Navratna Status: నాలుగు సంస్థలకు నవరత్న హోదా.. ఏ కంపెనీలకంటే..

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మరో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదాను ప్రకటించింది.

ఇందులో ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థలైన నేషనల్‌ హైడ్రాలిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (NHPC), సట్లజ్‌ జల విద్యుత్‌ నిగమ్ (SJVN), సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(SECI), రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (RCIL)కు నవరత్న హోదా లభించింది. దీంతో భారతదేశంలో నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం సంఖ్య 25కి చేరుకుంది. 

ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎన్‌హెచ్‌పీసీ, ఎస్‌జేవీఎన్‌లు మినీరత్న కేటగిరీ–1 కంపెనీలుగా ఉండగా తాజాగా ప్రభుత్వం నవరత్న హోదాను ఇచ్చింది.

‘ప్రభుత్వరంగ సంస్థల విభాగం ఆగస్ట్‌ 30న ఎన్‌హెచ్‌పీసీని నవరత్న కంపెనీగా ప్రకటించింది. ఇది నిర్వహణ, ఆర్థిక పరంగా స్వయంప్రతిపత్తిని తీసుకొస్తుంది’ అని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. 

RBI: బ్యాంకింగ్ వ్యవస్థపై ఆర్‌బీఐ నివేదిక.. తాజా ఆవిష్కరణలు ఇవే..

#Tags