UN Population Report: జనాభాలో మనమే ఫస్ట్.. జనాభాలో చైనాను దాటేసిన భారత్!
జనాభాలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించింది.
తాజాగా ఐక్యరాజ్యసమితి చెందిన సంస్థ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2023’ నివేదిను యూఎన్ అధికారులు విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం చైనా కంటే ఇండియాలో 29 లక్షల మంది ఎక్కువగా ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత జనాభా 142.86 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, చైనా జనాభా 142.57 కోట్లతో రెండో స్థానంలో ఉంది. యూఎస్ఏ 340 మిలియన్ల జనాభాతో మూడో స్థానంలో ఉన్నట్లు యుఎన్ అంచనా వేసింది.
2023 ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ నివేదిక వెల్లడించినట్లు ఐక్యారాజ్యసమతి జనాభా విభాగం స్పష్టం చేసింది. కాగా భారత్ చివరిసారి 2011లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టింది. 2021లో జరగాల్సిన జన గణన కరోనా కారణంగా ఆగిపోయింది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు వాటా భారత్, చైనాదే ఉందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది.
UN Statistical Commission: ఐరాస స్టాటిస్టికల్ కమిషన్‌కు భారత్ ఎన్నిక
#Tags