యుకె సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం

యునెటైడ్ కింగ్ డమ్ (యుకె)కి చెందిన నేషనల్ హెల్త్ సిస్టమ్, హెల్త్ ఎడ్యుకేషన్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదర్చుకుంది.
తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యాలయంలో అక్టోబర్ 16న బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని పలు నర్సింగ్ కాలేజీల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యుకె సంస్థలు సహకరిస్తాయి.
#Tags