AP Google AI: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గూగుల్‌తో కీలక ఒప్పందం చేసుకుంది.

ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

అమరావతిలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ బిక్రమ్‌సింగ్‌ బేడి, ఏపీ రియల్‌టైం గవర్నెన్స్‌ శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ద్వారా.. 10,000 మంది విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై శిక్షణ అందించేందుకు గూగుల్ సహకారం అందిస్తుంది. ఇందులో డేటా ఎనలిటిక్స్, జనరేటివ్ ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాలు ఉన్నాయి.

Andhra Pradesh: గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్‌వన్.. అలాగే వీటి ఉత్పత్తిలోనూ..

గూగుల్ మరిన్ని మెంటార్‌షిప్, నెట్‌వర్కింగ్ అవకాశాలు, యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో కలిసి పనిచేయనుంది. విపత్తు నిర్వహణ, గాలి నాణ్యత, పట్టణ ప్రణాళిక వంటి సవాళ్లను పరిష్కరించడంలో కూడా గూగుల్ సహకారం అందించనుంది. అంతేకాక, ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం, రోగ నిర్ధారణ ఫలితాలను వేగవంతం చేయడం లో కూడా సహకారం అందించనుంది.

అలాగే.. వ్యవసాయం, ట్రాఫిక్ నిర్వహణ, వెబ్‌సైట్ ఆధునికీకరణ, పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో క్లౌడ్ టెక్నాలజీ ఆధారిత పైలట్ ప్రాజెక్టుల‌కు గూగుల్ సహకారం అందించనుంది.

Panchayati Raj Institution: పంచాయతీరాజ్‌ సంస్థల రాబడుల్లో ఏపీ భారీ వృద్ధి.. గత ఐదేళ్లలో..

#Tags