ఆగస్టు 2020 వ్యక్తులు
మాలీ అధ్యక్షుడు ఇబ్రహీం రాజీనామా
ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు జరిగింది. సైన్య నిర్బంధంతో ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో చాలా నెలలుగా ఇబ్రహీం దిగిపోవాలని కోరుతూ అందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఆగస్టు 18న సైన్యం తిరుగుబాటు చేసి ఇబ్రహీంను ఇంట్లో నిర్బందించింది. దీంతో ఆయనతోపాటు ప్రధాని బౌబు సిస్సే సైతం రాజీనామా చేశారు. దేశంలో ప్రస్తుతం ఐరాస నేతృత్వంలో 15,600 మంది సైనికులు శాంతిపరిరక్షక విధులు నిర్వహిస్తున్నారు. మాలిలో పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి సమావేశమైంది.
మాలి రాజధాని: బమాకో
కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
క్విక్ రివ్యూ:
ఏమిటి: మాలీ అధ్యక్ష పదవికి రాజీనామా
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఇబ్రహీం బౌబకర్
ఎందుకు:సైనిక తిరుగుబాటు కారణంగా
ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియామకం
కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన నియామకానికి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆగస్టు 21న ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) వైస్ చైర్మన్ గా నియమితులైన అశోక్ లావాసా ఆగస్టు 31 తేదీన ఎన్నికల కమిషనర్‌గా విధుల నుంచి తప్పుకోనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్‌కుమార్ అదే రోజు ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సునీల్ అరోరా ప్రధాన ఎన్నికల కమిషనర్ కాగా, సుశీల్ చంద్ర ఎన్నికల కమిషన్ లో మరో సభ్యుడు. ఆగష్టు 31న రాజీవ్ కుమార్ వీరితో చేరుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నూతన ఎన్నికల కమిషనర్‌గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 21
ఎవరు: కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్
మహాత్మాగాంధీ కళ్లద్దాలకు రూ. 2.55 కోట్లు
మహాత్మాగాంధీ ధరించాడని భావిస్తున్న బంగారుపూత పూసిన కళ్లద్దాలు బ్రిటన్‌లో రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ కళ్లజోడు 2,60,000 పౌండ్ల (రూపాయలు 2.55 కోట్లు)కు అమ్ముడైంది. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ పెట్రోలియంకు పనిచేస్తున్న సమయంలో, 1910– 1930 మధ్యకాలంలో బ్రిటన్ దేశస్తుడికి ఇవి బహుమతిగా వచ్చాయి. తర్వాత ఆయన తన బంధువులకు వీటిని అందజేశారు.
బ్రిటన్ లోని సౌత్ గ్లూసెస్టర్‌షైర్‌లో నివసించే వ్యక్తి 50 ఏళ్లుగా తమ ఇంట్లో ఉన్న ఈ కళ్లజోడును వేలం వేయాల్సిందిగా కోరారు. 10 నుంచి 15 వేల పౌండ్లు పలుకుతాయని భావించారు. అయితే ఏకంగా రెండు లక్షల అరవై వేల పౌండ్లకు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నాడు. భారత్, ఖతార్, అమెరికా, రష్యా, కెనడాల నుంచి పలువురు వేలం పాటలో పాల్గొన్నారు.
డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ జి.సతీశ్ రెడ్డి పదవీకాలాన్ని కేంద్రప్రభుత్వం రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆగస్టు 24న ఆదేశాలు జారీ చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన సతీశ్‌రెడ్డి2018 ఆగస్టులో రెండేళ్ల కాలానికి డీఆర్‌డీవో చైర్మన్ గా నియమితులయ్యారు. ఆగస్టు 26వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుండగా కేంద్రం ఆయనను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డీఓడీఆర్‌డీ) కార్యదర్శిగా కూడా సతీశ్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు: ఆగస్టు 24
ఎవరు: కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ
సాహిత్య అవార్డు గ్రహీత సదానంద కన్నుమూత
చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కలువకొలను సదానంద (81) ఆగస్టు 25న కన్నుమూశారు. 1939 ఫిబ్రవరి 22న పాకాలలో జన్మించిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. సదానంద అనేక బాలల కథలు, గేయాలు, కవితలు, నవలలు కథానికలు, నాటికలు రచించారు. గ్రామీణ జీవితంతో పాటు పట్టణ జీవితాన్ని కూడా తన కథల్లో చూపించారు. రచయితగానే కాక, చిత్రకారుడుగా, కార్టూనిస్టుగా కూడా తెలుగు ప్రజలకు ఆయన చిరపరిచితులు. ప్రైమరీ టీచర్‌గా 36 ఏళ్లు పనిచేసి 1997లో రిటైరయ్యారు.
సాహిత్య అవార్డు కైవసం...
ఏమిటి: ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతకన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 25
ఎవరు: కలువకొలను సదానంద (81)
ఎక్కడ : పాకాల, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఇన్‌స్ట్రాగామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలెబ్రిటీ
ఇన్‌స్ట్రాగామ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని అనుసరిస్తున్న వారి సంఖ్య 7 కోట్ల 50 లక్షలు దాటింది. దాంతో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏడున్నర కోట్లు ఫాలోవర్లు కలిగిన తొలి ఆసియా సెలెబ్రిటీగా కోహ్లి గుర్తింపు పొందాడు. కోహ్లి తర్వాత ఆసియా నుంచి అత్యధిక ఫాలోవర్లు కలిగిన వారి జాబితాలో రెండో స్థానంలో ప్రియాంక చోప్రా (5 కోట్ల 60 లక్షలు), మూడో స్థానంలో దీపిక పదుకొనె (5 కోట్ల 20 లక్షలు) ఉన్నారు.
క్రిస్టియానో రొనాల్డో...
ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్ట్రాగామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల జాబితాలో కోహ్లి (7,57,89,920) నాలుగో స్థానంలో ఉన్నాడు. తొలి మూడు స్థానాల్లో ఫుట్‌బాల్ స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–23 కోట్లు), లయెనెల్ మెస్సీ (అర్జెంటీనా–16 కోట్లు), నెమార్ (బ్రెజిల్–14 కోట్లు) ఉన్నారు. ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌లో కోహ్లిని 4 కోట్ల 32 లక్షలు మంది... ట్విట్టర్‌లో 3 కోట్ల 74 లక్షల మంది అనుసరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌స్ట్రాగామ్‌లో ఏడున్నర కోట్లు ఫాలోవర్లు కలిగిన తొలి ఆసియా సెలెబ్రిటీ
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి
రామ జన్మభూమి ట్రస్ట్ అధిపతికి కరోనా
రామ జన్మభూమి ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్(80)కు కరోనా సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్న ఆయనకు పరీక్షలు నిర్వహించగా, కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆగస్టు 5న అయోధ్యలో నిర్వహించిన రామమందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మహంత్ వేదికను పంచుకున్నారు. ఇదే వేదికపై యూపీ సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్ ఉన్నారు. రామ మందిర ట్రస్ట్‌తో పాటు శ్రీకృష్ణ జన్మభూమి న్యాస్‌కు సైతం నృత్యగోపాల్ దాస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా బారిన పడ్డ రామ జన్మభూమి ట్రస్ట్ అధిపతి
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు:మహంత్ నృత్య గోపాల్ దాస్
గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఈవోగా రమణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా ఎస్.రమణారెడ్డికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఆగస్టు 14న జీవో విడుదల చేసింది. ఇప్పటివరకు ఈయన సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం (నెడ్‌కాప్) ఎండీగా ఉన్నారు. అలాగే, సోలార్ పవర్ కార్పొరేషన్ డిప్యూటీ సీసీఏగా పనిచేస్తున్న వీవీ హనుమంతరావుకు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది.
బ్రిటన్ కలిసి వైద్య ఉపకరణాల తయారీ
కరోనా మహమ్మారిపై పోరుకు అవసరమైన వెంటిలేటర్లు, ఇతర అత్యవసర వైద్య పరికరాల ఉత్పత్తి దిశగా ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసింది. విశాఖపట్నం జిల్లాలోని మెడ్‌టెక్ జోన్ లో 5.6 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన అత్యవసర వైద్య ఉపకరణాల తయారీకి బ్రిటీష్ ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ చేపట్టింది. ఇందుకు సంబంధించి ఏపీ, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయ ఆగస్టు 14న ప్రకటన విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీజీఈసీఎల్ కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా అదనపు బాధ్యతలు
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు: ఎస్.రమణారెడ్డి
భారత మాజీ క్రికెటర్ చేతన్ కన్నుమూత
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్న చేతన్ చౌహాన్(73) కరోనా వైరస్‌తో గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆగస్టు 16న కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన చేతన్ 1969 నుంచి 1981 మధ్య కాలంలో భారత టెస్టు, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 40 టెస్టులు ఆడిన ఆయన 16 అర్ధ సెంచరీల సహాయంతో 2,084 పరుగులు చేశారు. ఏడు వన్డేల్లో బరిలోకి దిగి 153 పరుగులు సాధించారు.
గావస్కర్‌కు జతగా...
దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్‌కు జతగా 1973 నుంచి 1981 మధ్యకాలంలో చేతన్ ఓపెనర్‌గా వచ్చారు. వీరిద్దరు 59 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌కు దిగి 3,010 పరుగులు జోడించారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక రాజకీయాల్లోకి ప్రవేశించిన చేతన్ రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతేడాది వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం సైనిక సంక్షేమం, హోంగార్డు, సివిల్ సెక్యూరిటీ శాఖా మంత్రిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 16
ఎవరు: చేతన్ చౌహాన్(73)
ఎక్కడ:గుర్‌గ్రామ్, హరియాణ
ఎందుకు: కరోనా వైరస్ కారణంగా
కేంద్ర హోంశాఖ సెక్రటరీగా వి.ఎస్.కె.కౌముది
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఏపీ కేడర్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వి.ఎస్.కె.కౌముది కేంద్ర హోంశాఖ స్పెషల్ సెక్రటరీ (అంతర్గత భద్రత)గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలను కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. పదవీ విరమణ (నవంబర్ 30, 2022) వరకు కౌముది ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు యూపీ క్యాడర్‌కు చెందిన మహ్మద్ జావేద్ అక్తర్ ఫైర్ సర్వీసులు, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలు
ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆగస్టు 17న ఆన్లైన్ వేదిక ద్వారా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. సామాజిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారమార్గాలను కనుగొనడం ఐఐటీ, ఇతర ఉన్నత విద్యాసంస్థల ముందున్న తక్షణకర్తవ్యమని ఈ సందర్భంగ వెంకయ్య పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్ర హోంశాఖ స్పెషల్ సెక్రటరీ (అంతర్గత భద్రత)గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: వి.ఎస్.కె.కౌముది
బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా రాకేశ్ ఆస్తానా
సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా గుజరాత్ కేడర్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్తానా నియమితులయ్యారు. ఆస్తానా ప్రస్తుతం ఢిల్లీలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్) సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. 2021 జులై 31 వరకూ బీఎస్‌ఎఫ్ డీజీగా ఆస్తానా వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 17న తెలిపింది. 2002 గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ దగ్ధం వంటి హైప్రొఫైల్ కేసులను ఆస్తానా విచారించారు. 1997లో సీబీఐ ఎస్పీగా ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో పశుగ్రాస స్కాంలోఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన అరెస్ట్ చేశారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా రాకేష్ ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ఓ మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి వీరి పరస్పర ఆరోపణలు కలకలం రేపాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బీఎస్‌ఎఫ్ బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: రాకేశ్ ఆస్తానా
సంగీత విద్వాంసుడు పండిట్ జస్‌రాజ్ అస్తమయం
భారత సంగీత దిగ్గజాల్లో ఒకరైన ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు, పద్మవిభూషణ్ పండిట్ జస్ రాజ్ (90) ఇకలేరు. అమెరికా న్యూజెర్సీలోని ఆయన నివాసంలో ఆగస్టు 17న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పండిట్ జస్‌రాజ్ 1930 జనవరి 28న హర్యానాలోని హిసార్ జిల్లా పిలిమండోరిలో ఒక సంగీత కుటుంబంలో పుట్టారు. మేవతి ఘరానా శైలి గాయకుడైన జస్‌రాజ్ భిన్న రాగాలకు ప్రాణప్రతిష్ట చేస్తూ ఎనిమిది దశాబ్దాలపాటు శ్రోతలను మైమరపించారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన జస్‌రాజ్ ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ (1975), పద్మభూషణ్ (1990), పద్మవిభూషణ్ (2000) అవార్డులతో సత్కరించింది. సంగీత నాటక అకాడమీ అవార్డు (1987), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2010) సహా ఆయనకు అనేక పురస్కారాలు, బిరుదులు, సత్కారాలు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు,కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: పండిట్ జస్ రాజ్ (90)
ఎక్కడ: న్యూజెర్సీ, అమెరికా
ఎందుకు: గుండెపోటు కారణంగా
మేఘాలయ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్
గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ ఆగస్టు 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర గవర్నరు భగత్ సింగ్ కోశ్యారికి గోవా బాధ్యతలను అదనంగా అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గోవా గవర్నర్‌గా కూడా కోష్యారీ అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్రపతి భవన్ ఆదేశించింది. మేఘాలయ గవర్నర్‌గా ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న తథాగతరాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్ ను రాష్ట్రపతి బదిలీ చేశారు. గతంలో జమ్ముకశ్మీర్, బిహార్ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్ పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మేఘాలయ గవర్నర్‌గా బదిలీ
ఎప్పుడు: ఆగస్టు 18
ఎవరు: గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్
ఎన్నికల కమిషనర్ లావాసా రాజీనామా
ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు అశోక్ లావాసా ఆగస్టు 18న రాజీనామా చేశారు. లావాసాత్వరలోనే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఉపాధ్యక్షునిగా చేరనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతికోవింద్ కి రాజీనామా లేఖను పంపించారు.ఆగస్టు 31న తనని బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ఆ లేఖలో కోరారు.ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోన్న ఏడీబీలో 2020, సెప్టెంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఈసీ సునీల్ అరోరా 2021, ఏప్రిల్‌లో రిటైర్ అవనున్నారు. ఆయన తరువాత, ఎన్నికల కమిషన్ లో సీనియర్ సభ్యుడు లావాసాయే. పదవీకాలం ముగియక ముందే, ఎన్నికల కమిషనర్‌గా తప్పుకున్న రెండో వ్యక్తిగా లావాసా నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు రాజీనామా
ఎప్పుడు: ఆగస్టు 18
ఎవరు: అశోక్ లావాసా
ఎందుకు :లావాసాత్వరలోనే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఉపాధ్యక్షునిగా చేరనున్నందున
మాలీ అధ్యక్షుడు ఇబ్రహీం రాజీనామా
ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు జరిగింది. సైన్య నిర్బంధంతో ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో చాలా నెలలుగా ఇబ్రహీం దిగిపోవాలని కోరుతూ అందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఆగస్టు 18న సైన్యం తిరుగుబాటు చేసి ఇబ్రహీంను ఇంట్లో నిర్బందించింది. దీంతో ఆయనతోపాటు ప్రధాని బౌబు సిస్సే సైతం రాజీనామా చేశారు. దేశంలో ప్రస్తుతం ఐరాస నేతృత్వంలో 15,600 మంది సైనికులు శాంతిపరిరక్షక విధులు నిర్వహిస్తున్నారు. మాలిలో పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి సమావేశమైంది.
మాలి రాజధాని: బమాకో
కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
క్విక్ రివ్యూ:
ఏమిటి: మాలీ అధ్యక్ష పదవికి రాజీనామా
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఇబ్రహీం బౌబకర్
ఎందుకు:సైనిక తిరుగుబాటు కారణంగా
సెబీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలాన్ని 18 నెలల పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020, సెప్టెంబర్ 1 నుంచి 2022 ఫిబ్రవరి 28 దాకా ఆయనే సెబీ చైర్మన్ గా కొనసాగుతారని ప్రకటించింది. త్యాగి పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. 2020 ఏడాది తొలినాళ్లలోనే ఆరు నెలల పాటు ఆగస్టు ఆఖరు దాకా ప్రభుత్వం పొడిగించింది. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్ మార్కెట్ల ముందు అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో త్యాగిని సెబీ చైర్మన్ గా మరో దఫా కొనసాగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా రిటైరయిన త్యాగి తొలిసారిగా 2017 మార్చి 1న మూడేళ్ల వ్యవధికి సెబీ చైర్మన్ గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
జమ్మూకశ్మీర్ ఎల్‌జీగా మనోజ్ సిన్హా
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మనోజ్ సిన్హా (61)ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.వికాస్ పురుష్ గా పేరున్న మనోజ్ సిన్హా మూడుసార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు.ఇప్పటివరకూ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామా చేయగా, ఆయన్ను నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2019 అక్టోబర్ 31న జమ్మూకశ్మీర్ ఎల్జీగా జీసీ ముర్ము బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: మనోజ్ సిన్హా
తెలంగాణ అంచనాల కమిటీ చైర్మన్ కన్నుమూత
తెలంగాణ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి (57) కన్నుమూశారు. లిపై కురుపుతో బాధపడుతున్న ఆయన 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆగస్టు 5న గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలతో పెరిగిన రామలింగారెడ్డి 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
పేరు: సోలిపేట రామలింగారెడ్డి
తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి
పుట్టిన ఊరు: చిట్టాపూర్ దుబ్బాక
మండలం, సిద్దిపేట జిల్లా
పుట్టిన తేదీ: 1962, అక్టోబర్ 2
భార్య: సుజాత
సంతానం: సతీష్ రెడ్డి, ఉదయశ్రీ
జర్నలిస్టుగా: రెండు దశాబ్దాలపాటు వివిధ పత్రికల్లో పనిచేశారు
ఎమ్మెల్యేగా విజయం: 2004, 2008, 2014, 2018 (దొమ్మాట/దుబ్బాక)
మొదటి టాడా కేసు: జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు రాసిన ఆయనపై 1989లో రాష్ట్రంలోనే మొదటి టాడా కేసు నమోదైంది. పోలీసులు ఆయనను జైలులో పెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:తెలంగాణ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: సోలిపేట రామలింగారెడ్డి (57)
ఎక్కడ: హైదరాబాద్
ఎందుకు: గుండెపోటు కారణంగా
యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రదీప్ కుమార్ జోషి
యూపీఎస్సీ నూతన కొత్త చైర్మన్ గా విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషి ఆగస్టు 7న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటి వరకూ పదవీ బాధ్యతలు నిర్వహించిన అరవింద్ సక్సేనా ప్రదీప్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కమిషన్‌లో సభ్యుడిగా చేరక ముందు ఆయన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు చైర్మన్‌గా పనిచేశారు. 2015 మే 12న ఆయన కమిషన్‌లో చేరారు. ఆర్థిక నిర్వహణ విభాగంలో నిపుణత కలిగిన జోషి 2021 మే 12వరకూ చైర్మన్‌గా ఉంటారు. జోషి చైర్మన్‌గా ఎంపికతో, కమిషన్‌లో ఓ సభ్యుడి స్థానం ఖాళీ అయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:యూపీఎస్సీ నూతన కొత్త చైర్మన్ గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 8
ఎవరు: విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషి
కాగ్‌గా గిరీశ్ చంద్ర ముర్మూ ప్రమాణం
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ, కాగ్)గా గిరీశ్ చంద్ర ముర్మూ పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్ లో ఆగస్టు 8న జరిగిన కార్యక్రమంలో జి.సి.ముర్మూతోకాగ్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 1985 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ముర్మూ 2024 నవంబరు 20వ తేదీ వరకూ కాగ్ పదవిలో కొనసాగనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్లను ఆడిట్ చేసే బృహత్తర బాధ్యత సీఏజీదన్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఇటీవలే ముర్మూ రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ, కాగ్)గా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు: ఆగస్టు 8
ఎవరు: గిరీశ్ చంద్ర ముర్మూ
ఎక్కడ:రాష్ట్రపతి భవన్, ఢిల్లీ
భారత ప్రధానిగా మోదీనే అత్యుత్తమం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేని ప్రజాదరణ ఉందని మరోసారి తేలింది. ప్రధానిగా మోదీనే అత్యుత్తమం అని ‘ఇండియా టుడే – కార్వీ ఇన్ సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తాజాగా తేల్చింది. ప్రధానిగా మోదీ పనితీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో 30 శాతం మంది, బావుందని 48 శాతం, సాధారణంగా ఉందని 17 శాతం అభిప్రాయపడ్డారు. 5 శాతం మంది మాత్రం మోదీ పనితీరు బాగాలేదన్నారు. ఫిబ్రవరి 2016 – ఆగస్టు 2020 మధ్య నిర్వహించిన 10 సర్వేలను పోలిస్తే.. మోదీకి ప్రజాదరణ గణనీయంగా పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది.
సర్వేలోని ముఖ్యాంశాలు
అత్యుత్తమ భారత ప్రధాని ఎవరన్న ప్రశ్నకు.. 44 శాతం మోదీకి, 14 శాతం వాజ్‌పేయికి, 12 శాతం ఇందిరా గాంధీకి, 7 శాతం నెహ్రూకి, 7 శాతం మంది మన్మోహన్ కు ఓటేశారు. తదుపరి ప్రధానిగా 66 శాతం మోదీనే ఎన్నుకున్నారు. 8 శాతం రాహుల్‌కి, 5 శాతం సోనియాకి, 4 శాతం అమిత్‌షాకుఓటేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:భారత ప్రధానిగా మోదీనే అత్యుత్తమం
ఎప్పుడు: ఆగస్టు 8
ఎవరు: ఇండియా టుడే – కార్వీ ఇన్ సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్సర్వే
లెబనాన్ ప్రధాని హసన్ రాజీనామా
లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ ఆగస్టు 10న తన పదవికి రాజీనామా చేశారు.దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలని ప్రధాని హసన్ నిర్ణయించుకున్నారు. ‘ఇక్కడ ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని తేలింది. ఇకపై ప్రజలతో కలిసి మార్పుకోసం పోరాడుతానన్నారు. ఈ రోజు నా ప్రభుత్వం రాజీనామా చేస్తోంది. లెబనాన్ ను దేవుడే రక్షించు గాక’ అని హసన్ వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:లెబనాన్ ప్రధాని రాజీనామా
ఎప్పుడు: ఆగస్టు 10
ఎవరు:హసన్ దియాబ్
ఎందుకు: ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలువెల్లువెత్తడంతో
దేశంలోనే అత్యుత్తమ సీఎంగా యోగి ఆదిత్యనాథ్
దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో నిలిచారు. యోగి తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానం, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 2020 జూలైలో చేసిన ఈ సర్వేలో యోగి ఆదిత్యనాథ్‌కు 24 శాతం, కేజ్రీవాల్‌కు 15 శాతం, వైఎస్ జగన్‌కు 11 శాతం ఓట్లు వచ్చాయి. 4, 5 స్థానాల్లో పశ్చిమబెంగాల్, బీహార్ సీఎంలు మమతా బెనర్జీ, నితీష్‌కుమార్ ఉండగా... తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్‌రావు మూడు శాతం ఓట్లతో 9వ స్థానంలో నిలిచారు.
సొంత రాష్ట్రంలో వైఎస్ జగన్...
సొంత రాష్ట్రంలో 87 శాతం ప్రజల మద్దతుతో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రిగా నంబర్ వన్ స్థానంలో వైఎస్ జగన్ నిలిచారు. ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 63 శాతం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 59 శాతం ప్రజల మద్దతు లభించింది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు 55 శాతం ప్రజల ఆదరణ లభించగా.. యోగి ఆదిత్యనాథ్‌కు ఉత్తరప్రదేశ్‌లో 49 శాతం ప్రజాదరణ దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఎప్పుడు: ఆగస్టు 8
ఎవరు: ఇండియా టుడే- మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే
ఎక్కడ:దేశంలో
ప్రముఖ ఉర్దూ కవి రహత్ కన్నుమూత
ప్రఖ్యాత ఉర్దూకవి రహత్ ఇండోరి (70) ఆగస్టు 11న గుండెపోటుతో మరణించారు. ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇండోరి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఉర్దూ సాహిత్యంపై పట్టున్న ఇండోరికి దేశ విదేశాల్లో చాలామంది అభిమానులున్నారు. ముఖ్యంగా ఉర్దూలో ద్విపదలను తనదైన శైలిలో రచించారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, కరీబ్, ఘటక్ లాంటి పలు హిట్ చిత్రాల్లో మేలిమి పాటలను ఆయన రచించారు. ఇండోరి రచించిన ‘‘బులాతా హై, మగర్ జానే కా నహీ’’, ‘‘సభీకా కానూన్హై షామిల్ యహాకీ మిట్టీ మే’’తదితర కవితలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ప్రఖ్యాత ఉర్దూకవి కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: రహత్ ఇండోరి (70)
ఎక్కడ: ఇండోర్, మధ్యప్రదేశ్
ఎందుకు: గుండెపోటు కారణంగా
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రాజేంద్రనాథ్‌రెడ్డి
ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు పోలీసు అధికారులను బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగాధికారిగా ఉన్న రాజేంద్రనాథరెడ్డిని నిఘా విభాగానికి బదిలీ చేశారు. విజిలెన్స్ విభాగానికి కూడా ఆయనే ఇన్చార్జ్‌గా ఉంటారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా ఉన్న రాజీవ్ కుమార్ మీనాను మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మనీష్ కుమార్ సిన్హాను విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
10 రాష్ట్రాల్లో కట్టడి అవసరం: మోదీ
కలసికట్టుగా కరోనాపై పోరాటం చేద్దామని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు పిలుపు నిచ్చారు. కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఆగస్టు 11న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో సమీక్షిం చారు. మొత్తం కేసుల్లో 80 శాతంపైగా నమోదవుతున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కరోనాని కట్టడి చేస్తే, భారత్ ఈ మహమ్మా రిపై విజయం సాధిస్తుందని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 11
ఎవరు: కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి
నిస్సా డైరెక్టర్‌గా సీవీ ఆనంద్ నియామకం
తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు చెందిన, ప్రస్తుతం కేంద్ర డిప్యుటేషన్ లో ఉన్న 1991 ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ హైదరాబాద్‌లోని హకీంపేటలో ఉన్న నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ అకాడమీ (నిస్సా) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈమేరకు సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ రాజేశ్ రంజన్ ఆగస్టు 10న ఉత్తర్వులు జారీచేశారు. కొంతకాలంగా సీఐఎస్‌ఎఫ్‌లో డిప్యుటేషన్ పై పని చేస్తున్న ఆనంద్.. ఆ విభాగానికి అంతర్భాగంగా ఉన్న ఎయిర్‌పోర్ట్ సెక్టార్ (సౌత్ వెస్ట్) విభాగానికి ఐజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజా ఉత్తర్వుల మేరకు ఆనంద్.. నిస్సాతో పాటు సీఐఎస్‌ఎఫ్ ఎయిర్‌పోర్ట్ సెక్టార్ ఐజీ బాధ్యతల్ని కూడా అదనంగా నిర్వహించనున్నారు. ఆనంద్ గతంలో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, నగర ట్రాఫిక్ చీఫ్‌గా, ఉమ్మడి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:నేషనల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ అకాడమీ (నిస్సా) డైరెక్టర్‌గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 10
ఎవరు: సీవీ ఆనంద్
అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో హ్యారిస్
అమెరికాలో భారత సంతతికి చెందిన కమలాదేవి హ్యారిస్‌కు అరుదైన గౌరవం లభించింది. ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ల అభ్యర్థిగా కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ ఆగస్టు 12న ప్రకటించారు. ఒక నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా తొలిసారి ఎంపిక చేయడం ఇదే మొదటిసారి. 2020, నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 55 ఏళ్ల కమలా హ్యారిస్ ఎన్నికల్లో నెగ్గితే అమెరికా ఉపాధ్యక్ష పదవికి మొట్టమొదటి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా, మొదటి ఆసియా అమెరికన్ గా రికార్డులకెక్కుతారు. భారతీయ– జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం బైడెన్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. కమలా హ్యారిస్ తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్(చెన్నై) భారతీయురాలు. భారతీయురాలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ల అభ్యర్థిగా
ఎప్పుడు: ఆగస్టు 12
ఎవరు: కమలాదేవి హ్యారిస్
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జూలై 30న ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు తీర్పు మేరకు ఆయనను తిరిగి ఆ పదవిలో నియమిస్తున్నట్లు తొలుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ను జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవు పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) తుది తీర్పుకు లోబడి ఈ నియామకం కొనసాగుతుందని గవర్నర్ ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియామకం
ఎప్పుడు : జూలై 30
ఎవరు : నిమ్మగడ్డ రమేష్‌కుమార్
ఏపీ శాండ్ కార్పొరేషన్ ఎండీగా హరినారాయణ్
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న హరినారాయణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ శాండ్ కార్పొరేషన్మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. శాండ్ కార్పొరేషన్ఎండీగా తక్షణమే బాధ్యతలు చేపట్టాలని, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని హరినారాయణ్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాన్స్ కో జేఎండీగా కె.శ్రీధర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కె.శ్రీధర్‌రెడ్డిని బదిలీ చేస్తూ, ఏపీ ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. డిప్యూటేషన్విధానంలో శ్రీధర్‌రెడ్డిని ట్రాన్స్ కో జేఎండీగా నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ శాండ్ కార్పొరేషన్ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు
ఎప్పుడు: జూలై 30
ఎవరు : ఏపీఎండీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హరినారాయణ్
మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు(60) అనారోగ్యంతో కన్నుమూశారు. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 1న తుదిశ్వాస విడిచారు. కోవిడ్–19 వైరస్‌తోపాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహం ఆయన ఆరోగ్యాన్ని కుంగదీశాయి. మాణిక్యాలరావు స్వయం సేవక్‌గా రాష్ట్రీయ స్వయం సేవక్‌లో చురుగ్గా పనిచేస్తూ 1989లో భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కేబినెట్‌లో ఆయన దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 1
ఎవరు: పైడికొండల మాణిక్యాలరావు(60)
ఎక్కడ: విజయవాడ
ఎందుకు: కరోనా వైరస్ కారణంగా
రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ కన్నుమూత
రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) మాజీ నేత అమర్‌సింగ్(64) కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి ఆగస్టు 1న తుదిశ్వాస విడిచారు. 1956 జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్ సింగ్ యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్‌పీలో కీలక నేతగా కొనసాగారు. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. 2016లో ఎస్‌పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన అమర్ సింగ్ 2016లో తిరిగి ఎస్‌పీ చేరి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఎస్‌పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్ యాదవ్ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్‌ఎస్‌ఎస్‌కు విరాళంగా అందజేస్తానని అమర్ సింగ్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) మాజీ నేత కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 1
ఎవరు: అమర్‌సింగ్(64)
ఎక్కడ: సింగపూర్
ఎందుకు: అనారోగ్యం కారణంగా
హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభకు బోథమ్ ఎన్నిక
ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభలో సభ్యునిగా 64 ఏళ్ల బోథమ్ ఎన్నికయ్యాడు. తాజాగా 36 మందిని ప్రభుత్వం ఈ సభకు ఎంపిక చేయగా అందులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బోథమ్‌కు కూడా చోటు దక్కింది. 2011లో ఇంగ్లండ్ మహిళల కెప్టెన్ రాచెల్ ఫ్లింట్ తర్వాత ఈ గౌరవం పొందిన తొలి క్రికెటర్ బోథమ్ కావడం విశేషం. ఇంగ్లండ్ తరఫున 1977–1992 మధ్య కాలంలో 102 టెస్టులు ఆడిన బోథమ్...1981లో ఆసీస్‌ను ఓడించి యాషెస్ సిరీస్ దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.
భారత్-చైనా మధ్య ఐదో దఫా చర్చలు
వాస్తవాదీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా భూభాగం వైపు భారత్–చైనా సీనియర్ సైనిక కమాండర్ల మధ్య ఆగస్టు 2న 11 గంటలపాటు సుదీర్ఘంగా ఐదో దఫా చర్చలు జరిగాయి. చర్చల్లో భారత్ తరపు బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించారు. తూర్పు లద్ధాఖ్‌లోని పాన్ గాంగ్ త్సో నుంచి సాధ్యమైనంత త్వరగా చైనా సైనికులు వెనక్కి తగ్గితేనే సరిహద్దుల్లో శాంతి సాధ్యమని భారత అధికారులు స్పష్టం చేశారు. మే 5వ తేదీ ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరో రెండు వివాదాస్పద ప్రాంతాల్లో తిష్టవేసిన చైనా బలగాలు సైతం వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: . బ్రిటిష్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ సభలో సభ్యునిగా ఎన్నిక
ఎప్పుడు: ఆగస్టు 1
ఎవరు: ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం ఇయాన్ బోథమ్
కరోనాతో యూపీ మంత్రి కమల్‌రాణి మృతి
యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణి (62)ని కరోనా పొట్టన పెట్టుకుంది. ఆమె ఆగస్టు 2న లక్నోలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. రాష్ట్రంలో కరోనా వల్ల ఒక మం త్రి మరణించడం ఇదే తొలిసారి. యూపీ కేబినెట్‌లో ఆమె ఏకైక మహిళ. కమల్‌రాణికి జూలై 18న పరీక్షలు చేయ గా, కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా
కరోనా మహమ్మారి బారిన పడిన ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, కర్ణాటక సీఎం యెడియూరప్ప తాజాగా కరోనా బారినపడ్డారు. తనలో కరోనా వైరస్ ప్రా«థమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(55) ఆగస్టు 2న ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: కమల్‌రాణి (62)
ఎక్కడ: లక్నో, ఉత్తరప్రదేశ్
ఎందుకు: కరోనా వైరస్ కారణంగా
ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం
ఏపీసీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసింది. చైర్‌పర్సన్ గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమించనుంది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇప్పటి వరకు ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహంను ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమిస్తూ శ్యామలరావు మరో జీవో జారీ చేశారు.
ఏఎంఆర్‌డీఏలో సభ్యులు..
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి – డిప్యూటీ చైర్‌పర్సన్
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి – సభ్యుడు
ఏఎంఆర్‌డీఏ కమిషనర్ –సభ్య కన్వీనర్
గుంటూరు జిల్లా కలెక్టర్ –సభ్యుడు
కృష్ణా జిల్లా కలెక్టర్ – సభ్యుడు
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ –సభ్యుడు
రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ –సభ్యుడు
ఏపీ ట్రాన్స్ కో ఎస్‌ఈ –సభ్యుడు
ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ –సభ్యుడు
రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (గుంటూరు) –సభ్యుడు
రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (విజయవాడ) –సభ్యుడు
క్విక్ రివ్యూ:
ఏమిటి: అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ) కమిషనర్ గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 2
ఎవరు: పి.లక్ష్మీనరసింహం
ఎస్‌బీఐ కార్డ్ సీఈఓగా అశ్వనీ తివారీ
దేశంలో రెండవ అతిపెద్ద క్రెడిట్ కార్డ్ ఇష్యూయర్ ఎస్‌బీఐ కార్డ్ ఎండీ అండ్ సీఈఓగా అశ్వనీ తివారీ బాధ్యతలు స్వీకరించారు. 2020, జూలై 31వ తేదీన బాధ్యతలు విరమించిన హర్‌దయాల్ ప్రసాద్ స్థానంలో తివారీ ఆగస్టు 4న కొత్త బాధ్యతలను చేపట్టారు. ఈ కొత్త బాధ్యతలకు ముందు ఆయన 2017 ఏప్రిల్ నుంచీ న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎస్‌బీఐ యూఎస్ ఆపరేషన్స్ హెడ్‌గా పనిచేశారు. ఎస్‌బీఐ (కాలిఫోర్నియా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వైస్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు.
అమెరికన్లకే ఉద్యోగాలు...
అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశిస్తూ ఆగస్టు 4న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. విదేశీయులు, ముఖ్యంగా హెచ్1బీ వీసాదారులకు ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు కల్పించకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎస్‌బీఐ కార్డ్ ఎండీ అండ్ సీఈఓగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు: ఆగస్టు 4
ఎవరు: అశ్వనీ తివారీ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త చీఫ్ శశిధర్ జగ్‌దీశన్
ప్రైవేటు రంగంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం–హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఈఓ అండ్ ఎండీ)గా శశిధర్ జగ్‌దీశన్ నియమితులయ్యారు. ఆదిత్యపురి స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త చీఫ్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదముద్ర పడినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆగస్టు 4న తెలిపింది. 2020, అక్టోబర్ 27 నుంచి మూడేళ్లపాటు జగ్‌దీశన్ ఈ బాధ్యతల్లో ఉంటారు.
25 సంవత్సరాలుగా...
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో గత 25 సంవత్సరాలుగా జగ్‌దీశన్ వివిధ కీలక బాధ్యతలను నిర్వహించారు. జర్మన్ బ్యాంక్ డాయిష్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1996లో జగ్‌దీశన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫైనాన్స్ శాఖలో మేనేజర్‌గా చేరారు. 1999లో ఫైనాన్స్ విభాగం బిజినెస్ హెడ్ అయ్యారు. 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. తరువాత బ్యాంక్ అన్ని విభాగాల అత్యుత్తమ నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి ‘చేంజ్ ఏజెంట్’గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ బాధ్యతలతోపాటు ఫైనాన్స్, మానవ వనరులు, న్యాయ, సెక్రటేరియల్, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ సామాజిక బాధ్యతల వంటి కీలక విభాగాలు ఆయన కనుసన్నల్లో ఉన్నాయి. ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న కొద్ది మందిలో 55 సంవత్సరాల జగ్‌దీశన్ ఒకరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఈఓ అండ్ ఎండీ)గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 4
ఎవరు: శశిధర్ జగ్‌దీశన్
ప్రజా గాయకుడు వంగపండు కన్నుమూత
ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) ఇకలేరు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్‌లో ఆగస్టు 4న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా వంగపండు అంత్యక్రియలను పూర్తి చేశారు. పదునైన పదాలకు సొంపైన బాణీలతో స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు. విజయనగరం జిల్లా, పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చినతల్లి దంపతులకు 1943 జూన్ లో వంగపండు జన్మించారు. తన రచనలతో, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు. 1972లో నాటి పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి 400కి పైగా జానపద గీతాలనురచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 4
ఎవరు: వంగపండు ప్రసాదరావు(77)
ఎక్కడ: పార్వతీపురం, విజయనగరం జిల్లా
ఎందుకు: గుండెపోటు కారణంగా
మాలి రాజధాని: బమాకో
కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
క్విక్ రివ్యూ:
ఏమిటి: మాలీ అధ్యక్ష పదవికి రాజీనామా
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఇబ్రహీం బౌబకర్
ఎందుకు:సైనిక తిరుగుబాటు కారణంగా
ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియామకం
కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన నియామకానికి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆగస్టు 21న ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) వైస్ చైర్మన్ గా నియమితులైన అశోక్ లావాసా ఆగస్టు 31 తేదీన ఎన్నికల కమిషనర్‌గా విధుల నుంచి తప్పుకోనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్‌కుమార్ అదే రోజు ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సునీల్ అరోరా ప్రధాన ఎన్నికల కమిషనర్ కాగా, సుశీల్ చంద్ర ఎన్నికల కమిషన్ లో మరో సభ్యుడు. ఆగష్టు 31న రాజీవ్ కుమార్ వీరితో చేరుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నూతన ఎన్నికల కమిషనర్‌గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 21
ఎవరు: కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్
మహాత్మాగాంధీ కళ్లద్దాలకు రూ. 2.55 కోట్లు
మహాత్మాగాంధీ ధరించాడని భావిస్తున్న బంగారుపూత పూసిన కళ్లద్దాలు బ్రిటన్‌లో రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ కళ్లజోడు 2,60,000 పౌండ్ల (రూపాయలు 2.55 కోట్లు)కు అమ్ముడైంది. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ పెట్రోలియంకు పనిచేస్తున్న సమయంలో, 1910– 1930 మధ్యకాలంలో బ్రిటన్ దేశస్తుడికి ఇవి బహుమతిగా వచ్చాయి. తర్వాత ఆయన తన బంధువులకు వీటిని అందజేశారు.
బ్రిటన్ లోని సౌత్ గ్లూసెస్టర్‌షైర్‌లో నివసించే వ్యక్తి 50 ఏళ్లుగా తమ ఇంట్లో ఉన్న ఈ కళ్లజోడును వేలం వేయాల్సిందిగా కోరారు. 10 నుంచి 15 వేల పౌండ్లు పలుకుతాయని భావించారు. అయితే ఏకంగా రెండు లక్షల అరవై వేల పౌండ్లకు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నాడు. భారత్, ఖతార్, అమెరికా, రష్యా, కెనడాల నుంచి పలువురు వేలం పాటలో పాల్గొన్నారు.
డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్ జి.సతీశ్ రెడ్డి పదవీకాలాన్ని కేంద్రప్రభుత్వం రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆగస్టు 24న ఆదేశాలు జారీ చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన సతీశ్‌రెడ్డి2018 ఆగస్టులో రెండేళ్ల కాలానికి డీఆర్‌డీవో చైర్మన్ గా నియమితులయ్యారు. ఆగస్టు 26వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుండగా కేంద్రం ఆయనను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డీఓడీఆర్‌డీ) కార్యదర్శిగా కూడా సతీశ్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు: ఆగస్టు 24
ఎవరు: కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ
సాహిత్య అవార్డు గ్రహీత సదానంద కన్నుమూత
చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కలువకొలను సదానంద (81) ఆగస్టు 25న కన్నుమూశారు. 1939 ఫిబ్రవరి 22న పాకాలలో జన్మించిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. సదానంద అనేక బాలల కథలు, గేయాలు, కవితలు, నవలలు కథానికలు, నాటికలు రచించారు. గ్రామీణ జీవితంతో పాటు పట్టణ జీవితాన్ని కూడా తన కథల్లో చూపించారు. రచయితగానే కాక, చిత్రకారుడుగా, కార్టూనిస్టుగా కూడా తెలుగు ప్రజలకు ఆయన చిరపరిచితులు. ప్రైమరీ టీచర్‌గా 36 ఏళ్లు పనిచేసి 1997లో రిటైరయ్యారు.
సాహిత్య అవార్డు కైవసం...
- కథ, నవల, కవిత్వం, ముఖ్యంగా గేయాలు వంటి వివిధ ప్రక్రియల్లో సదానంద రచనలు చేశారు.
- రక్తయజ్ఞం, పైరుగాలి, నవ్వే పెదవులు ఏడ్చేకళ్లు వంటివి వీరి కథా సంపుటాలు. గాడిద బ్రతుకులు, గందరగోళం, బంగారు మామ వంటి నవలలు రాశారు.
- ఈయన ‘నవ్వే పెదవులు–ఏడ్చే కళ్లు కథా సంపుటికి 1976లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
- 1990లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్నిన్ని, 1992లో కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ బహుమతిని అందుకున్నారు.
- ‘బంగారు నడిచిన బాట’ నవలకు ఉత్తమ బాలసాహిత్య అవార్డును కేంద్రం నుంచి అందుకున్నారు.
- ‘అడవి తల్లి’ నవలకు 2010లో కేంద్ర సాహిత్య అవార్డును కైవశం చేసుకున్నారు.
- ఆయన రాసిన ‘బంగారు మామ’ నవల, ‘బంగారు బావ’ చలన చిత్రంగా నిర్మితమయ్యాయి. ఈయన కలం నుంచి పది పిల్లల నవలలు, ఏడు సాంఘిక నవలలు, ఒక కవితా సంపుటి, ఏడు కథా సంపుటాలు వెలువడ్డాయి.
ఏమిటి: ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతకన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 25
ఎవరు: కలువకొలను సదానంద (81)
ఎక్కడ : పాకాల, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఇన్‌స్ట్రాగామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలెబ్రిటీ
ఇన్‌స్ట్రాగామ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని అనుసరిస్తున్న వారి సంఖ్య 7 కోట్ల 50 లక్షలు దాటింది. దాంతో ఇన్‌స్ట్రాగామ్‌లో ఏడున్నర కోట్లు ఫాలోవర్లు కలిగిన తొలి ఆసియా సెలెబ్రిటీగా కోహ్లి గుర్తింపు పొందాడు. కోహ్లి తర్వాత ఆసియా నుంచి అత్యధిక ఫాలోవర్లు కలిగిన వారి జాబితాలో రెండో స్థానంలో ప్రియాంక చోప్రా (5 కోట్ల 60 లక్షలు), మూడో స్థానంలో దీపిక పదుకొనె (5 కోట్ల 20 లక్షలు) ఉన్నారు.
క్రిస్టియానో రొనాల్డో...
ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్ట్రాగామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల జాబితాలో కోహ్లి (7,57,89,920) నాలుగో స్థానంలో ఉన్నాడు. తొలి మూడు స్థానాల్లో ఫుట్‌బాల్ స్టార్స్ క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–23 కోట్లు), లయెనెల్ మెస్సీ (అర్జెంటీనా–16 కోట్లు), నెమార్ (బ్రెజిల్–14 కోట్లు) ఉన్నారు. ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌లో కోహ్లిని 4 కోట్ల 32 లక్షలు మంది... ట్విట్టర్‌లో 3 కోట్ల 74 లక్షల మంది అనుసరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్‌స్ట్రాగామ్‌లో ఏడున్నర కోట్లు ఫాలోవర్లు కలిగిన తొలి ఆసియా సెలెబ్రిటీ
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి
రామ జన్మభూమి ట్రస్ట్ అధిపతికి కరోనా
క్విక్ రివ్యూ:
ఏమిటి: కరోనా బారిన పడ్డ రామ జన్మభూమి ట్రస్ట్ అధిపతి
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు:మహంత్ నృత్య గోపాల్ దాస్
గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఈవోగా రమణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా ఎస్.రమణారెడ్డికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఆగస్టు 14న జీవో విడుదల చేసింది. ఇప్పటివరకు ఈయన సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల విభాగం (నెడ్‌కాప్) ఎండీగా ఉన్నారు. అలాగే, సోలార్ పవర్ కార్పొరేషన్ డిప్యూటీ సీసీఏగా పనిచేస్తున్న వీవీ హనుమంతరావుకు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది.
బ్రిటన్ కలిసి వైద్య ఉపకరణాల తయారీ
కరోనా మహమ్మారిపై పోరుకు అవసరమైన వెంటిలేటర్లు, ఇతర అత్యవసర వైద్య పరికరాల ఉత్పత్తి దిశగా ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసింది. విశాఖపట్నం జిల్లాలోని మెడ్‌టెక్ జోన్ లో 5.6 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన అత్యవసర వైద్య ఉపకరణాల తయారీకి బ్రిటీష్ ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ చేపట్టింది. ఇందుకు సంబంధించి ఏపీ, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయ ఆగస్టు 14న ప్రకటన విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీజీఈసీఎల్ కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా అదనపు బాధ్యతలు
ఎప్పుడు: ఆగస్టు 14
ఎవరు: ఎస్.రమణారెడ్డి
భారత మాజీ క్రికెటర్ చేతన్ కన్నుమూత
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్న చేతన్ చౌహాన్(73) కరోనా వైరస్‌తో గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆగస్టు 16న కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన చేతన్ 1969 నుంచి 1981 మధ్య కాలంలో భారత టెస్టు, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 40 టెస్టులు ఆడిన ఆయన 16 అర్ధ సెంచరీల సహాయంతో 2,084 పరుగులు చేశారు. ఏడు వన్డేల్లో బరిలోకి దిగి 153 పరుగులు సాధించారు.
గావస్కర్‌కు జతగా...
దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్‌కు జతగా 1973 నుంచి 1981 మధ్యకాలంలో చేతన్ ఓపెనర్‌గా వచ్చారు. వీరిద్దరు 59 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌కు దిగి 3,010 పరుగులు జోడించారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక రాజకీయాల్లోకి ప్రవేశించిన చేతన్ రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతేడాది వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం సైనిక సంక్షేమం, హోంగార్డు, సివిల్ సెక్యూరిటీ శాఖా మంత్రిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: భారత మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 16
ఎవరు: చేతన్ చౌహాన్(73)
ఎక్కడ:గుర్‌గ్రామ్, హరియాణ
ఎందుకు: కరోనా వైరస్ కారణంగా
కేంద్ర హోంశాఖ సెక్రటరీగా వి.ఎస్.కె.కౌముది
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఏపీ కేడర్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వి.ఎస్.కె.కౌముది కేంద్ర హోంశాఖ స్పెషల్ సెక్రటరీ (అంతర్గత భద్రత)గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలను కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. పదవీ విరమణ (నవంబర్ 30, 2022) వరకు కౌముది ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు యూపీ క్యాడర్‌కు చెందిన మహ్మద్ జావేద్ అక్తర్ ఫైర్ సర్వీసులు, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలు
ఢిల్లీ ఐఐటీ వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆగస్టు 17న ఆన్లైన్ వేదిక ద్వారా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. సామాజిక సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారమార్గాలను కనుగొనడం ఐఐటీ, ఇతర ఉన్నత విద్యాసంస్థల ముందున్న తక్షణకర్తవ్యమని ఈ సందర్భంగ వెంకయ్య పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కేంద్ర హోంశాఖ స్పెషల్ సెక్రటరీ (అంతర్గత భద్రత)గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: వి.ఎస్.కె.కౌముది
బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా రాకేశ్ ఆస్తానా
సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా గుజరాత్ కేడర్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్తానా నియమితులయ్యారు. ఆస్తానా ప్రస్తుతం ఢిల్లీలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్) సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. 2021 జులై 31 వరకూ బీఎస్‌ఎఫ్ డీజీగా ఆస్తానా వ్యవహరిస్తారని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 17న తెలిపింది. 2002 గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ దగ్ధం వంటి హైప్రొఫైల్ కేసులను ఆస్తానా విచారించారు. 1997లో సీబీఐ ఎస్పీగా ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో పశుగ్రాస స్కాంలోఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన అరెస్ట్ చేశారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా రాకేష్ ఆస్ధానా పనిచేస్తున్న సమయంలో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. ఓ మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి వీరి పరస్పర ఆరోపణలు కలకలం రేపాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బీఎస్‌ఎఫ్ బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: రాకేశ్ ఆస్తానా
సంగీత విద్వాంసుడు పండిట్ జస్‌రాజ్ అస్తమయం
భారత సంగీత దిగ్గజాల్లో ఒకరైన ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు, పద్మవిభూషణ్ పండిట్ జస్ రాజ్ (90) ఇకలేరు. అమెరికా న్యూజెర్సీలోని ఆయన నివాసంలో ఆగస్టు 17న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పండిట్ జస్‌రాజ్ 1930 జనవరి 28న హర్యానాలోని హిసార్ జిల్లా పిలిమండోరిలో ఒక సంగీత కుటుంబంలో పుట్టారు. మేవతి ఘరానా శైలి గాయకుడైన జస్‌రాజ్ భిన్న రాగాలకు ప్రాణప్రతిష్ట చేస్తూ ఎనిమిది దశాబ్దాలపాటు శ్రోతలను మైమరపించారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడైన జస్‌రాజ్ ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ (1975), పద్మభూషణ్ (1990), పద్మవిభూషణ్ (2000) అవార్డులతో సత్కరించింది. సంగీత నాటక అకాడమీ అవార్డు (1987), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2010) సహా ఆయనకు అనేక పురస్కారాలు, బిరుదులు, సత్కారాలు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రముఖ సంగీత విద్వాంసుడు, గాయకుడు,కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 17
ఎవరు: పండిట్ జస్ రాజ్ (90)
ఎక్కడ: న్యూజెర్సీ, అమెరికా
ఎందుకు: గుండెపోటు కారణంగా
మేఘాలయ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్
గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ ఆగస్టు 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర గవర్నరు భగత్ సింగ్ కోశ్యారికి గోవా బాధ్యతలను అదనంగా అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గోవా గవర్నర్‌గా కూడా కోష్యారీ అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్రపతి భవన్ ఆదేశించింది. మేఘాలయ గవర్నర్‌గా ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న తథాగతరాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్ ను రాష్ట్రపతి బదిలీ చేశారు. గతంలో జమ్ముకశ్మీర్, బిహార్ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్ పని చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: మేఘాలయ గవర్నర్‌గా బదిలీ
ఎప్పుడు: ఆగస్టు 18
ఎవరు: గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్
ఎన్నికల కమిషనర్ లావాసా రాజీనామా
ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు అశోక్ లావాసా ఆగస్టు 18న రాజీనామా చేశారు. లావాసాత్వరలోనే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఉపాధ్యక్షునిగా చేరనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతికోవింద్ కి రాజీనామా లేఖను పంపించారు.ఆగస్టు 31న తనని బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ఆ లేఖలో కోరారు.ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోన్న ఏడీబీలో 2020, సెప్టెంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఈసీ సునీల్ అరోరా 2021, ఏప్రిల్‌లో రిటైర్ అవనున్నారు. ఆయన తరువాత, ఎన్నికల కమిషన్ లో సీనియర్ సభ్యుడు లావాసాయే. పదవీకాలం ముగియక ముందే, ఎన్నికల కమిషనర్‌గా తప్పుకున్న రెండో వ్యక్తిగా లావాసా నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు రాజీనామా
ఎప్పుడు: ఆగస్టు 18
ఎవరు: అశోక్ లావాసా
ఎందుకు :లావాసాత్వరలోనే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఉపాధ్యక్షునిగా చేరనున్నందున
మాలీ అధ్యక్షుడు ఇబ్రహీం రాజీనామా
ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు జరిగింది. సైన్య నిర్బంధంతో ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో చాలా నెలలుగా ఇబ్రహీం దిగిపోవాలని కోరుతూ అందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఆగస్టు 18న సైన్యం తిరుగుబాటు చేసి ఇబ్రహీంను ఇంట్లో నిర్బందించింది. దీంతో ఆయనతోపాటు ప్రధాని బౌబు సిస్సే సైతం రాజీనామా చేశారు. దేశంలో ప్రస్తుతం ఐరాస నేతృత్వంలో 15,600 మంది సైనికులు శాంతిపరిరక్షక విధులు నిర్వహిస్తున్నారు. మాలిలో పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి సమావేశమైంది.
మాలి రాజధాని: బమాకో
కరెన్సీ: పశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
క్విక్ రివ్యూ:
ఏమిటి: మాలీ అధ్యక్ష పదవికి రాజీనామా
ఎప్పుడు: ఆగస్టు 19
ఎవరు: ఇబ్రహీం బౌబకర్
ఎందుకు:సైనిక తిరుగుబాటు కారణంగా
సెబీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు
క్విక్ రివ్యూ:
ఏమిటి:సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పదవీ కాలం పొడిగింపు
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
జమ్మూకశ్మీర్ ఎల్‌జీగా మనోజ్ సిన్హా
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత మనోజ్ సిన్హా (61)ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.వికాస్ పురుష్ గా పేరున్న మనోజ్ సిన్హా మూడుసార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు.ఇప్పటివరకూ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన గిరీశ్ చంద్ర ముర్ము రాజీనామా చేయగా, ఆయన్ను నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2019 అక్టోబర్ 31న జమ్మూకశ్మీర్ ఎల్జీగా జీసీ ముర్ము బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: మనోజ్ సిన్హా
తెలంగాణ అంచనాల కమిటీ చైర్మన్ కన్నుమూత
తెలంగాణ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి (57) కన్నుమూశారు. లిపై కురుపుతో బాధపడుతున్న ఆయన 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆగస్టు 5న గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలతో పెరిగిన రామలింగారెడ్డి 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
పేరు: సోలిపేట రామలింగారెడ్డి
తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి
పుట్టిన ఊరు: చిట్టాపూర్ దుబ్బాక
మండలం, సిద్దిపేట జిల్లా
పుట్టిన తేదీ: 1962, అక్టోబర్ 2
భార్య: సుజాత
సంతానం: సతీష్ రెడ్డి, ఉదయశ్రీ
జర్నలిస్టుగా: రెండు దశాబ్దాలపాటు వివిధ పత్రికల్లో పనిచేశారు
ఎమ్మెల్యేగా విజయం: 2004, 2008, 2014, 2018 (దొమ్మాట/దుబ్బాక)
మొదటి టాడా కేసు: జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు రాసిన ఆయనపై 1989లో రాష్ట్రంలోనే మొదటి టాడా కేసు నమోదైంది. పోలీసులు ఆయనను జైలులో పెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:తెలంగాణ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసనసభ్యుడు కన్నుమూత
ఎప్పుడు: ఆగస్టు 5
ఎవరు: సోలిపేట రామలింగారెడ్డి (57)
ఎక్కడ: హైదరాబాద్
ఎందుకు: గుండెపోటు కారణంగా
యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రదీప్ కుమార్ జోషి
యూపీఎస్సీ నూతన కొత్త చైర్మన్ గా విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషి ఆగస్టు 7న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటి వరకూ పదవీ బాధ్యతలు నిర్వహించిన అరవింద్ సక్సేనా ప్రదీప్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కమిషన్‌లో సభ్యుడిగా చేరక ముందు ఆయన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు చైర్మన్‌గా పనిచేశారు. 2015 మే 12న ఆయన కమిషన్‌లో చేరారు. ఆర్థిక నిర్వహణ విభాగంలో నిపుణత కలిగిన జోషి 2021 మే 12వరకూ చైర్మన్‌గా ఉంటారు. జోషి చైర్మన్‌గా ఎంపికతో, కమిషన్‌లో ఓ సభ్యుడి స్థానం ఖాళీ అయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి:యూపీఎస్సీ నూతన కొత్త చైర్మన్ గా నియామకం
ఎప్పుడు: ఆగస్టు 8
ఎవరు: విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషి
కాగ్‌గా గిరీశ్ చంద్ర ముర్మూ ప్రమాణం
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ, కాగ్)గా గిరీశ్ చంద్ర ముర్మూ పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్ లో ఆగస్టు 8న జరిగిన కార్యక్రమంలో జి.సి.ముర్మూతోకాగ్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 1985 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ముర్మూ 2024 నవంబరు 20వ తేదీ వరకూ కాగ్ పదవిలో కొనసాగనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్లను ఆడిట్ చేసే బృహత్తర బాధ్యత సీఏజీదన్న విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఇటీవలే ముర్మూ రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి:కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ, కాగ్)గా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు: ఆగస్టు 8
ఎవరు: గిరీశ్ చంద్ర ముర్మూ
ఎక్కడ:రాష్ట్రపతి భవన్, ఢిల్లీ
భారత ప్రధానిగా మోదీనే అత్యుత్తమం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేని ప్రజాదరణ ఉందని మరోసారి తేలింది. ప్రధానిగా మోదీనే అత్యుత్తమం అని ‘ఇండియా టుడే – కార్వీ ఇన్ సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తాజాగా తేల్చింది. ప్రధానిగా మోదీ పనితీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో 30 శాతం మంది, బావుందని 48 శాతం, సాధారణంగా ఉందని 17 శాతం అభిప్రాయపడ్డారు. 5 శాతం మంది మాత్రం మోదీ పనితీరు బాగాలేదన్నారు. ఫిబ్రవరి 2016 – ఆగస్టు 2020 మధ్య నిర్వహించిన 10 సర్వేలను పోలిస్తే.. మోదీకి ప్రజాదరణ గణనీయంగా పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది.
సర్వేలోని ముఖ్యాంశాలు
- మోదీ ప్రజాదరణ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అత్యధికంగా(4 పాయింట్ స్కేల్‌పై3.14గా) ఉంది.
- మోదీ ప్రజాదరణ ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర భారతంలో 4 పాయింట్ స్కేల్‌పై3.01గా, తూర్పు భారత్‌లో 3.02గా, దక్షిణ భారతంలో 2.99గా ఉంది.
- మతాల వారీగా చూస్తే హిందువుల్లో 3.13, ముస్లింల్లో2.33 గా మోదీపై ప్రజాదరణ ఉంది. - కులాలవారీగా మోదీ ఓబీసీ, ఎంబీసీల్లో అత్యధికంగా 3.08, దళితుల్లో 3.01, అగ్రవర్ణాల్లో 2.99 స్కోరు సాధించారు.
- ప్రతిపక్షంగా కాంగ్రెస్ పనితీరు చాలా బావుందని కేవలం 9 శాతం మంది అభిప్రాయపడగా, బావుందని 35 శాతం, సాధారణమని 32 శాతం, బాగాలేదని21 శాతం మంది తెలిపారు.
- మోదీ ప్రభుత్వ అతిపెద్ద విజయం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అని16 శాతం మంది అభిప్రాయపడ్డారు.
- కరోనాను సరిగ్గా నియంత్రించలేకపోవడంమోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని 25 శాతం, నిరుద్యోగమని 23 శాతం, వలస కార్మికుల సంక్షోభమని 14 శాతం మంది తెలిపారు.
- తూర్పు లద్దాఖ్‌లో చైనాకు సరైన గుణపాఠం చెప్పిందని 69 శాతం మంది తెలిపారు.
- చైనా వస్తువుల బహిష్కరణకు 90 శాతం మంది మద్దతు పలికారు.
- పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిస్తామని 50 శాతం మంది స్పష్టం చేశారు.

#Tags