యాంటీబాడీస్‌ వృద్ధిపై సీరోసెరాలజీ సర్వే

భారత ప్రజల్లో కరోనాకు విరుగుడుగా యాంటీబాడీస్‌ వృద్ధి అనే అంశంపై సీరోసెరాలజీ సర్వే నిర్వహిస్తోంది.
దేశ ప్రజల్లో కరోనాకు విరుగుడుగా యాంటీబాడీస్‌ వృద్ధి వేగంగా జరుగుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. భవిష్యత్‌లో కరోనాను ఎదుర్కోవడంలో ఇది మంచి పరిణామమని నిపుణులు చెబుతున్నారు.

సర్వేలోని అంశాలు
  • పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే కరోనాను అత్యంత శక్తివంతంగా ఎదుర్కొంటున్నారు.
  • లండన్ మహా నగరంలో సెరాలజీ సర్వే నిర్వహించగా కేవలం 17.5 శాతం మందికి మాత్రమే యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయి.
  • భారత్ లోని పుణే నగరంలో సర్వే నిర్వహించగా 51.5 శాతం మందికి యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయి.
  • ముంబైలోని ధారావితో పాటు పలు మురికివాడల్లో 6 వేలకు పైగా నమూనాలు సేకరించగా.. అందులో 57 శాతం మందికి వారికి తెలియకుండానే కరోనా సోకి నయమైంది.

సీరోసెరాలజీ వివిధ నగరాల్లో..

నగరం

యాంటీబాడీస్‌ శాతం

ఢిల్లీ

23

ముంబై స్లమ్స్‌

57

ముంబై నాన్ స్లమ్స్‌

16

పుణే

51

బెర్హంపురం

31


క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రజల్లో కరోనాకు విరుగుడుగా యాంటీబాడీస్‌ వృద్ధి అనే అంశంపై సర్వే
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : సీరోసెరాలజీ





#Tags