TOEFL Exam: ‘టోఫెల్‌’ పరీక్ష కాల వ్యవధి గంట తగ్గింపు.. జూలై 26 నుంచి అమల్లోకి..

విదేశీ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఉపకరించే ‘టోఫెల్‌’ పరీక్ష ఇకపై రెండు గంటలలోపే ముగియనుంది.

ప్రస్తుతం ఈ పరీక్షను మూడు గంటలపాటు నిర్వహిస్తున్నారు. అధికారిక స్కోర్‌ను విడుదల చేసే తేదీని టోఫెల్‌ పూర్తికాగానే అభ్యర్థులు తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఈటీఎస్‌) వెల్లడించింది. టోఫెల్‌ ఒక గంట 56 నిమిషాల పాటు ఉంటుందని పేర్కొంది. టోఫెల్‌లో చేస్తున్న మార్పులు ఈ ఏడాది జూలై 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. టోఫెల్‌ స్కోర్‌ను 160కి పైగా దేశాల్లో 11,500కిపైగా యూనివర్సిటీలు అంగీకరిస్తున్నాయి. 

Study Abroad: విదేశీ విద్యకు.. ముందస్తు ప్రణాళిక!

ఇందులో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని వర్సిటీలు ఉన్నాయి. టోఫెల్ రిజిస్ట్రేష‌న్‌ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు ఈటీఎస్‌ సీఈవో అమిత్‌ సేవక్‌ తెలిపారు. టెస్టు ఫీజును భారతీయ రూపాయల్లో చెల్లించవచ్చని సూచించారు. టోఫెల్‌ ప్రక్రియలో తీసుకొస్తున్న మార్పులతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అసోసియేషన ఆఫ్‌ ఆ్రస్టేలియన్‌ ఎడ్యుకేషన్‌ రిప్రజంటేటివ్స్‌ ఇన్‌ ఇండియా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి బొర్రా వివరించారు.  

VISA: దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా

#Tags