Reserve Bank of India: ఇటీవల షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ హోదా పొందిన బ్యాంక్‌?

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ హోదా లభించింది. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిసెంబర్‌ 9న ఒక ప్రకటన విడుదల చేసింది. దీనివల్ల ఆర్‌బీఐ, 1934కు సంబంధించి సెకండ్‌ షెడ్యూల్‌లో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ చేరుతుంది. వినియోగదారులకు మరిన్ని ఫైనాన్షియల్‌ సేవలు అందించగలుగుతంది. అలాగే బ్యాంక్‌ కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు. ప్రభుత్వం, పెద్ద సంస్థల బాండ్లు, వేలం, రెపో, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ ఆపరేషన్స్‌లో పాల్గొనడం వంటి సౌలభ్యతలు కూడా ఒనగూరుతాయి. ప్రభుత్వ స్కీమ్‌ నిర్వహణలో భాగం పంచుకోవచ్చు.

దిగుమతుల వాటానే 86 శాతం వరకూ..

భారత్‌ తన బంగారం అవసరాలకు దిగుమతుల మీదే ప్రధానంగా ఆధారపడుతోందని  ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ‘భారత్‌లో బులియన్‌ ట్రెండ్‌’ నివేదిక ఒకటి వెల్లడించింది. దేశంలో 2016–2020 మధ్య జరిగిన మొత్తం సరఫరాల్లో దిగుమతుల వాటానే 86 శాతం వరకూ ఉందని వివరించింది.
చ‌ద‌వండి: భారత్‌ నుంచి లీడర్‌షిప్‌ ర్యాంకింగ్‌ దక్కించుకున్న ఏకైక సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ హోదా పొందిన బ్యాంక్‌?
ఎప్పుడు : డిసెంబర్‌ 9
ఎవరు    : పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌
ఎందుకు : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం మేరకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags