Drugs Seize: అరేబియా సముద్రంలో భారత నౌకాదళం భారీ డ్రగ్స్ స్వాధీనం
ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో నవంబర్ 29వ తేదీ నేవీ ఒక పోస్టు చేసింది.
నిఘా వర్గాల సమాచారం మేరకు.. ఈ డ్రగ్స్ క్రిస్టల్ మెత్ (Crystal Meth)గా గుర్తించారు. రూపాయల కోట్లు విలువ చేసే ఈ మాదక ద్రవ్యాలను రెండు పడవల ద్వారా తరలిస్తున్న నిందితులను పట్టుకుని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆపరేషన్ వివరాలు..
భారతదేశం, శ్రీలంక మధ్య సంయుక్త సముద్ర నావికాదళ ఆపరేషన్‌పై జరిగిన ఈ ఛేజింగ్, సముద్ర స్మగ్లింగ్‌ను అరికట్టడానికి అతి కీలకమైనది. క్రిస్టల్ మెత్ తరలిస్తున్న రెండు పడవలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ డ్రగ్స్‌ను అరేబియా సముద్రంలో పట్టుకోవడం వలన, స్మగ్లింగ్ చర్యను కట్టడి చేయడంలో పెద్ద విజయం సాధించారు.
Immuno-Oncology Drug: భారత్‌లో తొలిసారి.. క్యాన్సర్‌కు కొత్త మందు
ఇటీవల.. భారత తీర రక్షక దళం (ఐసీజీ) కూడా అండమాన్ నికోబార్ ప్రాంతంలో 6 వేల కిలోల డ్రగ్స్ తరలిస్తున్న ఓ బోటును సీజ్ చేసింది. ఇది కోస్ట్ గార్డ్ చరిత్రలో ఇదే మొదటిసారి, అంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడమేనని అధికారులు పేర్కొన్నారు.