Drone Summit 2024: అమరావతిలో డ్రోన్స్‌ సమ్మిట్.. క‌ర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ హబ్

అమరావతి డ్రోన్స్‌ సమ్మిట్–2024ను ఏపీ సీఎం చంద్రబాబు అక్టోబర్ 22వ తేదీన మంగళగిరిలో ప్రారంభించారు.

ఈ సమ్మిట్ రెండు రోజుల పాటు జ‌రుగుతుంది. డ్రోన్స్‌ తయారీ, వినియోగంపై మినహాయింపులు పెంచాలని, నియంత్రణ పరిమితంగా ఉండాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. డ్రోన్స్‌ టెక్నాలజీ భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషించనున్నది.

అంతేకాక, చంద్రబాబు కర్నూలు జిల్లాలో 300 ఎకరాలను డ్రోన్స్‌ హబ్‌కు కేటాయించబోతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 20,000 మందికి డ్రోన్‌ పైలట్‌ శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నారు. అమరావతిని 'డ్రోన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా'గా తీర్చిదిద్దడంపై దృష్టి సారించారు. 15 రోజుల్లో వ్యాపార అనుకూల వాతావరణం కల్పించేందుకు సమగ్ర విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నారు.

డ్రోన్స్‌ వ్యవసాయం, మౌలిక సదుపాయాల నిర్వహణ, రోడ్లు, ట్రాఫిక్, చెత్త నిర్వహణలో కీలకంగా మారనున్నాయి. నేరాల మీద డ్రోన్స్‌ ద్వారా నిఘా పెడతామని చెప్పారు. సదస్సులో క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో, ఐఐటీ తిరుపతితో ఒప్పందాలు కుదుర్చారు. ఏపీ డ్రోన్స్‌ ముసాయిదా విధానాన్ని విడుదల చేశారు. 

NDTV World Summit: ఎన్‌డీటీవీ ప్రపంచ సదస్సు.. ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణమ‌న్న మోదీ

#Tags