత్రికల సర్క్యులేషన్‌ను మదింపు చేసి.. ధ్రువీకరించే ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ)కి చైర్మన్‌గా మలయాళ మనోరమకు చెందిన రియాద్‌ మాథ్యూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2024–25 సంవత్సరానికి ఆయన ఏబీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. చీఫ్‌ అసోసియేట్‌ ఎడిటర్‌ అయిన మాథ్యూ మలయాళ మనోరమ గ్రూపు డైరెక్టర్‌ కూడా. మాథ్యూ పీటీఐ వార్తా సంస్థ బోర్డులో కూడా 2009 నుంచి డైరెక్టర్‌గా ఉన్నారు. కరుణేష్‌ బజాజ్‌ (ఐటీసీ) డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కాగా, మోహిత్‌ జైన్‌ కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. యాడ్‌ ఏజెన్సీల ప్రతినిధి విక్రమ్‌ సఖుజా కోశాధికారిగా తిరిగి ఎన్నికయ్యారు. 

ఏబీసీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌లోని సభ్యుల వివరాలు ఇవే.. 

పబ్లిషర్స్‌ ప్రతినిధులు: రియాద్‌ మాథ్యూ (మలయాళ మనోరమ), ప్రతాప్‌ జి.పవార్‌ (సకాల్‌ పేపర్స్‌), శైలేష్‌ గుప్తా (జాగరణ్‌ ప్రకాశన్‌ లిమిటెడ్‌), ప్రవీణ్‌ సోమేశ్వర్‌ (హెచ్‌టి మీడియా లిమిటెడ్‌), మోహిత్‌ జైన్‌ (బెన్నెట్, కోల్‌మన్‌ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌), ధ్రువ ముఖర్జీ (ఏబీపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌), కరణ్‌ దర్దా (లోక్‌మత్‌ మీడియా ప్రై. లిమిటెడ్‌), గిరీష్‌ అగర్వాల్‌ (డీబీ కార్ప్‌ లిమిటెడ్‌). 

ప్రకటనకర్తల ప్రతినిధులు: కరుణేష్‌ బజాజ్‌ (ఐటీసీ లిమిటెడ్‌), అనిరుధ హల్దార్‌ (టీవీఎస్‌ మోటర్స్‌ కంపెనీ లిమిటెడ్‌), పార్థో బెనర్జీ (మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌). 

RS Sharma: ఓఎన్‌డీసీ ఛైర్‌పర్సన్‌గా నియ‌మితులైన ఆర్‌ఎస్‌ శర్మ

యాడ్‌ ఏజెన్సీల ప్రతినిధులు: శ్రీనివాసన్‌ కె.స్వామి (ఆర్‌కే స్వామి లిమిటెడ్‌), విక్రమ్‌ సఖుజా (మాడిసన్‌ కమ్యూనికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌), ప్రశాంత్‌ కుమార్‌ (గ్రూప్‌ ఎం మీడియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌), వైశాలి వర్మ (ఇనీషియేటివ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌), సేజల్‌ షా (పబ్లిక్స్‌ మీడియా ఇండియా గ్రూపు).

#Tags