Karnataka Elections 2023: గృహిణులకు నెలకు రూ.2 వేలు

కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే గృహిణులకు నెలకు రూ.2 వేలు చొప్పున అందజేస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా చెప్పారు.

జ‌న‌వ‌రి 16న‌ బెంగళూరులో మహిళల కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గృహ లక్ష్మి యోజన పథకంలో భాగంగా ఏడాదికి రూ.24 వేలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. కోటిన్నర మందికి దీంతో లబ్ధి కలుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళలకు ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫోస్టో విడుదల చేస్తామన్నారు. కర్నాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

Miss Universe 2022: మిస్‌ యూనివర్స్‌గా ఆర్‌బోనీ గాబ్రియల్‌

#Tags