Starbucks CEOగా లక్ష్మణ్‌ నరసింహన్‌ నియామకం

మరో బహుళజాతి సంస్థ పగ్గాలు భారత సంతతి వ్యక్తి చేతికి రానున్నాయి. స్టార్‌ బక్స్‌ తదుపరి సీఈవోగా లక్ష్మణ్‌ నరసింహన్‌ (55) ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం రెకిట్‌ బెంకిసర్‌ సీఈవో పనిచేస్తున్నారు.
Laxman Narasimhan appointed as CEO of Starbucks

ఈ బాధ్యతల నుంచి సెపె్టంబర్‌ 30న తప్పుకుంటారు. అక్టోబర్‌ 1న స్టార్‌బక్స్‌ ఇన్‌కమింగ్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈవో అయిన హోవార్డ్‌ షుల్జ్‌తో కలసి పనిచేస్తారు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి పూర్తి స్థాయి సీఈవోగా, స్టార్‌ బక్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో భాగం అవుతారని కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఎన్నింటికో ప్రస్తుతం భారత సంతతి వ్యక్తులు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ సత్యనాదెళ్ల, ఆల్ఫాబెట్‌ సుందర్‌ పిచాయ్, ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్, అడోబ్‌ శంతను నారాయణన్, డెలాయిట్‌ పునీత్‌ రెంజెన్‌ తదితరుల సరసన నరసింహన్‌ కూడా చేరనున్నారు. ప్రస్తుతం లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న నరసింహన్‌ యూఎస్‌కు మారనున్నారు.  

Also read: GDP Growth Rate: ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం

విద్యాభ్యాసం..  
కాలేజీ ఆఫ్‌ ఇఫ్‌ ఇంజనీరింగ్, యూనివర్సిటీ ఆఫ్‌ పుణేలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన లక్ష్మణ్‌ నరసింహన్‌ ఉన్నత విద్యాభ్యాసం అంతా విదేశాల్లో సాగింది. జర్మనీలో మాస్టర్స్‌ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలోని లాడర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్నేషనల్‌ స్టడీస్, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ది యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఐకానిక్‌ కంపెనీలో చేరుతుండడం పట్ల నరసింహన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘హోవార్డ్, స్టార్‌ బక్స్‌ బోర్డు, కంపెనీ లీడర్‌షిప్‌ టీమ్‌తో సన్నిహితంగా కలసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాను. స్టార్‌బక్స్‌ భాగస్వాముల ఉమ్మడి సహకారంతో కంపెనీని తదుపరి వృద్ధి దశలోకి తీసుకెళతాం’’అని ప్రకటించారు. నరసింహన్‌కు బ్రాండ్ల అభివృద్ధిలో, కంపెనీల నిర్మాణంలో మంచి ట్రాక్‌ రికార్డు ఉన్నట్టు స్టార్‌బక్స్‌ ప్రకటించింది. వినియోగదారు కేంద్రంగా, డిజిటల్‌ ఆవిష్కరణలతో భవిష్యత్తు ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొంది. నరసింహన్‌ లోగడ పెప్సికో, మెకిన్సే అండ్‌ కంపెనీలోనూ పనిచేశారు. స్టార్‌బక్స్‌ 80కు పైగా దేశాల్లో కాఫీ స్టోర్లను నిర్వహిస్తోంది. భారత్‌లో టాటాలతో జాయింట్‌ వెంచర్‌ కింద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 

Also read: Quiz of The Day (September 02, 2022): భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?

బహుళజాతి కంపెనీల చీఫ్‌లుగా భారతీయులు...

పేరు కంపెనీ
సుందర్‌ పిచాయ్‌ ఆల్ఫాబెట్, గూగుల్‌
సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌
పరాగ్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌
లీనా నాయర్‌ చానెల్‌
అరవింద్‌ కృష్ణ ఐబీఎం గ్రూపు
శంతను నారాయణన్‌ అడోబ్‌ గ్రూపు
అజయ్‌పాల్‌ సింగ్‌ బంగా మాస్టర్‌కార్డ్‌
జయశ్రీ ఉల్లాల్‌ అరిస్టా నెట్‌వర్క్స్‌
రాజీవ్‌ సూరి నోకియా ఐఎన్‌సీ
జార్జ్‌ కురియన్‌ నెట్‌యాప్‌


Also read: FM Nirmala Sitharaman: రెండేళ్ల పాటు 7.4 శాతం వృద్ధి

 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags