Ishaq Dar: పాకిస్థాన్ ఉప ప్రధానిగా ఇషాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (73) ఆ దేశ ఉప ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.
పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీకి చెందిన ఇషాక్ ఓ ఛార్టర్డ్ అకౌంటెంట్. ఆయన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్ -ఎన్‌కు చెందిన నేత. ఆయనను షరీఫ్ ఉప ప్రధానిగా నియమించినట్లు కేబినెట్ డివిజన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ఏప్రిల్ 28వ తేదీ తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు కొనసాగుతాయంది.
షరీఫ్, దార్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ప్రధాని షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కుమార్తెను దార్ కుమారునికి ఇచ్చి వివాహం చేశారు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. ఆర్థిక మంత్రిగా దార్‌కు ఆయన పార్టీలో మంచి పేరు ఉంది.
#Tags