Atishi: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన‌ అతిషి

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి సెప్టెంబర్ 21వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అతిషి ఎల్జీ కార్యాలయం రాజ్‌నివాస్‌లో ప్రమాణం చేయించారు. దీంతో 43 ఏళ్ల ఆతిషి ఢిల్లీకి యంగెస్ట్‌ సీఎంగా రికార్డు సృష్టించారు. సుష్మా స్వరాజ్‌, షీలా దీక్షిత్‌ తరువాత ఢిల్లీ సీఎం పదవిని చేపట్టిన మూడో మహిళా నేత ఆతిషి రికార్డుకెక్కారు.

అతిషితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో సౌరభ్‌ భరద్వాజ్‌, గోపాల్‌రాయ్‌, ముకేష్‌ అహ్లావత్‌, కైలాష్ గహ్లోత్, ఇమ్రాన్‌హుస్సేన్‌ మంత్రులుగా భాద్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారానికి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్‌ఆద్మీపార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. 2025 ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి. 

Manoj Kumar: కోల్‌కతా కొత్త కమిషనర్‌గా నియమితులైన‌ మనోజ్‌వర్మ

#Tags