Vande Bharat: చెన్నైలో వందే భారత్ స్లీపర్ ఆవిష్కరణ
వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైలును చెన్నై ఐసీఎఫ్‌లో అక్టోబర్ 23వ తేదీ ఆవిష్కరించారు.
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) జనరల్ మేనేజర్ సుబ్బారావు ఈ రైలు గురించి తెలిపారు. చెన్నైలోని ఐసీఎఫ్‌లో వందే భారత్ రైళ్ల తయారీ జరుగుతోందని చెప్పారు. దీంతోపాటు వందే మెట్రో రైళ్లు, అమృత్ వందే మెట్రో రైళ్లు కూడా తయారు చేస్తున్నామన్నారు.
అదే సమయంలో స్లీపర్ సౌకర్యాలతో కూడిన వందే భారత్ రైళ్లను సిద్ధం చేసి రాత్రి వేళల్లో నడపాలని రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా స్లీపర్ వెర్షన్ అన్ని హంగులతో రూపుదిద్దుకుందని వివరించారు. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించి పట్టా లెక్కించబోతున్నట్లు తెలిపారు.
Railway Ticket Booking: రైల్వే టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కాల పరిమితి తగ్గింపు.. ఎన్నిరోజులంటే..
#Tags