Vande Bharat Trains: మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను ఆగస్టు 31వ తేదీ జెండా ఊపి ప్రారంభించారు.

మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్-లక్నోల మధ్య ఆగ‌స్టు 31వ తేదీ నుంచి వందేభారత్‌ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.
 
లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల రెగ్యులర్ ఆపరేషన్ సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 

ఈ కొత్త వందే భారత్ రైళ్లు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అనే మూడు రాష్ట్రాలకు సేవలు అందీయ‌నున్నాయి. దేశంలోని 280 జిల్లాలను కలుపుతున్న 100కు పైగా సెమీ హైస్పీడ్ రైళ్లలో ఈ కొత్త రైళ్లు చేరనున్నాయి.  

Railway Projects: రూ.6,456 కోట్ల.. రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్‌లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి.

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మూడు మార్గాల్లో (మీరట్-లక్నో, మదురై-బెంగళూరు, చెన్నై-నాగర్ కోయిల్) కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. 

#Tags