PM Modi: ప్రయాగరాజ్ మహా కుంభమేళా.. రూ.5,050 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో డిసెంబర్ 13వ తేదీ పర్యటించారు.
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న క్రమంలో రూ.5,500 కోట్ల విలువైన కుంభమేళాకు సంబంధించి పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
అనంతరం ప్రసిద్ధ అక్షయ వట వృక్షం వద్ద పూజలు నిర్వహించారు. హనుమాన్ మందిర్, సరస్వతి కూప్‌ను సందర్శించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ ఈ ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, చాట్‌బాట్ సేవలు వినియోగించుకోబోతున్నట్లు వెల్లడించారు. దేశప్రజలంతా ఈ మహా కుంభమేళాకు తరలి రావాలంటూ మోదీ పిలుపునిచ్చారు. మహాకుంభ్‌లో కుల, వర్గ వైషమ్యాలు నశించిపోతాయని, కోట్లాదిమంది ఒకే భావజాలంతో ముడిపడతారని అన్నారు.
Smart India Hackathon: అవరోధాలు తొలగిస్తూ సంస్కరణలు.. ప్రధాని మోదీ
#Tags