Chhatrapati Shivaji Maharaj Jayanti- ఛత్రపతి శివాజీ శౌర్యానికి మారుపేరని ఎందుకంటారు?

ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని మొఘలుల బారి నుండి విముక్తి చేసి, మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిన శివాజీ శౌర్య పరాక్రమాలు చరిత్రలోని బంగారు పుటలలో నిక్షిప్తమయ్యాయి. భారతదేశంలో శివాజీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేటికీ ఛత్రపతి శివాజీని శౌర్యానికి ప్రతీకగా చెబుతుంటారు.

వాటి ప్రభావం శివాజీ మీద..

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతియేటా ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు. శివాజీ 1630, ఫిబ్రవరి 19న శివనేరి కోటలోని మరాఠా కుటుంబంలో జన్మించాడు. శివాజీ పూర్తి పేరు శివాజీ భోంస్లే. అతని తండ్రి పేరు షాజీ భోంస్లే, తల్లి పేరు జిజియాబాయి. శివాజీ తండ్రి అహ్మద్‌నగర్ సుల్తానేట్‌లో పనిచేసేవారు. శివాజీ తల్లికి మతపరమైన గ్రంథాలపై అమితమైన ఆసక్తి ఉండేది. ఇదే శివాజీ జీవితంపై ప్రభావం చూపింది. మహారాజ్ శివాజీ జన్మించిన కాలంలో దేశంలో మొఘలుల దండయాత్ర కొనసాగుతోంది. 

మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా..

ఛత్రపతి శివాజీ మహారాజ్ తన 15 ఏళ్ల వయసులో మొఘలులపై తన మొదటి దాడిని చేశాడు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసమే ఈ దాడి జరిగింది. దీనినే గెరిల్లా వార్‌ఫేర్ విధానం అంటారు. శివాజీ ఈ కొత్త తరహా యుద్ధానికి ప్రాచుర్యం కల్పించారు. గెరిల్లా వార్‌ఫేర్ సూత్రం ‘హిట్ అండ్ రన్‌వే’. శివాజీ బీజాపూర్‌పై తన గెరిల్లా యుద్ధ  నైపుణ్యంతో దాడిచేసి అక్కడి పాలకుడు ఆదిల్షాను ఓడించి, బీజాపూర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాడు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ 1674లో పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. ఈ సమయంలోనే శివాజీ అధికారికంగా మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఛత్రపతి శివాజీని ‘మరాఠా గౌరవ్’ అని కూడా పిలిచేవారు. శివాజీ తీవ్ర అనారోగ్యంతో 1680 ఏప్రిల్ 3న కన్నుమూశాడు. అనంతరం ఆయన కుమారుడు శంభాజీ రాజ్యాధికారాన్ని చేపట్టాడు.

#Tags