Vice-Chancellor: డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ వర్సిటీ ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కర్నూలు నగర సమీపంలో ఉన్న డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ (వీసీ)గా హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) ప్రొఫెసర్ ఫజుల్ రహమాన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. ప్రొఫెసర్ ఫజుల్ మనూలో యూజీసీ–మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1993లో అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి నెమటాలజీలో పీహెచ్‌డీని పొందిన ఫజుల్.. 2013లో ప్రొఫెసర్‌గా, స్కూల్ ఆఫ్ సైన్సెస్, డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో యూజీసీ హెచ్‌ఆర్‌డీసీలో డైరెక్టర్ తదితర విధులను నిర్వర్తించారు.
స్టేట్ బ్యాంబూ మిషన్ ఏ శాఖ పరిధిలో పని చేస్తోంది?
స్టేట్ బ్యాంబూ మిషన్ (రాష్ట్ర వెదురు మిషన్)ను పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నుంచి వ్యవసాయ, సహకార (హార్టికల్చర్) శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఫిబ్రవరి 16న ఉత్తర్వులిచ్చారు. అటవీ ప్రాంతాల వెలుపల వ్యవసాయ భూముల్లో వెదురు పెంచడాన్ని ప్రోత్సహించేందుకు మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వెదురు మిషన్ డైరెక్టర్‌గా ఉద్యాన కమిషనర్ ఉంటారని తెలిపారు.
చదవండి: ఏపీపీఎస్సీ నూతన చైర్మన్‌గా నియమితులైన ఐపీఎస్ అధికారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డాక్టర్ అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ (వీసీ)గా నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : మనూ ప్రొఫెసర్ ఫజుల్ రహమాన్
ఎక్కడ : కర్నూలు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్