వ్యాక్సిన్ ను సిద్ధం చేస్తున్నాం: ఇజ్రాయెల్
కరోనా చికిత్సకు తమ వద్ద అద్భుతమైన వ్యాక్సిన్ తయారుగా ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది.
అయితే ఈ వాక్సిన్ ని మానవ ప్రయోగం చేయాల్సి ఉందని, దీన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆగస్టు 6న ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి బెన్నీ గాంట్జ్ కోవిడ్ వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలను పరిశీలించేందుకు ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ రీసెర్చ్(ఐఐబీఆర్)ని సందర్శించారు. ఐఐబీఆర్ రక్షణ శాఖతో కలిసి ఈ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఈ ప్రయోగ కార్యక్రమాన్ని ప్రధాని కార్యాలయం పర్యవేక్షిస్తోంది.
జెనరా ఔషధానికి అనుమతి...
ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన జెనరా ఫార్మా.. కోవిడ్ చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ట్యాబ్లెట్స్ తయారీకై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి పొందింది. ఫావిజెన్ పేరుతో ఈ ట్యాబ్లెట్లను కంపెనీ తయారు చేయనుంది.
#Tags