విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రాజభాష పురస్కారం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రతిష్టాత్మక రాజభాష కీర్తి పురస్కారం లభించింది.
2018-19కిగాను హిందీ అమలులో చూపిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం రాజభాష కీర్తి పురస్కారం (ప్రథమ బహమతి) ప్రకటించింది. జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 14న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సహాయమంత్రులు నిత్యానందరాయ్, జి.కిషన్‌రెడ్డిల చేతుల మీదుగా స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్ ఈ అవార్డును అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రాజభాష కీర్తి పురస్కారం- 2018-19
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : విశాఖ స్టీల్‌ప్లాంట్
ఎందుకు : హిందీ అమలులో చూపిన ప్రతిభకు




#Tags