Bin Laden Family Charity: ప్రిన్స్ చార్లెస్ ఛారిటీకి రూ.9.64 కోట్లు
అమెరికాలో సెప్టెంబర్ 11 దాడుల మాస్టర్‌మైండ్, అల్‌ఖైదా ఉగ్ర సంస్థ అగ్రనేత దివంగత ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి బ్రిటన్ రాచకుటుంబ సంబంధ దాతృత్వ సంస్థకు భారీ విరాళాలు అందాయి. ‘ది సండే టైమ్స్’ తాజా కథనంలో ఈ మేరకు వెల్లడించింది. ‘‘లాడెన్‌ను అమెరికా మట్టుపెట్టిన రెండేళ్లకు 2013లో అతని సవతి సోదరుడైన షేక్ బకర్ బిన్ లాడెన్‌ను బ్రిటన్ యువరాజు చార్లెస్ లండన్లో కలిశారు. మిలియన్ పౌండ్లు (రూ.9.64 కోట్లు) ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటబుల్ ఫండ్‌కు విరాళంగా తీసుకున్నారు. ఇది సరికాదని, వాటిని వెనక్కివ్వాలని సలహాదారులు చెప్పినా ఒప్పుకోలేదు’’ అని పేర్కొంది.
Also read: CWG 2022 : మీరాబాయి చానుకి స్వర్ణం
#Tags