Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (54) డిసెంబ‌ర్ 5వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు.

ఉత్కంఠ నెలకొల్పుతూ, ఉప ముఖ్యమంత్రులుగా శివసేన (షిండే) నేత ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) నాయకుడు అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. వారితో గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 

దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఇది మూడోసారి కాగా, అజిత్‌ పవార్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదా పొందడం ఇది ఆయన ఆరోసారి.

ముంబై ఆజాద్‌ మైదాన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు ఎన్‌డీఏ అలయన్స్ నేతలు పాల్గొన్నారు.

ఫడ్నవీస్ మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా, ఏక్‌నాథ్‌ షిండే మరియు అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారు రాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’కి చేరుకొని సంబంధిత ద్రస్తాలపై సంతకాలు చేసి అధికార బాధ్యతలు చేపట్టారు.

Jharkhand CM: జార్ఖండ్ 14వ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

ఫడ్నవీస్ సీఎం హోదాలో తన తొలి కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఒక రోగికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.

#Tags