Aadhar Number : ఆధార్– ఓటర్ ఐడీ.. అనుసంధానానికి అమోదం
ఓటర్ ఐడీని ఆధార్ నెంబర్‌తో అనుసంధానించడం సహా పలు ఎన్నికల సంస్కరణలు పొందుపరిచిన బిల్లుకు లోక్‌సభ డిసెంబర్ 20వ తేదీన ఆమోదం తెలిపింది.
మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. ఎన్నికల చట్ట సవరణ బిల్లు– 2021ను డిసెంబర్ 20వ తేదీన న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఓటర్ ఐడీ– ఆధార్‌ను లింక్ చేయడం వల్ల బోగస్ ఓట్లను ఏరివేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఆధార్ లింకింగ్‌తో పాటు కొత్త ఓటర్ల నమోదుకు నాలుగు కటాఫ్ డేట్లను (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) నిర్ణయించడం, సరీ్వసు ఓటర్ నిబంధనలో మార్పును బిల్లులో పొందుపరిచారు.
#Tags