యురేనియం నిల్వలు పెంచుకున్నాం: ఇరాన్
ఆధునిక సెంట్రిఫ్యూజ్‌ల అభివృద్ధితో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మరింతగా పెంచుకున్నట్లు ఇరాన్ అణు ఇంధన సంస్థ సెప్టెంబర్ 7న ప్రకటించింది.
ఐఆర్-4, ఐఆర్-6 సెంట్రిఫ్యూజ్‌లను 20 చొప్పున సిద్ధం చేశామని.. ఇవి గతంలో వాటికంటే చాలా రెట్లు శక్తివంతమైనవని వెల్లడించింది. 2015 అణు ఒప్పందం అమలయ్యేలా చూసేందుకు, ఇరాన్‌పై ఆంక్షలు తొలగించేందుకు బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
#Tags