TGPSC Chairman : టీజీపీఎస్సీ చైర్మ‌న్‌గా బుర్ర వెంక‌టేశం.. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆమోదంతో..

టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఇప్ప‌టివ‌ర‌కు కొన‌సాగిన మ‌హేంద‌ర్ రెడ్డికి త‌న ప‌ద‌వి విర‌మ‌ణ ద‌గ్గ‌ర‌వ్వ‌గా త‌న స్థానంలోకి మ‌రో వ్యక్తిని నియ‌మించి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్.శ్రీధర్ నియామకం అయ్యారు. 
బుర్రా వెంకటేశం ఐఏఎస్‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా గ‌తంలో ప‌నిచేసిన విష‌యం తెల్సిందే. బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్ట‌డంతో... ఈయ‌న స్థానంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ నియ‌మించారు.

WD&CW Department Jobs: కృష్ణా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో 14 పోస్టులు

విద్యాశాఖ కార్యదర్శి పోస్టుకు..

టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు బుర్రా వెంకటేశం విద్యాశాఖ కార్యదర్శి పోస్టుకు వీఆర్ఎస్‌కు తీసుకున్నారు. దానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. దీంతో అతని స్థానంలో విద్యాశాఖ కార్యదర్శిగా ఎన్.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. డిసెంబ‌ర్ 5వ తేదీన (గురువారం) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

 

#Tags