SP Balasubrahmanyam: చెన్నైలో రోడ్డుకు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు

తమిళనాడు రాజధాని చెన్నైలోని నుంగం బాక్కం కమ్దార్ నగర్ మెయిన్ రోడ్డుకు గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం రోడ్డుగా నామకరణం చేయాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను, ప్రకటనను ఎస్పీబీ వర్ధంతి సందర్భంగా సెప్టెంబ‌ర్ 25వ తేదీ విడుదల చేశారు. 

'గాన గంధరుడ్విగా ఎస్పీ బాల సుబ్రమణ్యం సంగీత ప్రపంచానికి, సినీ రంగానికి చేసిన సేవలు అజరామరం. ఆయన అందర్నీ వీడి అనంతలోకాలకు వెళ్లినా తన పాటల రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగానే ఉన్నారు. చెన్నై నుంగంబాక్కంలోని కమ్డారనగర్ తొలి మెయిన్ రోడ్కు.. ఎస్.పి. బాలసుబ్రహ్మంణ్యం రోడ్ పేరు పెట్టాలి అన్న విజ్ఞప్తి మేరకు సీఎం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు' అని ప్రకటనలో తెలిపారు.

ఎస్పీబీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠా భాషల్లో పాటలు పాడారు. ఈయ‌న 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు  అందుకున్నారు. అలాగే ఆయనకు కేంద్ర ప్ర‌భుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మ భూషణ్, 2021లో పద్మ విభూషణ్ అవార్డుల‌ను అందించింది.

Air Train: భార‌త్‌లో ప్రారంభం కానున్న తొలి ఎయిర్ ట్రైన్.. దీని ప్రత్యేకతలివే..

#Tags