యాంఫీ ప్రచార కర్తలుగా సచిన్, ధోని

భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనిలు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్‌‌స ఇన్ ఇండియా(యాంఫీ) ప్రచార కర్తలుగా వ్యవహరించనున్నారు.
ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు జనవరి 30న యాంఫీ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం.. సచిన్, ధోనిలు ‘మ్యూచువల్ ఫండ్‌‌స సహి హై’ క్యాంపైన్‌కు ప్రచారం చేయనున్నారు. ఈ పరిశ్రమలోని ప్రొడక్ట్‌ల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగనుంది. ఈ విషయమై భారత్ రత్న అవార్డు గ్రహీత సచిన్ మాట్లాడుతూ.. ‘క్రమశిక్షణ, దీర్ఘకాలిక వ్యూహం అనేవి విజయానికి మూలస్తంభాలుగా భావిస్తున్నాను. అది ఏ క్రీడైనా, వ్యక్తిగత పెట్టుబడి అయినా సరే’ అని వ్యాఖ్యానించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యాంఫీ ప్రచార కర్తలుగా నియామకం
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని
ఎందుకు : మ్యూచువల్ ఫండ్‌‌స సహి హై’ క్యాంపైన్‌కు ప్రచారం చేసేందుకు




#Tags