Telangana: రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్‌గా నియమితులైన నేత?
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్‌గా ఎంఐఎం పార్టీకి చెందిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పక్షాన అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు జనవరి 12న నోటిఫికేషన్ విడుదల చేశారు. జనవరి 11 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని నిబంధన 184 (1) ప్రకారం జరిగిన ఈ నియామకం.. 182వ నిబంధన మేరకు మండలికి కొత్త చైర్మన్ ఎన్నికయ్యే వరకు అమల్లో ఉంటుంది. ప్రొటెమ్ చైర్మన్‌గా జాఫ్రి జనవరి 13న బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రొటెమ్ చైర్మన్ ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తవడంతో..
2020, జూన్ 4న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీలుగా పదవీ కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ వి. భూపాల్‌రెడ్డిని ప్రొటెమ్ చైర్మన్‌గా నియమించారు. ఆయనే ప్రొటెమ్ చైర్మన్ హోదాలో మండలిని నడిపించారు. 7 నెలల పాటు పదవిలో కొనసాగారు. ఆయన కూడా 2021, జనవరి 4న ఎమ్మెల్సీగా పదవీ కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రొటెమ్ చైర్మన్‌గా హసన్ జాఫ్రీ నియమితులయ్యారు.
చదవండి: భద్రతా వైఫల్యంపై ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : ఎంఐఎం పార్టీకి చెందిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ
ఎందుకు : ఇప్పటివరకు ప్రొటెమ్ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్సీ వి. భూపాల్‌రెడ్డి.. జనవరి 4న ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తి చేసుకోవడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్