Hemant Soren: జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్

జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన గిరిజన నేత హేమంత్‌ సోరెన్‌(49) ప్రమాణ స్వీకారం చేశారు.

రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో న‌వంబ‌ర్ 28వ తేదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా హేమంత్‌ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతలు హాజరయ్యారు.

హేమంత్‌ సోరెన్ ఈమేరకు "చారిత్రక దినం" అని పేర్కొంటూ.. జార్ఖండ్‌ ప్రజల ఐకమత్యాన్ని వర్ణించారు. ఆయన ప్రకటనలో "మా గొంతు నొక్కేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ఉద్యమం మరింత తీవ్రతరమైంది" అని అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జేఎంఎం పార్టీ 81 స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో 56 సీట్లు గెలిచింది. 43 స్థానాల్లో పోటీ చేసిన జేఎంఎం, మొదటిసారి 34 చోట్ల విజయం సాధించింది.

Minister of Health : ప్రజారోగ్యం విషయంలో ట్రంప్ కీలక నిర్ణ‌యం.. మ‌రో మంత్రిగా..!

#Tags