Third Largest Economy: మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్‌!

ఎస్ అండ్ పీ గ్లోబల్ అనే అంతర్జాతీయ ఆర్థిక సమాచార-విశ్లేషణ సంస్థ తన తాజా నివేదికలో భారతదేశం 2030-31 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు 6.7% గా ఉంటుందని అంచనా వేసింది. 2023-24లో భారత్ 8.2% వృద్ధి రేటును నమోదు చేసినట్లు తెలిపింది.

నివేదికలో వెల్లడించిన కీలక అంశాలు ఇవే..
వృద్ధి ప్రోత్సహించడానికి సంస్కరణలు: వ్యాపార లావాదేవీలు, రవాణా మెరుగుదల, ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదల, ప్రభుత్వ మూలధనంపై ఆధారపడటం తగ్గించడానికి సంస్కరణలు కొనసాగించడం ముఖ్యమని వివరించింది.

బలమైన ఆర్థిక అంచనాలు: ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై బలమైన అంచనాలు, పటిష్ఠ నియంత్రణ విధానాల వల్ల ఈక్విటీ మార్కెట్ల దూకుడు కొనసాగవచ్చు. పోటీ సామర్థ్యం మెరుగుపడవచ్చు.

నిధుల రాక: వర్థమాన మార్కెట్ల సూచీల్లో భారత్ చేరికతో, భారత ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడుల రాక పెరిగింది.

మౌలిక వసతులు: వాణిజ్య లాభాలను పెంచేందుకు మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి. దేశానికి ఉన్న విస్తృత తీర ప్రాంతంపై ఎక్కువగా దృష్టి సారించాలి.

NextGen Digital Platform: ఎస్ఐసీకి నెక్ట్స్‌జెన్ డిజిటల్ ప్లాట్‌ఫాంను రూపాందించనున్న ఇన్ఫోసిస్!

సముద్ర రవాణా: భారత వాణిజ్యంలో సుమారు 90% సముద్ర రవాణా ద్వారానే జరుగుతోంది. అందువల్ల, ఎగుమతులను పెంచేందుకు ఓడరేవుల మౌలిక వసతులను పటిష్ఠం చేయాలి.

ఇంధన అవసరాలు: దేశీయంగా ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో, పునరుత్పాదక, తక్కువ ఉద్గార ఇంధనాలు, ఇంధన భద్రత సమతుల్యత వంటి అంశాలపై దృష్టి సారించాలి.

వ్యవసాయ రంగం: వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచేందుకు కొత్త సాంకేతికతలు, కొత్త విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags